ఫిలిం ఇండస్ట్రీలో ఒంటరిపోరాటాలకంటే, ఒక నలుగురైదుగురు లైక్‌మైండెడ్ కలిసి చేసే సినిమాలే బాగా సక్సెస్ అవుతాయి.
ఒక్క సినిమాలోనే కాదు, ఏ ఫీల్డులో అయినా సరే, "సిండికేట్" అంటేనే సక్సెస్.
ఒకటే బుర్ర కంటే, నాలుగు బుర్రలు యాక్టివ్‌గా పనిచేస్తూ, పవర్‌ఫుల్ నిర్ణయాలు తీసుకోగలుగుతాయి.
ఇప్పుడు హేమాహేమీలుగా టాప్ పొజిషన్లలో ఉన్న ప్రొడ్యూసర్లలో ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు ప్రారంభంలో ఇలా ఒక సిండికేట్‌గా ఏర్పడి సినిమాలు చేసినవాళ్ళే.
వీరికి ఒంటరిగా చేసే సత్తా లేక కాదు. అదంతే.
ఒక పెద్ద పనిని ఒక్కరే చేయటం కంటే, నలుగురు కలిసిచేయడం అన్నివిధాలా సులభంగా ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు.
ఇప్పటికీ మీరు చూడండి... దాదాపు ప్రతిసినిమాలో మెయిన్‌గా ఒక ప్రొడ్యూసర్ ఉన్నా కూడా, దాని సమర్పణ ఒకరు చేస్తారు. నిర్వహణ ఇంకొకరుంటారు. సహనిర్మాత ఇంకొకరుంటారు. వీళ్లంతా ఆ సినిమా నిర్మాణంలో భాగస్వాములే అన్నమాట.
కట్ చేస్తే -
మంచి కంటెంట్‌తో ఒక చిన్న బడ్జెట్ సినిమా చెయ్యాలంటే ఒక 2 కోట్లు అవుతుందనుకుంటే, దాన్ని ఒక్కరే చేయనవసరం లేదు. ముగ్గురో నలుగురో లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్లు కోప్రొడ్యూసర్లుగా కలిసి చెయ్యొచ్చు. ఓవర్‌నైట్ ఫేమ్‌తో పాటు, మంచి లాభాలు కూడా పొందొచ్చు.
ప్యాషన్ ఒక్కటే కాకుండా, ఒక బిజినెస్‌గా కూడా సినీఫీల్డువైపు ఆసక్తి ఉన్న కొత్త ఇన్వెస్టర్లు ఆలోచించవచ్చు. సిండికేట్ కావచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ మీడియేటర్స్ కూడా ఈ ఫిలిం సిండికేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఆలోచించవచ్చు.
Want to know more? DM me.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani