Tuesday, 14 October 2025

అసలు అన్నమే తినొద్దు(ట)!


ఈమధ్య కొన్ని నిమిషాల పాటు రోజూ నాకు అవసరమైన కొన్ని వీడియోల్ని యూట్యూబ్‌లో వెదుకుతూ స్టడీ చేస్తున్నాను. 

ముఖ్యంగా నాకిష్టమైన కొన్ని ఇంగ్లిష్ పాడ్‌కాస్టులు చూస్తున్నాను. ఈ మధ్యే ప్రారంభమైన ఒక తెలుగు పాడ్‌కాస్టు, ఒక సీనియర్ హిందీ జర్నలిస్టు పాడ్‌కాస్టు కూడా అప్పుడప్పుడు కొన్ని నిమిషాలపాటు చూస్తున్నాను.

ఈ క్రమంలో - మనకు అవసరం లేని పనికిరాని చెత్త వీడియోలు కూడా వందల్లో నా దృష్టికొచ్చాయి.

అలా నా దృష్టిలో పడిన కొన్ని వీడియోల్లోని చెత్త కంటెంట్ ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నా చదవండి. మంచి ఎంటర్‌టైన్మెంట్!  

> రైస్ తినొద్దు.
> చపాతీ తినొద్దు.
> పాలతో చేసిన కాఫీ, టీలు తాగొద్దు.
> స్వీట్స్ తినొద్దు.
> ఉప్పు అసలు ముట్టొద్దు.
> కారం మర్చిపోవాలి.
> పల్లినూనె వాడాలి.
> కొబ్బరి నూనె వాడాలి.
> పొద్దుటిపూట వాకింగ్ అసలు చెయ్యద్దు.
> నీళ్ళు ఎక్కువ తాగొద్దు. 
> నీళ్ళు బాగా తాగాలి.
> 8 గంటలు పడుకోవాలి.
> 4 గంటల నిద్ర చాలు.

ఇలా వేలకొద్ది కనిపిస్తాయి. అయితే ఇవ్వన్నీ ఎవరో అన్-ప్రొఫెషనల్ యూట్యూబర్స్ చెప్తున్నవి కాదు. పెద్ద పెద్ద పేరున్న డాక్టర్స్ చెప్తున్నవి!  

కట్ చేస్తే -

వీటిలో పై రెండు పాయింట్స్ మాత్రమే తీసుకుందాం...

అసలు రైస్ తినొద్దు ఏంటి? చిన్నప్పటినుంచీ మనం తింటున్నది అన్నమే కదా? ఏమైంది వీళ్లందరికి? అన్నం తినకుండా ఇంకేవేవో తినమనడం ఏంటి? అన్నం-పప్పుచారు కాంబినేషన్లో ఉన్న మజా వేరే వాటితో వస్తుందా?   

చపాతి తింటే పాయిజన్ అనడం ఏంటి? నార్ట్ ఇండియా అంతా చపాతీనే కదా తినేది? నేను నా చిన్నప్పటినుంచి చపాతీ ఇష్టంగా తింటున్నాను. ఇవ్వాళ ఉదయం కూడా రెండు చపాతీలు తిన్నాను. మధ్యాహ్నం కూడా ఇవ్వాళ మా ఇంట్లో చపాతీలే. 

అసలేమైంది వీళ్లందరికీ? ఆ ఇంటర్వ్యూలు చేస్తున్నకైనా కొంచెం ఉండాలిగా?

ఇలాంటి చెత్తంతా చెప్తున్న ఈ డాక్టర్స్‌ను ఎవరికి చూపించాలి? 

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani