Friday, 31 October 2025

కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్‌కు ఇది గోల్డెన్ టైమ్!


మీకు తెలుసా?
చాలామంది టాప్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు వాళ్ళ టీమ్‌లో కనీసం ఒక అరడజన్ మంది కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్‌ను తీసుకుంటున్నారు. 

సీనియర్స్ - ఏడీలు, అసోసియేట్స్, కోడైరెక్టర్స్ కూడా ఉంటారు.

కాని, కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్‌ అదనం. 

ఏడీలుగా ఇంతకుముందులా ఎక్కువగా అబ్బాయిలే కాదు, ఇప్పుడు అమ్మాయిలు కూడా దాదాపు 50% ఉంటున్నారు. 

అమ్మాయిలు కూడా చాలామంది డైరెక్టర్స్ అవ్వాలనుకుంటూన్నారు. అవుతున్నారు. 

టీమ్‌లో కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎందుకంటే - 

> కొత్తవాళ్ళు బాగా చదువుకున్నవాళ్ళు అయ్యుంటారు. 
> టెక్నికల్‌గా ఏదైనా చెప్పగానే చెయ్యగలుగుతారు.
> ఇంగ్లిష్, హిందీ కొత్తవాళ్లకు అసలు సమస్య కాదు. 
> చొరవ, దూకుడు, కసి, ఫైర్ ఎక్కువగా ఉంటాయి. 
> జస్ట్ ఒక్కటే సినిమా చేసేసి, వెంటనే డైరెక్టర్ అయ్యే స్ట్రాటెజిక్ ప్లాన్లో ఉంటారు.
> మామూలుగా ట్రెడిషనల్‌గా ప్రతిచోటా ఉండే రాజకీయాలు వీళ్లలో ఉండవు. 
> వీళ్ళ ఫోకస్ అంతా - వాళ్ళు అసిస్టెంట్స్‌గా చేస్తున్న కొత్త సినిమా మీద, వాళ్ళు డైరెక్టర్‌గా చేయబోయే వాళ్ళ డెబ్యూ సినిమా మీద ఉంటుంది. మిగిలిన నాన్సెన్స్ అంతా అసలు పట్టించుకోరు. 
> అడ్వాన్స్‌డ్ థింకింగ్ ఉంటుంది. ఏ విషయంలో అయినా వీరి ఇన్‌పుట్స్ డైరెక్టర్‌కి ఉపయోగపడతాయి. 
> డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ లాంటివి వాళ్ళదగ్గరుండే ల్యాప్‌టాప్ మీద నిమిషాల్లో అద్భుతంగా చెయ్యగలుగుతారు.
> సోషల్ మీడియా, చాట్ జీపీటీ, ఏఐ లాంటివి వీళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో డైరెక్టర్‌కు, ప్రాజెక్టుకు చాలా ఉపయోగపడతారు.   

కట్ చేస్తే - 

నిజంగా ఫిలిం డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉండి, డైరెక్టర్ కావాలనుకొనే కొత్తవాళ్ళు అసిస్టెంట్‌గా ఒక్క సినిమా సీరియస్‌గా చేస్తే సరిపోతుంది. 

అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా నో వర్రీస్. ప్రాసెస్ అంతా ఒక్కటే.  

కాన్‌ఫిడెన్స్ ఉన్న కొత్తవాళ్ళకు ఆ ఒక్కటి కూడా చెయ్యాల్సిన పనిలేదు. అది వేరే విషయం.

పెద్ద ప్రొడక్షన్ కంపెనీల్లో కొత్త ఏడీలకు పేమెంట్ ఇస్తారు. చిన్న నిర్మాతలు, ఇండిపెండెంట్ ఫిలిమ్మేకర్స్ 90% ఎలాంటి పేమెంట్ ఇవ్వరు. కొంతమంది ఎంతో కొంత పాకెట్ మనీ ఇవ్వొచ్చు. 

కొత్తగా ఏడీలుగా చేరేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే - డైరెక్షన్ నేర్చుకోడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఉద్యోగం కాదు. 

మీరు కొత్తగా ఏడీగా చేరడానికి అవకాశం కోసం వెతుకుతున్నారా?

కింద లింక్ ఇస్తున్నాను. అప్లై చెయ్యండి: 

https://www.richmonk.me/p/filmography.html

ఆల్ ద బెస్ట్.

Opportunities don’t wait. They appear in moments like this — when the industry is hungry for new voices and fearless ADs.

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani