సుమారు ఒకటిన్నర నెలకింద, "నేను సినిమాలు చేయడం లేదు" అని నా వాట్సాప్ స్టేటస్, సోషల్ మీడియా పోస్టుల్లో, బ్లాగులో చిన్నగా ఒక ఫీలర్ వదిలాను.
కట్ చేస్తే -
అందరూ నన్ను పట్టించుకోడం మానేశారు.
అంతకుముందు ఇంటిదగ్గర కారులో డ్రాప్ చేసే మిత్రులు, ఇప్పుడు బోయిన్‌పల్లి దగ్గరే కారాపి, "ఇక్కడ్నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళండి... షేర్ ఆటోలు కూడా దొరుకుతాయి" అని నిర్మొహమాటంగా అనేస్తున్నారు.
కొందరైతే అసలు నా వాట్సాప్ మెసేజెస్ కూడా ఓపెన్ చెయ్యట్లేదు!
మొన్నటివరకూ నా ప్రతిచిన్న పనినీ సీరియస్‌గా తీసుకొని చేసినవాళ్ళంతా, ఇప్పుడు పూర్తిగా లైట్ తీసుకున్నారు.
మా ఆఫీస్ బాయ్ కిరణ్‌తో సహా...😊
మా టీమ్‌లోని దాదాపు అందరూ
మా ఆఫీస్ బాయ్ కిరణ్‌తో సహా...😊
మా టీమ్‌లోని దాదాపు అందరూ
నన్ను లైట్ తీసుకున్నారు.
కాల్స్ లేవు.
మెసేజెస్ లేవు.
నేను చేసినా రెస్పాన్స్ లేదు.
కాల్స్ లేవు.
మెసేజెస్ లేవు.
నేను చేసినా రెస్పాన్స్ లేదు.
ఇప్పుడు నాకు బాగా అర్థమైంది...
నాకు వాల్యూ ఎక్కడుందో, ఎందుకుందో.
ఎవరు నాకు ఏ స్థాయి మిత్రులో,
ఎవరు నా నిజమైన శ్రేయోభిలాషులో.
ఎవరి ప్రయారిటీలో నేను ఎక్కడున్నానో.
ఎవరి ప్రయారిటీలో నేను ఎక్కడున్నానో.
ఎంతైనా సినిమాకున్న పవర్ వేరే!
సినిమా సినిమానే...
కట్ చేస్తే -
నేను సినిమాలు మానెయ్యటం అంతా ఉట్టిదే... ఇప్పుడు నేనొక నాలుగు సినిమాలకు సీరియస్‌గా పనిచేస్తున్నానన్న నిజం వీళ్లందరికీ తెలిస్తే ఎలా వుంటుంది?!
నేను సినిమాలు మానెయ్యటం అంతా ఉట్టిదే... ఇప్పుడు నేనొక నాలుగు సినిమాలకు సీరియస్‌గా పనిచేస్తున్నానన్న నిజం వీళ్లందరికీ తెలిస్తే ఎలా వుంటుంది?!
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani