నేనేం పెద్ద సెలబ్రిటీ కాదు.
కానీ, ఫేస్‌బుక్ టైమ్‌లైన్ ఓపెన్ పెట్టాలి. వాట్సాప్‌లు, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్/ట్విట్టర్లు చూసుకొంటూ ఉండాలి. ఫోన్‌కు అందుబాటులో ఉండాలి. మిత్రులు, ఆత్మీయుల గ్రీటింగ్స్‌కు రెస్పాండ్ అవుతుండాలి.
నా మిత్రులు, శ్రేయోభిలాషులైనవారందరి శుభాకాంక్షలను నేను తప్పక గౌరవిస్తాను. వారి అభిమానానికి సర్వదా కృతజ్ఞుణ్ణి. కానీ, ఎక్కువభాగం, ఇదంతా ఒక అనవసరమైన ఆబ్లిగేషన్, హిపోక్రసీ, అనవసరంగా కొనితెచ్చుకొనే ఒక మానసిక వత్తిడి... అని నాకనిపిస్తుంది.
నేను కరెక్టు కాకపోవచ్చు, కాని నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది.
కొన్ని తప్పవు. అంతే.
కట్ చేస్తే -
ఈసారి నా పుట్టినరోజు నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పుట్టినరోజు అవుతుంది. ఎందుకంటే, ఈ పుట్టినరోజు నేపథ్యంగా, దాదాపు ఒక 40 రోజుల క్రితమే, ఒకటి రెండు చాలా పెద్ద నిర్ణయాలు తీసుకున్నాను... వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కూడా. గట్టిగా సంకల్పించాను. సాధిస్తాను కూడా.
Wish me the best.
Wish me the best.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani