ఆమధ్య ఒక మోస్ట్ ట్రెండీ సబ్జెక్ట్‌తో "ఓకే బంగారం" తీసి, హిట్ చేసి, ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ 2 ఎపిక్ హిస్టారికల్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి, "నాయకుడు" తర్వాత 35 ఏళ్ళకు, కమల్‌హాసన్‌తో మళ్ళీ ఒక ఎపిక్ "థగ్ లైఫ్" ప్రారంభించిన మణిరత్నం వయస్సు 68.
"వెస్ట్ సైడ్ స్టోరీ", "ది ఫేబుల్‌మాన్స్" సినిమాలను బ్యాక్ టు బ్యాక్ తీసి, మొన్నే 2022లో రిలీజ్ చేసిన స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఇప్పుడు మరో కొత్త సినిమా ప్లాన్‌లో ఉన్నారు. స్పీల్‌బర్గ్ వయస్సు 77. 2032 దాకా "అవతార్" 3, 4, 5 సినిమాలను ప్లాన్ చేసుకొని, ప్రస్తుతం ఒకవైపు "అవతార్ 3" పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుతూ, మరోవైపు "అవతార్ 4" షూటింగ్ చేస్తూ, 2032లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న "అవతార్ 5" క్రియేషన్ బిజీలో మునిగితేలుతూ తన క్రియేటివ్ జీవితపు ప్రతి నిముషం జుర్రుకొంటూ ఎంజాయ్ చేస్తున్న జేమ్స్ కెమెరాన్ వయస్సు 70.
రంగీలా, కంపెనీ, సర్కార్ వంటి క్లాసిక్స్‌తో మెప్పించిన మేవరిక్ డైరెక్టర్ ఆర్జీవీ, ఆమధ్య పోర్న్‌స్టార్ మియా మల్కోవాతో "గాడ్, సెక్స్ అండ్ ట్రుత్" కూడా తీశాడు. ఏ కుర్ర డైరెక్టర్ కూడా పెట్టలేని కెమెరా యాంగిల్స్‌లో షాట్స్ పెట్టి "ఎంటర్ ది గాళ్ డ్రాగన్" తీసిన ఆర్జీవీ, తన క్రియేటివిటీని ఇప్పుడు పూర్తిగా ఒక అర్థం పర్థం లేని పొలిటికల్ మెస్‌కు అంకితం చేసుకున్నాడు అని అందరూ అనుకుంటూవుండగానే, కొత్తగా తన మార్క్ సినిమాల కోసం, ఒక మైండ్‌బ్లోయింగ్ "డెన్" ప్రారంభించి, మల్టిపుల్ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అవి ఏవైనా కానీ, అతనిష్టం. పని చేస్తున్నాడు. ఈ మేవరిక్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ వయస్సు ఇప్పుడు 62. "సర్కార్" అని ఫ్రెండ్లీగా ఆర్జీవీ పిలుచుకునే "బిగ్ బి" అమితాబ్ బచ్చన్ వయస్సు 82.
సో వాట్?!
నాగార్జునకు 65, చిరంజీవికి 69 అంటే ఎవరన్నా నమ్ముతారా? వారి ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్ ముందు ఇప్పటి యంగ్ హీరోలు ఎంతమంది పనికొస్తారు? మర్చిపోయాను... తన చిత్రాలకు, తనకు కలిపి 41 ఆస్కార్ నామినేషన్స్, 13 ఆస్కార్ అవార్డుల్ని ఖాతాలో వేసుకున్న ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ వయస్సుకి మామూలుగా అయితే అందరూ రిటైర్ అయిపోయి, మంచం మీద నుంచి లేవలేమని ఫిక్స్ అయిపోతారు. కాని, ఆయన తాజాగా వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ హౌజ్ కోసం "జూరర్ నంబర్ 2" అని కొత్త సినిమా ప్రారంభించారు, అయిపోవచ్చింది కూడా. క్లింట్ ఈస్ట్‌వుడ్ వయస్సు ఇప్పుడు జస్ట్ 94.
ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. మన ఆలోచనలు, మైండ్‌సెట్ యంగ్‌గా ఉన్నప్పుడు వయస్సు అనేది... జస్ట్ బుల్ షిట్.
- మనోహర్ చిమ్మని
(మొన్న 26/11/2024 నాడు, నా పుట్టినరోజు సందర్భంగా ఈ పాతపోస్టునే ఇప్పుడు మరోసారి ఫ్రెష్‌గా పోస్ట్ చేశాను.)
(మొన్న 26/11/2024 నాడు, నా పుట్టినరోజు సందర్భంగా ఈ పాతపోస్టునే ఇప్పుడు మరోసారి ఫ్రెష్‌గా పోస్ట్ చేశాను.)
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani