ఫిలిం ఇండస్ట్రీలో నువ్వు అవకాశం తెచ్చుకొన్నావంటే చాలు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే.
నిజంగానే ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చావనుకో, ఇంక అది పీక్స్. శిఖరాగ్రం అన్నమాట.
ఆ తర్వాత నువ్వేం చేసినా, ఏం సాధించినా అది నీకు బోనస్ అవుతుంది.
కట్ చేస్తే -
చాలా మంది సినిమాల్లోకి రావాలనుకొనేవాళ్ళు, వచ్చి ఏం సాధించలేకపోయినవాళ్ళు ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తుంటారు... ఇండస్ట్రీ ఇలాంటిది, అలాంటిది అని.
ఇండస్ట్రీ ఎప్పుడూ మంచిదే. దాని విధివిధానాలు, దాని సూత్రాలు, దాని సిస్టమ్ దానిది.
ఆ వ్యవస్థకి నిన్ను నువ్వు మౌల్డ్ చేసుకోకుండా నువ్వేం సాధించలేవు.
ఫిలిం ఇండస్ట్రీ అనే కాదు. ఏ ఇండస్ట్రీ అయినా, ఏ బిజినెస్ అయినా, ఏ ప్రొఫెషన్ అయినా అంతే. వాటి సిస్టమ్స్ వాటికుంటాయి. ఆ సిస్టమ్‌లో నువ్వు ఇమడలేనప్పుడు తప్పుకోవాలి. అంతే తప్ప, తప్పుపట్టకూడదు.
ఇది గుర్తించకుండా బయటుండి నువ్వేం కోతలు కోసినా, ఎన్ని కథలు చెప్పినా నిన్నెవ్వడూ పట్టించుకోడు.
సో, నువ్వు సినిమాల్లోకి రావాలనుకొంటే ముందు సినిమాను ప్రేమించు. సినిమా పరిశ్రమను, అందులో పనిచేసేవాళ్ళను గౌరవించు. అప్పుడే నువ్వేదైనా సాధించగలుగుతావు.
Cinema is a royal profession — fame, power, and fortune follow. But before you enter, learn to respect the craft and the creators who make it magic.

- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani