Sunday, 19 October 2025

అందరికీ దీపావళి శుభాకాంక్షలు


ఈ సంవత్సరంలో జస్ట్ ఇంకో 73 రోజులే ఉన్నాయి. చాలా విషయాలు రివ్యూ చేసుకోవాల్సిన అవసరముంది.

కట్ చేస్తే -

చిన్నప్పుడు మా వరంగల్లో మేం జరుపుకొన్న దీపావళే చాలా బాగుండేది. 

ఒక వారం ముందే సంచీ పట్టుకుని వెళ్ళి, నవీన్ టాకీస్ గల్లీలో - పొటాష్, కుక్కషేర్లు, ఎర్రబాంబులు, పిట్ట బాంబులు, గుండు బాంబులు, లక్ష్మీ బాంబులు, కాకరపూవత్తులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, విష్ణు చక్రాలు, తాళ్ళు, విమానాలు, రాకెట్లు... మొత్తం ఒక 20 రకాల క్రాకర్స్ తెచ్చుకొనేవాళ్ళం. 

చేతిలో ఆ సంచీ పట్టుకొని ఇంటికి చేరే ఆ అరగంటలో ఎంత ఎగ్జయిట్‌మెంటో! 

అదంతా ఇప్పుడు మిస్సింగ్.
ముఖ్యంగా ఇక్కడ హైద్రాబాద్‌లో మిస్సింగ్. 

ఒక్క దీపావళి అనే కాదు... ఇప్పుడు ఏ పండగకీ అప్పటి పండగ ఫీలింగే లేదసలు.

ఏదో మిస్ అవుతోంది. 

ఇప్పుడు వరంగల్లో ఎలా ఉందో మరి, తెలీదు. 

దీపావళి అనగానే... వరంగల్లో అప్పటి మా 14 దర్వాజాల పెద్ద ఇల్లు గుర్తుకొస్తుంది నాకు. మా పెద్దింటి తంతెల మీద కూర్చుని వచ్చేపోయేవాళ్ళని పలుకరించే మా నాయిన గుర్తుకొస్తాడు. బయటి దర్వాజా దగ్గర రెండువైపులా ఉన్న గూట్లలో మా అమ్మ దీపాలు పెట్టడం గుర్తుకొస్తుంది. మా అన్న దయానంద్ గుర్తుకొస్తాడు. మా చిన్న తమ్ముడు వాసు గుర్తుకొస్తాడు.     

Some festivals take us back to our childhood—and to the people we miss the most. Such is life.

- మనోహర్ చిమ్మని    

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani