ఒక అధ్యయనం ప్రకారం - నీకు నచ్చిన ఒక మంచి స్నేహితునితో-లేదా-స్నేహితురాలితో... ఎలాంటి అరమరికలు లేకుండా, ఏమీ దాచిపెట్టుకోకుండా, డిప్లొమసీ లేకుండా, బుర్ర నిండా ఉన్న టెన్షన్స్ పక్కన పెట్టేసి, ఫ్రీగా ఒక 12 నిమిషాలు మాట్లాడగలిగితే చాలు... నీ మొత్తం ఆలోచించే విధానమే మారిపోతుందట.
అదెలా అంటే... ఎన్నో రోజులుగానో, నెలలుగానో, సంవత్సరాలుగానో... ఏదో ఒక అంశం గురించో, ఒక సమస్య గురించో, ఒక రిలేషన్‌షిప్ గురించో, ఒక నిర్ణయం గురించో... నీ ఆలోచనలన్నీ ఒక్కటే లూప్‌లో తిరుగుతుంటాయి. అది నీకు తెలుసు, కాని గుర్తించవు. అదే నీ కమ్‌ఫర్ట్ జోన్. ఆ జోన్ విడిచిపెట్టి నువ్వు బయటికిరాలేవు. అయినా సరే... అవే కష్టాలు భరిస్తూ, అదే టెన్షన్లో, నీకు తెలియకుండా నిన్ను కమ్మేసిన ఒక క్రానిక్ డిప్రెషన్లో నువ్వు బ్రతుకుతుంటావు. అంతా బాగా లేదని నీకు తెలుసు. కాని బాగున్నట్టే ఫీలవుతుంటావు. బయటికి కూడా నువ్వు అలాగే కనిపిస్తుంటావు అందరికీ. కాని, అది నిజం కాదు.
ఇదిగో ఇదంతా ఒక ఒక బ్యాగేజీ. నువ్వు మోయలేని ఒక పెద్ద బరువు. ఇదంతా పక్కనపెట్టి... నీకు నచ్చిన ఫ్రెండుతో పైన చెప్పినట్టు అన్ని ఫిల్టర్సూ తీసేసి, ఫ్రీగా ఒక 12 నిమిషాలు మాట్లాడగలిగితే చాలు. నువ్వొక కొత్త మనిషివవుతావు. కొత్తగా ఆలోచిస్తుంటావు.
ఇప్పటిదాకా నిన్ను వేధిస్తున్న సమస్యలకు, నువ్వే ఒక కొత్త పరిష్కారం కనుగొంటావు. నువ్వే ఒక నిర్ణయం తీసుకొంటావు.
కాని, ఇది ఎవ్వరూ చేయరు. ఎవ్వరికీ అంత సమయం లేదు. 12 నిమిషాలు కాదు, ఎన్నో వందల నిమిషాలు వృధాగా వెచ్చిస్తుంటారు. కాని, అదే పనికిరాని ఫెయిల్యూర్ లూప్‌లో కొనసాగుతుంటారు.
దీన్ని బ్రేక్ చేసినవాళ్ళు కింగ్స్, క్వీన్స్.
కట్ చేస్తే -
There is a reminder that I always have 12 minutes for you.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 3/100.
100 Days, 100 Posts. 3/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani