ఒకే ఒక్క సక్సెస్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. బెల్లం చుట్టూ ఈగల్లా నీ చుట్టూ ఎందరో చేరతారు. నువ్వే ఆశ్చర్యపోయేంతగా!
ఆతర్వాత ఎంత గుడ్డి నిర్ణయాలు తీసుకొన్నా, కనీసం ఒక దశాబ్దం నీకెలాంటి కష్టం ఉండదు. ఏ లోటూ ఉండదు.
నువ్వు కలలో కూడా ఊహించని వ్యక్తులు ఓవర్‌నైట్‌లో నీ నెట్‌వర్క్‌లోకొస్తారు. అప్పటిదాకా నిన్ను కేర్ చేయని, నిన్ను వెలివేసిన నీ సోకాల్డ్ మిత్రులూ బంధువులూ "ఆహా ఓహో" అంటూ నిన్ను వెతుక్కుంటూ నీదగ్గరకొస్తారు. వాళ్ల నటన ముందు నువ్వు అప్పటిదాకా డైరెక్ట్ చేసిన నీ నటీనటులు ఎందుకూ పనికిరారు.
అంతా ఒక మాండ్రెక్స్ మత్తులా ఉంటుంది. 24/7 x 365 డేస్.
ఇలాంటి సక్సెస్ ఇచ్చిన కిక్కుతో వెంటనే మరో సక్సెస్‌ని కూడా ముద్దాడావనుకో .. ఇక అంతే.
భూమ్మీదనే నువ్వు స్వర్గం అనుభవిస్తావు.
స్వర్గం అంటే చచ్చాక పోయే ఏదో నాన్సెన్సికల్ డెస్టినేషన్ కాదు. రంభ, ఊర్వశి, మేనకలే కాదు. అదొక అనిర్వచనీయమైన అనుభూతి. అనుక్షణం ఆనందో బ్రహ్మే!
నువ్వు బాగుంటావు. నీ కుటుంబం, నీ బంధుమిత్రులు, నీ శ్రేయోభిలాషులు అంతా బాగుంటారు. అదే స్వర్గం. అదే "ఇక్కడ."
ఆ ఇక్కడే .. ది గ్రేట్ సినీఫీల్డు!
సో, ఆ స్వర్గద్వారాల్ని స్పృశించడానికైనా నువ్వు సినీఫీల్డులోకి వెళ్లితీరాలి.
ఫినిషింగ్ టచ్ ఏంటంటే -
ఈ స్టేజికి చేరుకొనే అవకాశం అందరికీ రాదు. అందరికీ సాధ్యంకాదు.
ఫీల్డులోకి ఎంటరయ్యి, అవకాశం అందిపుచ్చుకొన్న ప్రతి 100 మందిలో కేవలం ఒక ఇద్దరికి మాత్రమే వస్తుంది. ఆ ఇద్దరిలో నేను కూడా ఉంటాను అన్న నమ్మకం నీకున్నట్లైతే మాత్రం ఇంక ఒక్క క్షణం ఆగొద్దు.
ఫీల్డులోకి వెళ్లితీరాలి .. దూకేసెయ్యాలి ..
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani