ఈ భూమ్మీదున్న జనాభాలోని ప్రతి 140 మందిలో ఒక మిలియనేర్ ఉన్నారట! ఇక్కడ మిలియనేర్ అంటే, అమెరికన్ డాలర్స్‌లో మిలియనేర్.
అంటే, ఈరోజు లెక్కప్రకారం, మిలియనేర్ అంటే సుమారు 8.8 కోట్ల డబ్బు/నెట్‌వర్త్ ఉన్నవారన్నమాట.
వాస్తవానికి ఏ రంగంలోనైనా, భారీ కాంపిటీషన్ అనేది అట్టడుగు భాగంలోనే ఉంటుంది. పైకి వెళ్ళినా కొద్దీ కాంపిటీషన్ తగ్గిపోతుంటుంది. అసలుండదు.
గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ఆధారంగా, నోమాడ్ కాపిటలిస్ట్ వంటి సోర్సులు చెప్తున్న ఈ న్యూస్ ఐటమ్ చదివాక, నాకు నిజంగా సిగ్గేసింది.
ఇదేం లక్షల్లో కాంపిటీషన్ కాదు... జస్ట్ ఒక 140 మందిలో నేనూ ఒక మిలియనేర్ కావాలని ఇప్పటిదాకా ఎందుకు అనుకోలేదు? అలాంటి హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఎందుకని చెయ్యలేకపోయాను? కనీసం ఇప్పుడైనా అవ్వాలనుకుంటున్నానా?
ఈ జోక్స్ పక్కనపెడితే -
"నీ దగ్గర ఎంత డబ్బున్నా, నీకు ఎన్ని ఆస్తులున్నా, నువ్వు చచ్చిపోయేలోపు అందులో నువ్వు ఎంత ఖర్చుపెట్టగలిగావన్నది నీ అసలు వాల్యూ. అలా చేయలేనప్పుడు నీకూ, డబ్బులేనివాడికీ పెద్ద తేడా లేదు" అంటాడు రామ్‌గోపాల్ వర్మ.
ఈ లాజిక్ అందరికీ నచ్చకపోవచ్చు. కాని, ఇదే కరెక్ట్ లాజిక్.
డబ్బు సంపాదించడం వెనుక ఎవరి ఉద్దేశ్యం ఏంటన్నది వారి వ్యక్తిగతం. కాని, సంపాదించడం అనేది మాత్రం ఎవరికైనా తప్పనిసరి.
ఒక రెండు-మూడక్షరాలు వదిలేస్తే నేనూ మిలియనేర్ కావడం పెద్ద కష్టం కాదు. కాని, ఆ ఒకటిరెండు ఎప్పుడు వదిలేస్తానన్నదే ఎప్పటికప్పుడు నన్ను ఆడిస్తూవస్తున్న చిక్కు ప్రశ్న.
చాలా సంఘర్షణ తర్వాత, ఇప్పుడు నాకు సమాధానం దొరికింది...
ఆ రెండు-మూడక్షరాలు ఇప్పుడు నేను పూర్తిగా వదిలేశాను.
Money isn’t everything — but let’s be real, money is a must. It gives you freedom, and freedom gives you life. Then come health and relationships — the true luxuries.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani