బిజినెస్, స్పిరిచువాలిటీ రెంటి మేళవింపు శ్రీధర్ ఆలోచనలు. నాకు బాగా నచ్చింది అతని ఆలోచనా విధానం, అతని ఫిలాసఫీ.
చెన్నైకి సుమారు 640 కిలోమీటర్ల దూరంలో, టెన్‌కాశి అనే ఒక చిన్న రూరల్ మున్సిపల్ ఏరియా నుంచి శ్రీధర్ అతని కార్పొరేట్ ఆపరేషన్స్ నడిపిస్తున్నాడు అనేది కళ్ళముందు కనిపిస్తున్న నిజం.
శ్రీధర్ ఫిలాసఫీ నుంచి ఒక 4 పాయింట్స్ ఇక్కడ చెప్తాను:
1. గ్రామీణ భారత్‌లోనే అసలైన స్కిల్ ఉంది. అది మనం ఉపయోగించుకోవాలి.
2. వ్యవసాయదారుడు జస్ట్ ఫార్మర్ కదు. అతనొక సాయిల్ ఎక్స్‌పర్ట్. పాలమ్మేవాడు మిల్క్ ఎక్స్‌పర్ట్. వాళ్లకి ఆ గౌరవం ఇవ్వాలి.
3. ఏఐ గాని, రోబోట్స్ గాని మనం తినే ఆహారాన్ని, మన ఆరోగ్యాన్ని ఎన్నటికీ రిప్లేస్ చెయ్యలేవు.
4. గ్రామాల్లో మనకు దొరికే స్వచ్ఛమైన సహజసిద్ఢమైన వాతావరణం, ప్రకృతి, నీరు, నేల, నింగి మనం నగరాల్లో చూడలేం. ఫీలవ్వలేం. గ్రామాల నుంచే మనం పనిచేసుకునే అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు ఆ పని చెయ్యకూడదు?
శ్రీధర్ వెంబు లాంటివాళ్ళని మనం గుర్తించాలి, ప్రోత్సహించాలి. ఇలాంటివాళ్ళు ఇకనుంచీ వందల్లో రావాలి.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani