జమైకా దేశపు అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన "ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్" అవార్డును ఆ దేశ ప్రధానమంత్రి యాండ్రూ హోల్నెస్ నుంచి స్వీకరించాడు మా జవహర్ నవోదయ, మద్దిరాల (గుంటూరు) విద్యార్థి డాక్టర్ నాగమల్లేశ్వర రావు.
మైకేల్ హోల్డింగ్, కోర్ట్నీ వాల్ష్, క్రిస్ గేల్ వంటి వెస్టిండీస్ స్టార్ క్రికెట్ ప్లేయర్స్ జన్మస్థలం అయిన జమైకా దేశంలో మా విద్యార్థి ఇంత పేరు సంపాదిచడం నిజంగా ఒక మంచి 'హై' ఇచ్చే విషయం.
నేను గుంటూరు నవోదయ విద్యాలయలో పనిచేసినప్పుడు నాగమల్లేశ్వర రావు ఈ స్థాయికి ఎదుగుతాడని ఎవరూ అనుకోలేదు. సుమారు అయిదేళ్ల క్రితం అనుకుంటాను... మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకుంటుండేవాళ్లం.
ఒకసారి నాగమల్లేశ్వర రావు ఇండియా వచ్చినప్పుడు నాంపల్లిలో ఉన్న వుడ్‌బ్రిడ్జ్ హోటల్లో మేమిద్దరం కాసేపు కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నాము.
ఒకసారి నాగమల్లేశ్వర రావు ఇండియా వచ్చినప్పుడు నాంపల్లిలో ఉన్న వుడ్‌బ్రిడ్జ్ హోటల్లో మేమిద్దరం కాసేపు కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నాము.
జమైకా దేశంలో మంత్రులు, ప్రధాని స్థాయివారితో మా నాగ్‌కు లంచ్, డిన్నర్ అనేది చాలా మామూలు విషయంగా వాడి మాటల్లో అప్పుడు నేను గ్రహించాను. తన సొంత ఊరి నుంచి కూడా జమైకాకు చాలా మందిని తీసుకెళ్ళి, వారికి అక్కడ ఉపాధి కల్పించాడు.
నాగ్‌కు అక్కడ జమైకాలో హాస్పిటల్స్ ఉన్నాయి. చాలా తక్కువ ఫీజులతో, అతి తక్కువ హాస్పిటల్ ఖర్చులతో ఒక డాక్టర్‌గా వాడి సేవ ఆ దేశంలో ఆ స్థాయిలో ఉండటం నిజంగా గొప్ప విషయం. ఇక్కడి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ నిస్సిగ్గు దోపిడీ దందాల నేపథ్యంలో, ఈ విషయంలో మా నాగ్ చేస్తున్న సేవకు నేను నిజంగా గర్విస్తున్నాను.

మా విద్యార్థి డాక్టర్ నాగమల్లేశ్వర రావు ఇలాంటివి ఇంకెన్నో సాధించాలని ఆశిస్తూ, ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్.
We teachers feel like true winners when we see our students achieving great things across the world.
Moments like these, and the memories they bring, are our greatest wealth — richer than any reward or recognition.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani