ఒకప్పుడు దసరా అంటే - సుమారు నెలరోజుల ముందు నుంచి మేం ఎదురుచూస్తూండేవాళ్లం. నా చిన్నప్పటి వరంగల్ జ్ఞాపకాల్లో దసరా కూడా ఒకటి.
ఉర్సు గుట్ట, ఉర్సు చెరువు మా ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉండేవి. బతుకమ్మ పండుగ అక్కడే, దసరా అక్కడే.
బెలూన్స్, లాయిలప్పాలు, పేపర్ ఫ్యాన్స్, టిక్టిక్కులు... ఎన్నో చిన్నపిల్లలు ఆడుకొనే ఆటవస్తువులు అప్పుడు 5 పైసలు, 10 పైసలే.
వరంగల్లోని మొత్తం 2,3 వార్డుల జనం అంతా అక్కడికి లక్షల్లో వచ్చి పండగ చేసుకునేవారు.
ప్రతి దసరా రోజు - ఎవరో ఒక వీఐపీ వచ్చి, అక్కడ రావణాసురుని పటాన్ని తుపాకీతో కాల్చటం, ఆ పటం పేపర్ ముక్కల్ని ఎగబడి కొందరు అందుకోవడం... అదంతా ఇప్పుడు లేదనుకుంటాను.
బాణసంచాతో భారీ ఎత్తున చేసిన రావణాసురున్ని కాల్చడం అనేది నేను వరంగల్ వదిలిపెట్టి, హైద్రాబాద్ వచ్చిన రోజుల్లో వచ్చిన కొత్త పరిణామం. బహుశా ఇప్పుడు అదే కొనసాగుతుంటుంది.
పండగ రోజు పొద్దున్నే పిండివంటలు, స్వీట్స్ ఇప్పుడు లేవు. మందు, నాన్-వెజ్ లేదు. వందలాది మంది కాదు... కనీసం అతి దగ్గరి బంధువులో కుటుంబసభ్యులో కలవటం అనేది కూడా ఇప్పుడు లేదు.
ఇప్పుడు దసరా పండగ అంటే... జస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్తడం. ఎవరైనా ముఖ్యమైనవాళ్లకి వాట్సాప్‌లో గ్రీటింగ్స్ పంపించడం. మనకు ఎవరైనా గ్రీటింగ్స్ పంపిస్తే, సేమ్ టు యూ అంటూ తిరిగి గ్రీటింగ్స్ పంపడం. అంతే.
మన సంస్కృతిని, మన సంప్రదాయాలను మనం కాపాడుకోలేని ఆధునికత, సాంకేతికతల్లో అసలు ఎటు కొట్టుకుపోతున్నాం మనం?
When we forget our festivals and culture, we lose a part of ourselves as human beings—and with it, the connection to our own people.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani