ఒక్క సినిమా కూడా డైరెక్షన్ డిపార్ట్‌మెంటో అసిస్టెంట్‌గా చెయ్యకుండా కూడా డైరెక్టర్స్ కావచ్చు. కాని, అసిస్టెంట్‌గా ఒకసారి ఒక సినిమాకు పనిచెయ్యడానికి చేరినప్పుడు మాత్రం కొన్ని మినిమమ్ నియమాలు పాటించాలి.
గతంలో అయినా, ఇప్పుడైనా, ఎప్పుడైనా - ఒక సినిమా ప్రాజెక్ట్ కోసం ఒక కొత్త అసిస్టెంట్ డైరెక్టర్ (AD) డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేరినప్పుడు, ఆ సినిమా పూర్తయ్యి, రిలీజ్ అయ్యేదాకా పనిచెయ్యాల్సి ఉంటుంది. సినిమాను తన సొంత సినిమాలా ఫీలయ్యి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పోస్ట్ ప్రొడక్షన్, లేదా రిలీజ్ విషయంలో ఆలస్యం అయినా, కనీసం డైరెక్టర్‌తో, ప్రొడక్షన్ హౌజ్‌తో టచ్‌లో ఉండాలి. ఎవరైనా అలాగే ఉంటారు.
దీని గురించి సీనియర్ ఏడీలను, కోడైరెక్టర్స్‌ను ఎవర్ని అడిగినా బాగా చెప్తారు.... వాళ్ళకుండే పనులూ బాధ్యతల గురించి.
కాని, ఇప్పటి ఏడీలు అలా ఉండట్లేదు. అందరూ కాదు...
కొందరు ఓవర్ కాంఫిడెంట్ ఈగోయిస్టులు... "ఓస్ ఇంతేనా డైరెక్షన్ అంటే" అన్న ఫీలింగ్‌తో ఉంటారు. అసలు "షూటింగే సినిమా" అన్న ఫీలింగ్‌తో ఉంటారు ఇలాంటివాళ్ళంతా.
ఇలాంటి వాళ్ళంతా బేసిక్ డిసిప్లిన్ కూడా పాటించలేరు అన్న విషయం తర్వాత్తర్వాత తెలుస్తుంది.
కొందరు ఓవర్ కాంఫిడెంట్ ఈగోయిస్టులు... "ఓస్ ఇంతేనా డైరెక్షన్ అంటే" అన్న ఫీలింగ్‌తో ఉంటారు. అసలు "షూటింగే సినిమా" అన్న ఫీలింగ్‌తో ఉంటారు ఇలాంటివాళ్ళంతా.
ఇలాంటి వాళ్ళంతా బేసిక్ డిసిప్లిన్ కూడా పాటించలేరు అన్న విషయం తర్వాత్తర్వాత తెలుస్తుంది.
ఇలాంటి ఏడీల వల్ల డైరెక్టర్‌కు, ప్రొడక్షన్ హౌజ్‌కు చాలా సమయం నష్టం. వీరి వల్ల అనవసరమైన హెడేక్స్ భరించాల్సి ఉంటుంది.
కొత్త డైరెక్టర్స్, అప్‌కమింగ్ డైరెక్టర్స్... కొత్తగా ఎవరికైనా అవకాశం ఇచ్చేముందే వాళ్ళను బాగా స్టడీ చేసి గాని నిర్ణయం తీసుకోకూడదు.
లేదంటే టైమ్ వేస్టు, మైండ్ క్రాక్... రెండూ తప్పవు.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani