Sunday, 29 May 2016

ప్రౌడ్ ఫండింగ్!

ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన కిక్‌స్టార్టర్, ఇండీగోగో వంటి యు ఎస్ బేస్‌డ్ "క్రౌడ్ ఫండింగ్" వెబ్‌సైట్‌ల గురించి ఇంతకు ముందు రెండు మూడు సార్లు నేను ఇదే బ్లాగ్‌లో చెప్పాను.

కిక్‌స్టార్టర్, ఇండీగోగో వంటి సైట్స్ మన దేశంలోనూ ఒకటి రెండు వచ్చినా అవి ఎందుకని సఫలం కాలేదో కూడా కొంత చెప్పాను.

ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతినే, ఒక చిన్న బాధ్యతాయుతమయిన ట్విస్ట్‌తో, మన దగ్గర కూడా సక్సెస్ చేయవచ్చునేమోనని నాకనిపించింది. అలా అనిపించిన నా అలోచననలనే ఒక ఆకర్షణీయమైన ఆఫర్‌గా ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాను.

అదే -

మైక్రో బడ్జెట్ ఫిలిం ఫండింగ్! సింపుల్‌గా MBFF.

కట్ టూ మన టాపిక్ - 

ముందే చెప్పినట్టు - ఇదొక ఆలోచన. ఒక ఐడియా.

సినీ ఫీల్డు పట్ల ప్యాషన్, చిన్న స్థాయిలోనయినా సినిమాల్లో ఇన్వెస్ట్ చేయాలన్న కోరిక ఉన్నవారికి .. అంత సింపుల్‌గా "నో" చెప్పే అవకాశం లేని ఒక ఆఫర్.

మొత్తంగా - మన తెలుగు ఇండస్ట్రీలో సినిమా బిజినెస్‌ను ప్రత్యక్షంగా స్టడీ చేయడానికి ఫండింగ్ చేసేవాళ్లకు ఇదొక మంచి అవకాశం కూడా.

ఈ ఆఫర్‌కు కాల పరిమితి ఉంది. రేపు మే 30 నుంచి -  జూన్ 12 వరకు .. కేవలం 14 రోజులు మాత్రమే! ఆ తర్వాత ఇంక ఈ ఆఫర్ ఎప్పుడూ ఉండదు.

ఫినిషింగ్ టచ్ ఏంటంటే -

ఎంతో మంచి ఉద్దేశ్యంతో చేసే ఈ ఫండింగ్‌ను "క్రౌడ్" ఫండింగ్ అనడం నాకు నచ్చలేదు. ఇది "మనం" అని అందరం కలిసికట్టుగా చేసే ఒక మంచి ప్రయత్నం కాబట్టి నేను దీన్ని "ప్రౌడ్ ఫండింగ్" అన్నాను. కరెక్టేకదా?

దీనికి సంబంధించి - "అసలేంటి, ఎలా" అన్న పూర్తి వివరాలతో కూడిన సమాచారం మరికొన్ని గంటల్లో - ఈ రాత్రికి, ఇక్కడే, ఇదే బ్లాగ్‌లో, ఫేస్‌బుక్‌లో కూడా .. 

Thursday, 26 May 2016

లైక్‌మైండెడ్ ప్రొడ్యూసర్స్/కోప్రొడ్యూసర్స్ కోసం!

ఫిలిం ప్రొడక్షన్ పట్ల బాగా ఆసక్తి ఉన్న లైక్‌మైండెడ్ ప్రొడ్యూసర్స్/కోప్రొడ్యూసర్స్ కోసం నా అన్వేషణ/చర్చలు వారం క్రితం ప్రారంభించాను. అవి ఈ నెలాఖరువరకూ కొనసాగుతాయి.

వెంటనే ఇన్వెస్ట్ చేయగల సామర్థ్యం ఉన్నవాళ్లు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు.

నాకు రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ఒకే అయి ఉన్నా, మరోవైపు  ఆ పనులు కొనసాగుతూనే ఉన్నా, మళ్ళీ ఎందుకీ అన్వేషణ అంటే .. దానికో కారణముంది. వివిధ సాంకేతిక కారణాలవల్ల మా రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ప్రాజెక్టుల కదలికలో కొంత ఆలస్యం అనివార్యమవుతోంది. తప్పదు. కోట్లతో వ్యవహారం.

అదలా ఉంటే - వెంటవెంట తీయడానికి, స్వయంగా మేమే మా సొంత బ్యానర్‌లో కూడా కొన్ని మైక్రో బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాము. ముఖ్యంగా వాటికోసమే ఈ కొత్త కోప్రొడ్యూసర్స్/ఇన్వెస్టర్స్ అన్వేషణ.

ఆసక్తి ఉండీ .. అవకాశం, సరైన రూటు దొరకని కొత్త ప్రొడ్యూసర్స్/కోప్రొడ్యూసర్స్ ఎందరో ఉంటారు. అలాంటి వాళ్లంతా వెంటనే నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మీ మొబైల్ నంబర్ నాకు ఇన్‌బాక్స్ చేస్తే చాలు. నేనే స్వయంగా మీకు ఫోన్ చేస్తాను. మిగిలిన అన్ని విషయాలు మనం ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు. అప్పుడు అంతా ఒకే అనుకుంటే, వెంటనే మనం పర్సనల్‌గా కూడా కలవ్వొచ్చు. ఆ తర్వాత ఫార్మాలిటీస్ కూడా వెంటనే పూర్తి చేసుకొని, మన ప్రాజెక్టును వెంటనే ప్రారంభించవచ్చు. ప్రెస్‌లో ప్రకటించవచ్చు.    

బెస్ట్ విషెస్ ..

Saturday, 21 May 2016

ఇక్కడికి ఎందుకు వెళ్ళితీరాలి?

"సక్సెస్ ఈజ్ సెక్సీ" ఇక్కడ.

ఒకే ఒక్క సక్సెస్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. బెల్లం చుట్టూ ఈగల్లా నీ చుట్టూ ఎందరో చేరతారు. నువ్వే ఆశ్చర్యపోయేంతగా!

ఆతర్వాత ఎంత గుడ్డి నిర్ణయాలు తీసుకొన్నా, కనీసం ఒక దశాబ్దం నీకెలాంటి కష్టం ఉండదు. ఏ లోటూ ఉండదు.

నువ్వు కలలో కూడా ఊహించని వ్యక్తులు ఓవర్‌నైట్‌లో నీ నెట్‌వర్క్‌లోకొస్తారు. అప్పటిదాకా నిన్ను కేర్ చేయని, నిన్ను వెలివేసిన నీ సోకాల్డ్ మిత్రులూ బంధువులూ "ఆహా ఓహో" అంటూ నిన్ను వెతుక్కుంటూ నీదగ్గరకొస్తారు. వాళ్ల నటన ముందు నువ్వు అప్పటిదాకా డైరెక్ట్ చేసిన నీ నటీనటులు ఎందుకూ పనికిరారు.

అంతా ఒక మాండ్రెక్స్ మత్తులా ఉంటుంది. 24/7 x 365 డేస్.

ఇలాంటి సక్సెస్ ఇచ్చిన కిక్కుతో వెంటనే మరో సక్సెస్‌ని కూడా ముద్దాడావనుకో .. ఇక అంతే.
భూమ్మీదనే నువ్వు స్వర్గం అనుభవిస్తావు.

స్వర్గం అంటే చచ్చాక పోయే ఏదో నాన్సెన్సికల్ డెస్టినేషన్ కాదు. రంభ, ఊర్వశి, మేనకలే కాదు. అదొక అనిర్వచనీయమైన అనుభూతి. అనుక్షణం ఆనందో బ్రహ్మే!

నువ్వు బాగుంటావు. నీ కుటుంబం, నీ బంధుమిత్రులు, నీ శ్రేయోభిలాషులు అంతా బాగుంటారు. అదే స్వర్గం. అదే "ఇక్కడ."

ఆ ఇక్కడే .. ది గ్రేట్ సినీఫీల్డు!

సో, ఆ స్వర్గద్వారాల్ని స్పృశించడానికైనా నువ్వు సినీఫీల్డులోకి వెళ్లితీరాలి.  

ఫినిషింగ్ టచ్ ఏంటంటే - 

ఈ స్టేజికి చేరుకొనే అవకాశం అందరికీ రాదు. అందరికీ సాధ్యంకాదు.

ఫీల్డులోకి ఎంటరయ్యి, అవకాశం అందిపుచ్చుకొన్న ప్రతి 100 మందిలో కేవలం ఒక ఇద్దరికి మాత్రమే వస్తుంది. ఆ ఇద్దరిలో నేను కూడా ఉంటాను అన్న నమ్మకం నీకున్నట్లైతే మాత్రం ఇంక ఒక్క క్షణం ఆగొద్దు.

ఫీల్డులోకి వెళ్లితీరాలి .. దూకేసెయ్యాలి .. 

ఇక్కడికి ఎందుకు వెళ్లకూడదు?

అంతకుముందు ఎక్కడా ఓడిపోనివాడు ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అవుతాడు.

అంతకుముందు జీవితంలో ఎవ్వరిముందూ తలదించుకోనివాడు ఇక్కడ ఎంటరయ్యాక, అదే తలను పాతాళంలోకి పెట్టుకోవల్సిన పరిస్థితుల్ని ఎదుర్కొంటాడు.

అంతకుముందు తనముందు చేతులు కట్టుకొని నిలబడటానికి కూడా అర్హతలేని అనామక వ్యక్తుల సమక్షంలో ఇక్కడ గంటలు గంటలు గడపాల్సి వస్తుంది. పనికిరాని సొల్లు వినాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. ఇష్టం లేకపోయినా.

అప్పటివరకూ నిన్ను మెచ్చుకొంటూ ఆకాశానికెత్తిన నీ అతి దగ్గరి మిత్రులు, ఆత్మీయులు - అదే నోటితో నువ్వు కలలో కూడా ఊహించని మాటలంటోంటే విధిలేక వినాల్సివస్తుంది. ఇక్కడ ఇరుక్కుపోయిన తర్వాత.

నీ చదువు, సంస్కారం, నీ సిన్సియారిటీ, నీ సెన్సిటివ్‌నెస్, నీలోని మానవత్వం, మంచితనం, నీ నీతి, నిజాయితీ లకు ఇక్కడ అస్సలు విలువుండదు. అలా ఉంటుందనుకున్నావా .. అది నీ మూర్ఖత్వం.

అయితే, సక్సెస్ సాధించి ఒక రేంజ్‌లో ఉన్నవాళ్లలో కూడా దాదాపు చాలామంది ఇలాంటి పరిస్థితుల్నే ఇక్కడ ఎదుర్కోవాల్సిరావడం అత్యంత విషాదకరం. జీర్ణించుకోలేని ఒక వాస్తవం.  

ఆ "ఇక్కడ" ఎక్కడో కాదు .. ది గ్రేట్ సినీ ఫీల్డు!  

కట్‌చేస్తే - 

అంత నిరాశపడకండి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఆ నాణేనికి మరోవైపు కూడా ఉంది. అదేంటో నా తర్వాతి బ్లాగ్‌: "ఇక్కడికి ఎందుకు వెళ్ళితీరాలి?" లో చూడండి.   

Tuesday, 17 May 2016

యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్‌రైటింగ్ : వన్-టూ-వన్ పర్సనల్ కోచింగ్!

యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్‌రైటింగ్ లలో ఏదైనా ఒకదానిని సీరియస్‌గా నేర్చుకొని, దాన్నే తమ మెయిన్ ప్రొఫెషన్‌గా మలచుకోవాలనుకొనే ఔత్సాహికులకు "వన్-టూ-వన్" పర్సనల్ కోచింగ్ నేనే ఇస్తున్నాను.

సినీఫిల్డుకు సంబంధించి నా మరొక ప్యాషన్ ఇది.

లక్షలు పోసి .. ఏదో ఒక ఇన్స్‌టిట్యూట్‌లో చేరామా, ఏదో ఒకటి రొటీన్‌గా నేర్చుకొన్నామా, చివరికి ఏదో ఓ సర్టిఫికేట్ తీసుకొని బయటకొచ్చామా అని కాదు. పైగా .. ఈమాత్రం దానికి, ఫిలిం ఇన్స్‌టిట్యూట్‌లవాళ్లు తీసుకొంటున్న ఫీజు సుమారు 5 నుంచి 7 లక్షలవరకు ఉంటోంది. అదీ, మన హైద్రాబాద్‌లోనే!

అయితే, ఏ శిక్షణ అయినా నిజంగా సినిమా ఇండస్ట్రీకి పనికొచ్చేవిధంగా ఉండాలి. వెంటనే మిమ్మల్ని పనిలోకి దించేలా ఉండాలి.

సూటిగా ఒక్కముక్కలో చెప్పాలంటే - "సినిమా ఇండస్ట్రీకి ఎలా అయితే అవసరమో, పూర్తిగా ఆ పాయింటాఫ్ వ్యూ లోనే ఉంటుంది నా పర్సనల్ కోచింగ్."

ఈ కోచింగ్‌లో చేరిన ప్రతి ఒక్కరినీ, వారి వారి టాలెంట్‌ను బట్టి, నా తర్వాతి చిత్రాలకోసం నా టీమ్‌లోకి తీసుకుంటాను. ఇది కోచింగ్‌లో చేరుతున్నందుకు నేను మీకిస్తున్న గ్యారంటీ కాదు. నాకోసం, నా సినిమాలకోసం, ఈ కోచింగ్ ద్వారా నాకు అవసరమైనవిధంగా, కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో, నాదంటూ ఒక మంచి టీమ్‌ను క్రియేట్ చేసుకొనే క్రమంలో చెబుతున్నమాట.

"సో, నా సినిమాల్లో మీకు తప్పక ఛాన్స్ ఉంటుంది."    

అయితే, ఈ వన్-టూ-వన్ కోచింగ్ అందరికీ కాదు. అందరికీ అంత సులభంగా అందుబాటులో ఉండదు. దీనికోసం నేనెంతో సమయం కెటాయించాల్సి ఉంటుంది.

చెప్పాలంటే - ఈ ప్రొఫెషన్ పట్ల కనీసం ఒక స్థాయి ప్యాషన్, స్థోమత, సీరియస్‌నెస్ ఉన్న కొద్దిమంది సెలెక్టెడ్  ఔత్సాహికులకు మాత్రమే ఈ కోచింగ్ అందుబాటులో ఉంటుంది.

యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్‌రైటింగ్ ల్లో ఒక్కో డిపార్ట్‌మెంట్‌కు కేవలం అతి కొద్దిమందిని మాత్రమే తీసుకుంటాను. సో, కోచింగ్‌కు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది 'టూ సెలెక్టివ్' అన్నమాట!

కట్ టూ నా కోచింగ్ మెథడ్ -   

ఈ పర్సనల్ కోచింగ్ రొటీన్ ఫిలిం ఇన్స్‌టిట్యూట్స్ ట్రైనింగ్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు:

> రొటీన్ క్లాస్ రూం టీచింగ్ అస్సలు ఉండదు.

> నంది అవార్డ్ రచయిత-డైరెక్టర్‌తో "వన్ టూ వన్" శిక్షణ ఉంటుంది.

> పూర్తిగా అన్‌ట్రెడిషనల్‌గా ఉండే ఈ కోచింగ్, ప్రధానంగా టాలీవుడ్‌ను దృష్టిలోపెట్టుకొని ప్లాన్ చేసింది. మీరు టాలీవుడ్‌లోకి సులభంగా ప్రవేశించడానికి మీకు ఏదేది అవసరమో, దానికోసం మిమ్మల్ని ఎలా మౌల్డ్ చెయ్యాలో .. కేవలం ఆ పాయింటాఫ్ వ్యూలోనే ఈ కోచింగ్ ఉంటుంది.

> నా సినిమా జరుగుతున్న సమయంలో - మీకు స్క్రిప్ట్ వర్క్‌తోపాటు ఇతర ప్రిప్రొడక్షన్ వర్క్‌లోనూ, షూటింగ్‌లోనూ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లోనూ .. అవసరాన్నిబట్టి, మీ సామర్థ్యాన్నిబట్టి, వీలైనంత నేరుగా పాల్గొనే అవకాశం కల్పిస్తాను.

> స్క్రిప్ట్ అసిస్టెంట్/అసిస్టెంట్ డైరెక్టర్/ఆర్టిస్ట్ గా శిక్షణ తీసుకొంటూనే, మీరు చేసిన పనికి/నటనకు స్క్రీన్ పైన మీకు టైటిల్ కార్డు ఇస్తాను.

> మీ సినీ కెరీర్ మొత్తంలో, ఎప్పుడు మీకు నానుంచి ఎలాంటి గైడెన్స్, సలహాలు అవసరం వచ్చినా నన్ను వెంటనే సంప్రదించవచ్చు. ఈ విషయంలో మీకు నా నుంచి 100% "లైఫ్‌టైమ్ సపోర్ట్" ఉంటుంది.

> వారానికి 2 కోచింగ్ క్లాసులు మినిమమ్ ఉంటాయి. అయితే క్లాస్ రూముల్లో మాత్రం కాదు. కోచింగ్ ఎక్కడైనా ఉండొచ్చు: ఆఫీస్/షూటింగ్ లొకేషన్/కార్లో వెళ్తూ/రోడ్డు మీద నడుస్తూ/కథా చర్చల్లో/మ్యూజిక్ సిట్టింగ్స్‌లో/నెక్లెస్ రోడ్డులో/ఐమాక్స్‌లో/సినీప్లానెట్‌లో .. ఎక్కడైనా ఉండొచ్చు. క్లాస్ ఎప్పుడు, ఎక్కడ అనేది ఎప్పటికప్పుడు మనం ముందే ఫిక్స్ చేసుకుంటాం .. ఆనాటి మన మన పనుల్నిబట్టి.

> మరో విషయం: ఈ పర్సనల్ కోచింగ్ ఒక్క ఆఫ్‌లైన్‌లోనే కాదు, అవసరాన్నిబట్టి అప్పుడప్పుడూ ఆన్‌లైన్‌లో కూడా ఉంటుంది. అసలు మీకు తెలుసా .. ఇప్పుడు ఫిలిం మేకింగ్‌కు సంబంధించిన చాలా పనులు ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా జరుగుతున్నాయని?!

> ఇక, మీ మీ టాలెంట్, స్పీడ్‌ను బట్టి .. కోచింగ్ పీరియడ్ 3 నుంచి 6 నెలలవరకు మాత్రమే ఉంటుంది. మీ టాలీవుడ్ ఎంట్రీకి ఈమాత్రం సమయం చాలు. అన్నీ నేర్చుకుంటారు. ఫీల్డులోకి ఎంటర్ అవుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. డామ్ ష్యూర్ అన్నమాట!    

> మీ చదువుల్నీ, ఉద్యోగాలను ఈ కోచింగ్ అస్సలు డిస్టర్బ్ చేయదు. మీ మీ పనులు చేసుకొంటూనే ఈ కోచింగ్ మీరు తీసుకోవచ్చు. అందుకే దీన్ని "పర్సనల్ వన్ టూ వన్ కోచింగ్" అన్నాను.

> ముందే చెప్పినట్టు .. ఈ కోచింగ్ అందరికీ ఇవ్వటం సాధ్యం కాదు. అంత సమయం నాకు దొరకదు. అందుకని, యాక్టింగ్/డైరెక్షన్/స్క్రిప్ట్ రైటింగ్ ల్లో కేవలం చాలా కొద్దిమందిని మాత్రమే  తీసుకుంటాను. వీరికి మాత్రం తప్పకుండా నా సినిమాల్లో అవకాశం ఉంటుంది.
అంటే,  నాకంటూ నేను స్పెషల్‌గా తయారుచేసుకొనే నా టీమ్‌లో మీరుంటారన్నమాట!        

"సో .. మీకు నా ఈ కాన్సెప్ట్ నచ్చి .. మీలో నిజంగా ఆ స్థాయి ఆసక్తి, స్థోమత, ప్యాషన్ ఉండి, నాతో ఈ వన్-టూ-వన్ కోచింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే - నా కోచింగ్ ఫీజు, ఇతర వివరాలకోసం నా ఫేస్‌బుక్ / ట్విట్టర్ ఇన్‌బాక్స్ కు మెసేజ్ చేయండి." 

బెస్ట్ విషెస్ ..  

Monday, 11 April 2016

ఎన్నారై స్వప్నానికి మరోవైపు

ఇండియాలో ఇంజినీరింగ్, మెడిసిన్, ఎమ్‌బిఏలు చదవడం .. కట్ చేస్తే, అమెరికా ఫ్లైట్ ఎక్కడం! ఇది మన దేశంలో చాలా మామూలు విషయం.

తమ పిల్లలు అమెరికా వెళ్లడం అనేది కొన్ని కుటుంబాలకు స్టేటస్ సింబల్ కాగా, వెళ్లే యువతకు తమ మిత్రబృందాల్లో అదొక ప్రత్యేక గుర్తింపు. చెప్పాలంటే, మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో, దాదాపు ప్రతి ఇంటినుంచీ కనీసం ఒక్కరైనా అమెరికావెళ్ళి ఎన్నారైలుగా స్థిరపడ్డవాళ్లున్నారు. ఈ ఎన్నారైలే ఇప్పుడు అమెరికాలోని ప్రతి ప్రధాన రంగంలోనూ కనీసం 20% ఉన్నారని ఒక అంచనా. పెంటగాన్, సీఇఏ, వైట్‌హౌజ్‌లు కూడా కూడా ఇందుకు మినహాయింపుకాదు! అయితే, ఇదంతా నాణేనికి ఒకవైపు ..

ఇండియా నుంచి అమెరికా వెళ్ళి, బాగా కష్టపడి చదువుకొని, మంచి ఉద్యోగాలూ డబ్బూ బాగా సంపాదించుకొని, ఎన్నారైలుగా అక్కడ ఎన్ని లక్జరీలు అనుభవిస్తూ జీవిస్తున్నా .. వీళ్లల్లో అతి కొద్దిమందికి మాత్రం ఎక్కడో ఏమూలో ఏదో ఒక అసంతృప్తి. మన మూలాలు, మన మాతృదేశం, మనం ఈ స్థాయికి చేరుకోడానికి కారణమైన మన తల్లిదండ్రులు, మన వాళ్లు, మన ఊరు, మన గాలి, మన నేల .. ఇవన్నీ మర్చిపోతున్నామన్న ఒక అంతరంగ మథనం. ఏదో చేయాలన్న తపన. ఇదంతా నాణేనికి మరోవైపు ..

ఇదిగో .. ఈ రెండో కోణంలోంచి పుట్టిన నవలే భరత్‌కృష్ణ రాసిన "గై ఆన్ ది సైడ్ వాక్".

అమెరికాలో ఉద్యోగంకోసం వెళ్లిన యువతరం జీవనశైలిని ఈ నవలలో చిత్రీకరించినట్టు బహుశా ఇంతకు ముందు ఏ ఇతర నవలలోనూ చేయలేదు. మరోవైపు, "గుంపులో గోవిందా" లాగా కాకుండా, ఒక ప్రత్యేక వ్యక్తిత్వంతో తన దేశంలోని పరిస్థితులు, పాలిటిక్స్, వెనకబాటుతనం, తానేమైనా చేయాలి అన్న తపన .. వీటన్నిటి గురించి నిరంతరం ఏదో ఒకటి ఆలోచించే ఈ నవలానాయకుడు "జే" (జయవర్థన్) వంటి పాత్ర కూడా ఇంతవరకు ఎన్నారై నేపథ్యంగా వచ్చిన ఏ ఇతర నవలల్లోనూ కనిపించదు.

అమెరికాలో చదవడంకోసం తను పడిన కష్టాలు, ఆ తర్వాత ఉద్యోగం, ఆదాయం అంతా బాగానే ఉన్నా, అమెరికాలోని అన్ని లక్జరీస్‌ను త్యజించి, చివరికి తన మనసుకు నచ్చిన నిర్ణయాన్నే తీసుకొని ఇండియాకు తిరిగివచ్చే ఈ నవలలోని జే పాత్ర వ్యక్తిత్వం గురించి ఎంతైనా రాయొచ్చు. ఈ ఒక్క ప్రధాన పాత్రే పాఠకులచేత నవలనంతా ఏకబిగిన చదివించేలా చేస్తుంది. అమెరికాలో ఉద్యోగం కోసం ఇండియానుంచి వెళ్లిన యువతరం జీవనశైలిని, "ఇక్కడున్నది ఇంతేనా" అని నిరంతరం మధనపడే నవలానాయకుడు జే పాత్ర ఆవిష్కరణనూ మంచి రీడబిలిటీతో, చాలా సున్నితమైన చమత్కార శైలిలో రచయిత భరత్‌కృష్ణ రాయడం విశేషం.

నవలా కథాంశం కొంచెం సీరియస్‌దే అయినా, దాన్ని నడిపించిన భరత్‌కృష్ణ కథనశిల్పం బాగుంది. చాలా సున్నితమైన చమత్కార శైలితోపాటు, అక్కడక్కడా సెటైర్లతో, "మోతాదు మించిందా" అనిపించే రియలిస్టిక్ రొమాన్స్ సన్నివేశాలుకూడా కావల్సినన్ని ఉన్నాయి.

తన తొలి నవలతోనే రచయిత భరత్‌కృష్ణ ఈ పట్టును సాధించడం మనం గుర్తించవచ్చు.

ముఖ్యంగా, సిరి పాత్రచిత్రణ అద్భుతం. సిరి, జే పాత్రలమధ్య రిలేషన్‌షిప్‌ను నిర్మొహమాటంగా, ఎలాంటి హిపోక్రసీ లేకుండా పూర్తి వాస్తవిక పధ్ధతిలో నడిపించడం బాగుంది. ఇది నిజంగా పాఠకులు చదివి ఫీలవ్వాల్సిన అంశం.

ప్రేమా, దేశం పట్ల తన బాధ్యతా .. ఏది ప్రధానం అన్నదాని గురించి కూడా ఈ నవలలో చెప్పిన పధ్ధతి పాఠకులకు బాగా నచ్చుతుంది.

రచయిత భరత్‌కృష్ణ తను ఎన్నుకున్న పాయింట్‌ను ఎంత బాగా చెప్పినా - నవల ముగింపు మాత్రం పాఠకులను కొంత నిరాశకు గురిచేస్తుంది. ఈ ముగింపు అందరికీ నచ్చదు. కానీ, అందరికీ నచ్చేలా రాయడం మళ్లీ ఒక రొటీనే అయిపోతుంది కాబట్టి అలా చేయలేదనుకోవచ్చు. మనసులోని ఆలోచనకు, సంఘర్షణకు ఒక సంపూర్ణ రూపం సంతరించుకోనప్పుడు దాన్నలా వదిలివేయడమే వాస్తవికంగా ఉంటుంది. భరత్‌కృష్ణ ఆ పనే చేశాడు.

అమెరికాలో సుమారు ఆరేళ్లపాటు ఉండి, చదివి, వివిధహోదాల్లో పనిచేసి, అక్కడి అన్ని లగ్జరీస్ చూసి ఇండియా తిరిగొచ్చిన నవలారచయిత భరత్‌కృష్ణ ఎన్నుకున్న ఈ నవలాకథాంశం చాలా విశిష్టమైనది. తమ పిల్లలను అమెరికా పంపాలనుకొనే తల్లిదండ్రులు, అమెరికావెళ్లి ఏదో సాధించాలనుకొనే యువతరం, ఇప్పటికే అమెరికాలో స్థిరపడి కూడా ఎదో కోల్పోతున్నామన్న ఆలోచనతో ఉన్నవాళ్లు తప్పక చదవాల్సిన నవల ఈ "గై ఆన్ ది సైడ్ వాక్".

గోవాలోని సిన్నమన్ టీల్ ద్వారా ప్రచురితమైన ఈ నవల - అమెజాన్ నుంచి, ఫ్లిప్‌కార్ట్ దాకా .. అన్ని ఆన్‌లైన్ సైట్స్‌లోనూ లభిస్తున్నది. విశేషం ఏంటంటే, ఈ నవల ఆవిష్కరణ కూడా రొటీన్‌కు భిన్నంగా జరిగింది. తన "గై ఆన్ ది సైడ్ వాక్" నవలను గత మార్చి 10వ తేదీనాడు ఆన్‌లైన్‌లో గూగుల్ ప్లస్, యూట్యూబ్‌ల ద్వారా  భరత్‌కృష్ణ లైవ్‌లో విడుదల చేయడం విశేషం.                                                                        

Friday, 1 April 2016

ఒక అడిక్షన్‌కు గుడ్‌బై!

ఫేస్‌బుక్ మీద నాకు నిజంగా విరక్తి వచ్చేసింది. ఇది ఉన్నట్టుండి వచ్చేసింది కాదు. సుమారు రెండు మూడు నెలలనుంచీ అనుకుంటున్నాను. కానీ, రావాల్సిన టైమ్ ఇప్పుడొచ్చింది!

మొన్న సాయంత్రం 6 గంటలకు నా ఎఫ్ బి మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ దీని గురించి ముందే చెప్పాను, నా టైమ్‌లైన్ ద్వారా.

చెప్పినట్టుగా అదే రోజు సాయంత్రం 6 గంటలకు నా ఎఫ్ బి ప్రొఫైల్‌ను, పేజ్ ని డియాక్టివేట్ చేశాను.

72 గంటలు గడిచింది. కొంపలేం మునగలేదు. సునామీ రాలేదు. వందలాది సిల్లీ సెల్ఫీలు, సొంతడబ్బాలు చూసే/రాసే/చదివే తలనొప్పి మాత్రం ఒక్క దెబ్బతో మాయమైపోయింది.

ఈ కారణాన్ని మించిన మరో కారణం కూడా ఉంది .. నా ఎఫ్ బి డీయాక్టివేషన్ వెనుక.

హిపోక్రసీ నావల్లకాదు.

లౌక్యం గురించిన ఎబిసిడిలు ఇప్పుడు నేను నేర్చుకోలేను.

నేను సంఘర్షణలో ఉన్నాను అంటే, సంఘర్షణలో ఉన్నాననే చెప్తాను. నా మనసులో నీ గురించి ఇలా అనుకుంటున్నాను అంటే, అలా అనుకున్నదే చెప్తాను కానీ, షుగర్ కోటింగిచ్చి మరొకటి చెప్పలేను.

నేను సూటిగా కమ్యూనికేట్ చేయలేని ఫ్రెండ్స్ కూడా (నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో) ఉన్న ఫేస్‌బుక్‌లో నేనుండటం నాకు చాలా అసహజంగా అనిపించింది. ఫేస్‌బుక్ ను ఎప్పటినుంచో వదిలెయ్యాలి అనుకుంటున్న నా ఆలోచనకు ఇది కేటలిస్ట్‌గా పనిచేసింది.

ఇలా అనుకోవడం, డీయాక్టివేట్ చేయడం వెంటనే అయిపోయాయి.

సో, ఆల్ హాపీస్ .. 

Sunday, 27 March 2016

రెండోవారం ఏదీ?

రాత్రి ఒక ఇంటర్వ్యూ చూశాను. అది గురువుగారు దాసరి నారాయణరావు గారిది.

"స్వర్గం నరకం" జైహింద్ థియేటర్లో రిలీజయినప్పుడు, దాని ప్రారంభపు కలెక్షన్ కేవలం 200 రూపాయలట!

అలా 200 రూపాయల కలెక్షన్లతో ప్రారంభమైన అదే సినిమా, నెమ్మదిగా రెండోవారంలో పుంజుకొని, ఆ తర్వాత మూడోవారంలో సన్‌డే నాటికి 4 ఆటలూ హౌజ్‌ఫుల్ అయ్యిందట! ఆ తర్వాతంతా చరిత్రే.

గురువుగారి తొలిచిత్రం "తాత మనవడు" విషయంలోనూ ఇదే జరిగిందని విన్నాను.

కట్ టూ 2016 - 

కొత్తవాళ్లతోనూ, అప్‌కమింగ్‌వాళ్లతోనూ తీసే సినిమాలకు భారీ రేంజ్‌లో ప్రమోషన్ ఉంటే తప్ప అసలు ఓపెనింగ్స్ ఉండవు. అంతే కాదు. ఆ సినిమాకు ఎందుకు వెళ్లాలి అన్న ప్రశ్నకు ఠక్కున సమాధానం చెప్పే 'యుఎస్‌పి' కూడా ఒకటి ఆ సినిమాకు ఉండితీరాలి. ఇవి లేనప్పుడు, సినిమా ఎంత బాగున్నా జనం దృష్టిలోకి వెళ్లదు. ప్రేక్షకులు రారు.

ఇదంతా ఇప్పుడు పెద్ద సినిమాలకు కూడా వర్తిస్తుంది.

ఒక సినిమా బాగుంది అని మౌత్ టాక్, రివ్యూలు వచ్చి - అది రెండో వారంలోనో, మూడోవారం లోనో పికప్ అయ్యేదాకా ఆగే పరిస్థితి ఇప్పుడు లేదు. అలాగే - ఓపెనింగ్ కలెక్షన్లు బాగా రాని సినిమా చిన్నదా, పెద్దదా అన్న ప్రశ్న కూడా లేదు. ఓపెనింగ్స్ బాగా వచ్చి సినిమా నడిచిందా .. ఓకే. లేదంటే, ఆ ఒక్కవారం లోనే సినిమా ఎత్తేస్తున్నారు.

ఇదీ ఇప్పటి ఇండస్ట్రీ సిస్టమ్.

ఈ పరిస్థితే గనుక అప్పుడున్నట్లైతే, దర్శకరత్న దాసరితోపాటు ఇంకెంతమందో పెద్ద దర్శకులు అసలు ఫీల్డులో ఉండేవారేకాదు అని స్వయంగా గురువుగారే అన్నారు ఆ ఇంటర్వ్యూలో.

ఈ ఒక్క కారణంగా - ప్రస్తుతం ఎంతోమంది టాలెంట్ ఉన్న కొత్త దర్శకులు ఫీల్డులో నిలదొక్కుకోలేకపోతున్నారు. ఈ మాటకూడా వారే చెప్పారు.

ఎంత నిజం?  

Monday, 14 March 2016

మైండ్‌సెట్ మేటర్స్!

'నాగురించి ఎవరేమనుకుంటున్నారో' అని అస్సలు ఆలోచించవద్దు. అలా అనుకున్నవారెవరూ అడుగు ముందుకేయలేరు.

సినీఫీల్డులో ఉన్నవాళ్లకయితే ఇది మరీ ముఖ్యం. ఇక్కడ సిచువేషన్ అలా ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే - ఒక దట్టమైన అడవిలో ఉన్నామనుకోవాలి. ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. ఎటునుంచి ఏదైనా, ఎప్పుడైనా, ఏరూపంలోనైనా ఎటాక్ చేయొచ్చు.

ఈ బేసిక్ సూత్రం ఫీల్డులో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి, టాప్ రేంజ్‌లో ఉన్నవాళ్లనుంచి .. ఇప్పుడే ఎంట్రీ ఇచ్చిన న్యూ టాలెంట్ దాకా .. అందరికీ వర్తిస్తుంది. దీనికి ఎలాంటి మినహాయింపులు లేవు. సవరణలు లేవు.

కట్ టూ రియాలిటీ -

ఎంత బిజీ పనుల్లో మునిగి ఉన్నా, ఎక్కడ తిరుగుతున్నా .. గత రెండు మూడు రోజులనుంచి మనసెందుకో చాలా మూడీగా ఉంది. ఈ మూడీనెస్‌కు కారణం ఏంటీ అంటే, దాని మీద ఒక పుస్తకమే రాయొచ్చు. కాని, దానికి చాలా టైముంది. ఆ పని తర్వాతెప్పుడైనా చేసుకోవచ్చు. అది వేరే విషయం.

ఒక స్ప్లిట్ ఆఫ్ ది సెకండ్‌లో, ముందూ వెనకా ఆలోచించకుండా మనం తీసుకొనే కొన్ని ఫూలిష్ నిర్ణయాల ప్రభావం అలా ఉంటుంది మరి. తప్పదు.

ఇప్పుడంతా కళ్లముందున్న టార్గెట్స్, టైమ్ ఫాక్టర్.

వేరే ఆలోచించడం లేదు.

అయినా సరే - అనుక్షణం ఏవేవో నా ఆలోచనల్లోకి చొచ్చుకొని వస్తున్నాయి. ఊపిరాడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నేను మాత్రం ఎక్కడా ఆగటం లేదు. పట్టించుకోవడంలేదు. ఒకరకంగా ఇది నాకు నేనే వేసుకున్న పనిష్‌మెంట్. కాని, ఈ పనిష్‌మెంట్ ఇప్పుడు నాకు చాలా అవసరం.

ఎట్ లీస్ట్, నా కొత్త ప్రాజెక్టును అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసేదాకా. 

Sunday, 6 March 2016

చార్లీ చాప్లిన్ విజయరహస్యం!

తలరాత, విధిరాత, ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది .. వంటి శాస్త్రాలను నేను నమ్మలేను. నమ్మను.

మన కృషినిబట్టే ఫలితం ఉంటుంది. మన నిర్ణయాలనుబట్టే కొన్ని కలిసిరావడమో, లేదా కలిసిరాకపోవడమో జరుగుతుంది. ఇది నా వ్యక్తిగత నమ్మకం. చాలా సందర్భాల్లో నా అనుభవం కూడా.  

కట్ టూ చార్లీ చాప్లిన్ -

తన జీవితకాలంలో సుమారు 80 సినిమాల్లో నటించి, 3 అకాడమీ అవార్డుల్ని అందుకున్న చార్లీ చాప్లిన్ అంటే కేవలం ఒక్క నటుడుగానే అందరికి తెలుసు. కానీ - అతనొక మంచి రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, బిజినెస్‌మేన్ అన్న విషయం చాలామందికి తెలియదు.

మేరీ పిక్‌ఫోర్డ్, డగ్లస్ ఫెయిర్‌బాంక్స్, డి డబ్ల్యూ గ్రిఫిత్ లనే మరో ముగ్గురు ఆర్టిస్టులతో కలిసి చాప్లిన్ పూనుకోకపోతే, 1919 లో "యునైటెడ్ ఆర్టిస్ట్స్" అనే ప్రొడక్షన్ కంపెనీ అసలు హాలీవుడ్‌లో ఏర్పడేదే కాదు.

హాలీవుడ్ చరిత్రలో కేవలం ఆర్టిస్టులు మాత్రమే స్థాపించిన మొట్టమొదటి స్టూడియో అదే!    

చార్లీ చాప్లిన్ చెప్పిన ఒక మూడు కొటేషన్లను రికార్డ్ చేసుకోవడం కోసం, మరో కోణంలో స్వీయ విమర్శ కోసం మాత్రమే నేనీ బ్లాగ్ పోస్ట్ రాస్తున్నాను:

“Nothing is permanent in this world, not even our troubles.”

“I like walking in the rain, because nobody can see my tears.”

“The most wasted day in life is the day in which we had not laughed.”

చాప్లిన్ మార్కు ఎంటర్‌టైన్‌మెంట్ మొత్తాన్ని, ఆయన జీవితాదర్శాన్నీ ఈ మూడు కొటేషన్లలో మనం చూడొచ్చు. అలాంటి చార్లీ చాప్లిన్ తన ఆటోబయోగ్రఫీలో చెప్పుకున్నట్టు .. చాప్లిన్ విజయరహస్యం ఏ విధిరాతో కానే కాదు.

క్రియేటివ్ ఫ్రీడమ్!

ఈ క్రియేటివ్ ఫ్రీడమ్‌కు అడ్డుపడే చిక్కుల్ని ప్రారంభంలోనే గుర్తించకపోవడం, లేదా అలాంటి చిక్కుల్ని  కొనితెచ్చుకోవడం ఎంత తెలివితక్కువతనమో - వాటిల్లోంచి వెంటనే బయటపడకపోవడం అంతకంటే పెద్ద మూర్ఖత్వం.

ఈ చిక్కులు వ్యక్తిగతమైనవి కావొచ్చు, సాంఘికమైనవి కావొచ్చు, ఆర్ధికమైనవి కావొచ్చు. అడుగడుగునా మాత్రం అడ్డుపడతాయి. జీవితాన్ని అనుకున్నట్టుగా ముందుకు సాగనీయవు. జీవితంలో అసలు ఎన్నడూ ఊహించని అల్లకల్లోలం సృష్టిస్తాయి.    

ఈ లాజిక్ ఒక్క క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికే కాదు, అందరికీ వర్తిస్తుంది.

ఈ నిజాన్ని ముందే గ్రహించగలిగాడు కాబట్టే - చాప్లిన్ తన క్రియేటివ్ ఫ్రీడమ్‌కు అడ్డుపడే చిక్కులకు ముందే చెక్ పెట్టుకున్నాడు. 1919 లోనే హాలీవుడ్‌లో యునైటెడ్ ఆర్టిస్ట్స్ స్థాపించాడు. తను కోరుకున్న క్రియేటివ్ ఫ్రీడమ్‌ను సాధించుకొన్నాడు.

"చార్లీ చాప్లిన్" అనగానే పెదాలపైన నవ్వు వికసించేలా ప్రపంచ చలనచిత్ర చరిత్రలో నిల్చిపోయాడు.