Tuesday, 7 October 2025

హిపోక్రసీతో ఎన్నాళ్ళు బ్రతుకుతాం?


నిన్న సాయంత్రం జరిగిన ఒక 'పబ్లిషింగ్ బిజినెస్' జూమ్ మీటింగ్‌లో ఢిల్లీ నుంచి మాట్లాడిన జతిన్ ఒక విషయం కోట్ చేశాడు: 

"ఎంత క్లాసిక్ బుక్ అయినా... దాన్ని 33 శాతం మందే ఇష్టపడతారు. ఇంకో 33 శాతం మంది ఆ పుస్తకాన్ని అసలు ఇష్టపడరు. మిగిలిన 34 శాతం మంది అసలు ఆ పుస్తకాన్ని పట్టించుకోరు" అని. 

నాకు వెంటనే జేమ్స్ ఆల్టుచర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కాకపోతే, అది మానవ సంబంధాల విషయంలో: 

“No matter who you are, no matter what you do, no matter who your audience is: 30 percent will love it, 30 percent will hate it, and 40 percent won't care. Stick with the people who love you and don't spend a single second on the rest. Life will be better that way.”

కట్ చేస్తే -      

మన జీవితంలోని మంచి చెడుల గురించి, సుఖ సంతోషాల గురించీ, మనం తీసుకునే నిర్ణయాల గురించీ, వాటి ఫలితాల గురించీ మనకి మనం నెమరేసుకొంటూ, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎప్పటికప్పుడు చాలా ఉంటుంది. 

బ్లాగింగ్ లాంటి "ఫ్లో రైటింగ్" వల్ల శాస్త్రీయంగా నాకు లభించే గొప్ప ఉపయోగం అదే.  

నాకు తోచింది ఏదైనా సరే రాసుకుంటూ నన్ను నేను ఇన్‌స్పయిర్ చేసుకుంటూ, నన్ను నేను ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా పెట్టుకొంటూ, ఉత్సాహపర్చుకొంటూ ఉంటాను. 

బ్లాగింగ్ ఒక అద్భుతమైన సాధనం. నమ్మరు కాని, బ్లాగింగ్ నిజంగా మనల్ని వేరే ఎడిక్షన్స్ జోలికి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. 

ఎవరేమనుకుంటారో అన్న మైండ్‌సెట్ లోంచి బయటపడగలిగితే చాలు... బ్లాగింగ్, మనతో మనం మాట్లాడుకోడానికి ఒక మంచి ఔట్‌లెట్‌లా పనిచేస్తుంది. ఎలాంటి హిపోక్రసీ, ఇన్‌హిబిషన్స్ లేకుండా అన్నీ పంచుకోగలిగిన ఒక అత్యంత ఆత్మీయమైన అతిదగ్గరి స్నేహితురాలు అవుతుంది.   

బ్లాగింగ్ ఒక థెరపీ. 
ఒక యోగా. 
ఒక ఆనందం. 
ఎలాంటి హిపోక్రసీ లేని ఒక సహచరి. 

ఈ నిజాన్ని ఇదే బ్లాగులో ఒక డజన్ సార్లు చెప్పుకొని ఉంటాను. ఈ నేపథ్యంలో చూసినప్పుడు, 2012 నుంచీ నాకున్న ఒకే ఒక్క అత్యంత ఆత్మీయ స్నేహితురాలు... నా బ్లాగింగ్. 

 “Content builds relationships. Relationships are built on trust.” — Andrew Davis     

- మనోహర్ చిమ్మని   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani