ఎన్నెన్నో చెయ్యాలనుకుంటాం. కుదరదు. మనమీద ఎన్నో శక్తులు పనిచేస్తుంటాయి - ప్రత్యక్షంగా, పరోక్షంగా.
చాలాసార్లు చెయ్యగలిగినవి కూడా చెయ్యలేం. వంద కారణాలుంటాయి.
చాలాసార్లు చెయ్యగలిగినవి కూడా చెయ్యలేం. వంద కారణాలుంటాయి.
ఒక ప్రొఫెషన్‌ను వదిలేసుకోవడం చాలా ఈజీ. కాని, కొత్తగా ఇటుక మీద ఇటుక పేరుస్తూ ఇంకో ప్రొఫెషన్ ప్రారంభించడం, అందులో ఆత్మవిశ్వాసంతో కొనసాగుతూ అనుకున్నది సాధించడం అంత ఈజీ కాదు.
అంతకుముందు ప్రొఫెషన్లో జరిగిన భారీ రేంజ్ మనీ రొటేషన్, భారీ రేంజ్ మనీ అడ్జస్ట్‌మెంట్స్ ఇప్పుడుండవు. "ఆ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు లేదు... నేనందులో లేను" అని చెప్తే ఎవ్వడూ మనల్ని పట్టించుకోడు. దాన్లో ఉన్నప్పుడు కామ్‌గా ఉన్నవాళ్ళు కొందరు, దాన్ని వదిలేశానని తెలిసినప్పుడు విజృంభిస్తారు. ఏ ఒక్క పనీ కాదు.
క్రియేటివిటీకి సంబంధించిన నేపథ్యంలో చాలామందికి ఇలాంటి స్టకప్‌లతోనే సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఇదంతా ఎవ్వరు పట్టించుకోరు... ఇంటాబయటా.
అన్నీ నవ్వుతూ భరిస్తూ, ఎదుర్కొంటూ, ఏం జరగనట్టే ఉండాలి.
ఇలాంటి నేపథ్యంలో సాధ్యమైనంత మానసిక వత్తిడి తగ్గించుకోడం చాలా అవసరం. తప్పనిసరి కూడా.
మొన్న జులైలో అనుకున్నది ఇప్పుడు పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నాను...
మినిమలిజమ్.
ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా కూడా.
మినిమలిజమ్.
ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా కూడా.
ఒక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చాలు...
ఎక్స్‌కు ఫిక్స్ అయిపోయానిప్పుడు.
ఎక్స్‌కు ఫిక్స్ అయిపోయానిప్పుడు.
నిజంగా ఏదైనా సాధించాలనుకొంటే, ఒక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చాలు.
బ్లాగింగ్ కొనసాగిస్తున్నాను. దీన్ని మించిన స్ట్రెస్‌బస్టర్, స్నేహితురాలు నాకు ఇంకొకరు లేరు. దీన్ని మించిన థెరపీ కూడా లేదు. సో, నా బ్లాగ్ ఉంటుంది.
కొత్త వ్యాపకాలు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయి కాబట్టి మొత్తం ఫోకస్ ఇంక వాటిమీదే. ఇంకేదీ నన్ను డిస్టర్బ్ చెయ్యకూడదు. సమయం వృధా కాకూడదు.
జీవితం చాలా చిన్నది. అన్నీ మనమే చెయ్యాలనుకోవడం కన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అందరితోనూ పాజిటివ్‌గా బాగుండాలనుకోవడం కూడా మూర్ఖత్వమే.
మంచి ఎనర్జెటిక్ టీమ్, మంచి పాజిటివ్ వాతావరణం మనచుట్టూ అవసరం.
ఎవరు నిజంగా మనతో ప్రొఫెషనల్ జర్నీలో ఫోకస్డ్‌గా ఉండగలుగుతారు అన్నది మనమే డిసైడ్ చేసుకోవాలి. అనవసరంగా గుడ్డినమ్మకాలు, భ్రమలు పెట్టుకొని సమయం వృధాచేసుకోవద్దు.
విన్-విన్, క్విడ్ ప్రోకో వంటివి వందకి వంద శాతం పాటించాలి.
అనుభవాలు నేర్పిన గొప్ప పాఠాలు ఇవన్నీ.
అందుకే ఈ మినిమలిజమ్.
బరువులూ, బాధ్యతలూ, కమిట్మెంట్సూ... అన్నీ త్వరత్వరగా పూర్తిచేసుకోవడమొక్కటే లేజర్ ఫోకస్ కావాలి. మిగిలినవన్నీ ఉట్టి భ్రమ. ఒక్కొక్కటీ తగ్గిపోతూ అదృశ్యమవుతూవుండాలి.
అంతిమంగా...
సర్వమ్ ఆధ్యాత్మికమ్.
Life is short yet beautiful—fitness first, let go of the unwanted, and hold on to the few things that bring freedom and peace.
అంతిమంగా...
సర్వమ్ ఆధ్యాత్మికమ్.
Life is short yet beautiful—fitness first, let go of the unwanted, and hold on to the few things that bring freedom and peace.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani