Thursday, 23 October 2025

సత్యజిత్ రే చెప్పిన దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు!


ప్రపంచస్థాయి సినీదర్శకుల్లో ఒకరైన మన సత్యజిత్ రే ఒక మాటన్నారు, "సినిమా తీయాలన్న సంకల్పం బలంగా ఉంటే చాలు. దానికి అవసరమైన డబ్బు అదే సమకూరుతుంది" అని. 

ఇలాంటి కొటేషన్స్ చదివి వందలాదిమంది ఫిలిం ఇండస్ట్రీకి వచ్చారు. అనుకున్నది జరగక, అలా వచ్చినవారిలో 99% మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు.

మిగిలిన ఆ 1% మంది మాత్రం ఇక్కడిక్కడే తిరుగుతూ ఇంకా నానా తిప్పలుపడుతున్నారు. 

కట్ చేస్తే -

సత్యజిత్ రే చెప్పిన దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన తీసిన సినిమాలన్నీ అలాగే తీశారు. 

ఎంత బడ్జెట్‌లో తీయాలి, ప్రొడ్యూసర్ ఎవరు అని ముందే ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయన ఒక కథ అనుకొని, దాన్ని సినిమా చేయాలనుకున్నాక, అన్నీ అవే సమకూరేవి.

మనం కూడా అంతే. 

సినిమా చేయాలనుకుని డిసైడ్ అయ్యాక, మనం నిద్రపోయినా సరే, మన మెదడు ఆటోమేటిగ్గా మనకు కావల్సిన రిసోర్సెస్ గురించి నిరంతరం ఆలోచిస్తుంటుంది.

ఫండ్స్ కోసం, ప్రొడ్యూసర్స్ కోసం ఎన్నో మీటింగ్స్ జరుగుతుంటాయి. వాటిల్లో ఒకటి సెట్ అవుతుంది. 

అంతే. 

ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు. 

ఒక కమర్షియల్ హిట్ ఇచ్చాక ఈ తలనొప్పి కూడా ఉండదు. అది వేరే విషయం. 

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani