పాకిస్తాన్‌ను లేవకుండా కొట్టడానికి భారత్‌కు ఒక 48 గంటలు చాలు. కాని, చైనా పాకిస్తాన్‌కు అండగా వస్తే ప్రమాదం. యుద్ధం కొనసాగుతుంది.
లోపల్లోపల మన ప్రభుత్వంలో, అంతర్జాతీయంగా సి ఐ ఏ స్థాయిలో కూడా ఎన్నెన్నో ప్లాన్స్ జరుగుతుంటాయి. మనకు బయట కనిపించేది ఒకటి ఉంటుంది. లోపలి స్ట్రాటెజీలు వేరేగా ఉంటాయి.
పాకిస్తాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసి, భారత్‌కు అనుకూల నాయకున్ని అధినేతగా చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇదే సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి భారత్‌లో కలుపుకొనే పని కూడా పూర్తి కావచ్చు.
చెప్పలేం. ఏది ఎక్కడినైనా దారితీయొచ్చు.
యుద్ధం కొనసాగితే మాత్రం సాధారణ జనజీవితం, ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అవుతాయి. అలా జరగొద్దనే ఆశిద్దాం. ఇంకొన్ని గంటల్లో ముగియాలనే కోరుకొందాం.
కట్ చేస్తే -
ఆ అంశం పైన సోషల్ మీడియాలో మనం రాసుకునేవన్నీ ఎలా ఉంటాయంటే... టీవీలో ఐపియల్ మ్యాచ్ చూస్తూ, "విరాట్ కొహ్లి ఆ బాల్‌ను అలా కొట్టాల్సింది కాదు..." అని, క్రికెట్‌లో అ-ఆ లు తెలీని మనం కొహ్లీకి ఉచితసలహాలు ఇచ్చినట్టుంటుంది.
ఫీల్డులో యుద్ధం చేసేవాళ్లకు, వాళ్ళ కుటుంబాలకు తెలుస్తుంది... అసలు యుద్ధం అంటే ఏంటో, దాని ప్రభావం ఎలా ఉంటుందో.
దేశ భద్రత కోసం పోరాడుతున్న మన త్రివిధదళాల ఫైటర్స్‌కు సెల్యూట్ చేద్దాం. వారి క్షేమం కోసం ప్రార్థిద్దాం.
జై హింద్. జై భారత్.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 13/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani