X నిజంగా ఒక ఎలైట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్.
ఎవరినైనా కనెక్ట్ కావడానికి X లో కంటే ఇంకే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కుదరదు. జస్ట్ టాగ్ చేస్తే సరిపోతుంది.
నాకు పరిచయమైన-లేదా-నేను కనెక్ట్ అయిన వీఐపీలు, సెలెబ్రిటీలు, జేమ్స్ ఆల్టుచర్ లాంటి న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ రైటర్స్, గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్స్ అంతా నాకు X ద్వారానే కనెక్ట్ అయ్యారు.
అయితే - పొలిటికల్‌గా, సినిమా ఫ్యానిజమ్ పరంగా X లో కూడా నానా చెత్త చేరిందనుకోండి. అది వేరే విషయం.
కట్ చేస్తే -
వాట్సాప్ చానెల్ కూడా డిలీట్ చేసేశాను. నిజంగా అవసరం లేదు. అప్‌డేట్స్ ఎలాగూ X లో, బ్లాగ్‌లో పోస్ట్ చేస్తుంటాను కాబట్టి దీని అవసరం లేదు.
వాట్సాప్ స్టేటస్ కూడా ఒక పెద్ద ఎడిక్షన్. బిగ్ నాన్సెన్స్. బిజినెస్ పర్పస్‌లో తప్ప, దాన్ని పర్సనల్‌గా వాడటం అంటే జస్ట్ టైమ్ వేస్ట్. మనకి మనం మన ప్రైవసీని చౌరస్తాలో పెట్టడం లాంటిది, వాట్సాప్ స్టేటస్ అంటే. సో, ఇక నుంచీ నా స్టేటస్‌కు కూడా దస్విదానియా.

నా యూట్యూబ్ చానెల్ గురించి కూడా మళ్ళీ ఆలోచిస్తున్నాను. నిజంగా నేను అనుకున్న స్థాయిలో నా పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలు వెంటనే ప్రారంభించాలి. అలా చెయ్యలేనప్పుడు యూట్యూబ్ కూడా అనవసరం. అలా చేస్తానా లేదా అన్నది కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.
అవసరమైనవి చెయ్యడానికే టైమ్ లేదు. ఇంక అనవసరమైనవి నిజంగా అనవసరం.
- మనోహర్ చిమ్మని
S.jpg)
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani