నా సినిమాటోగ్రాఫర్ మిత్రుడు వీరేంద్రలలిత్‌కు, నాకూ మాత్రమే తెలిసిన కొన్ని కోడ్ వర్డ్స్ ఉన్నాయి. సెట్స్ లోపల, బయటా సందర్భం వచ్చినప్పుడు మా కోడ్ భాషలో మేము తరచూ ఉపయోగించే పదం - కాంప్లెక్సిటీ!
జీవితంలో కాంప్లెక్సిటీ అంటే మా ఇద్దరికీ చాలా ఇష్టం. "కాంప్లెక్సిటీ లేని లైఫ్ అసలు లైఫే కాదు" అన్నది మా ఫిలాసఫీ.
అయితే - ఇది అందరూ మామూలుగా అనుకొనే కాంప్లెక్సిటీ కాదు. మా కోడ్ భాషలో దీనర్థం వేరే!
నా రెండో చిత్రం "అలా" తో పరిచయమయ్యాడు వీరేంద్రలలిత్. అప్పటినుంచీ ప్రొఫెషనల్‌గా దాదాపు రెండు దశాబ్దాల పరిచయం మాది. అంతకుమించి, వ్యక్తిగతంగా రెండు దశాబ్దాల స్నేహం మాది. ఈ రెండు దశాబ్దాల్లో ఇద్దరం కలిసి 3 సినిమాలు చేశాము.
బయట అందరికీ తెలిసింది ఒక్కటే. వీరేన్‌కు సినిమా అన్నా, ఫోటోగ్రఫీ అన్నా పిచ్చి ప్యాషన్ అని. కానీ, దీన్ని మించి ఆయన గురించి నేను చెప్పాల్సింది చాలా ఉంది.
డిల్లీ యూనివర్సిటీలో ఫిలాసఫీలో ఎం ఫిల్ చేశాడు వీరేన్. పెద్ద ఒరేషియస్ రీడర్. ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు. మన చరిత్ర, మన సంస్కృతి, మనం మర్చిపోయిన మన సంస్కృత భాష, మన వేదాలు, మన వైద్యం, మన ఫిలాసఫీల గురించి ఎంతయినా మాట్లాడగలడు.
అయితే - ఇదంతా ఏదో ఉపన్యాసంలా చెప్పడు. చాలా సింపుల్‌గా చెప్తాడు. జీవితంలో మనం మళ్లీ మర్చిపోకుండా!
సినిమాటోగ్రఫీకి సంబంధించి తనకు నచ్చిన ప్రతి పనీ చేస్తాడు. ఒక్క సినిమాలకే కాదు .. డాక్యుమెంటరీలకు, మ్యూజిక్ వీడియోలకు, యాడ్‌లకు కూడా పనిచేసే ఈ అంతర్జాతీయ స్థాయి కెమెరామన్ పాస్‌పోర్ట్ బుక్కులు బుక్కులుగా అయిపోతుంటుంది.
సినిమాటోగ్రాఫర్‌గా ఇప్పటికే ఒక 20 సినిమాలు, డైరెక్టర్‌గా 4 సినిమాలు, వందలాది కమర్షియల్ యాడ్స్, డాక్యుమెంటరీస్ చేసిన వీరేన్ .... మన భూమ్మీద ఉన్న దాదాపు 195 దేశాలుంటే, ఒక 20 తప్ప అన్ని దేశాలు విజిట్ చేశాడు. నాకు తెలిసి, ఇంకో అయిదారేళ్లలో మిగిలిన ఆ కొన్ని కూడా కవర్ చేసి "లోకం చుట్టిన వీరుడు" అవుతాడు.
ఇండస్ట్రీలో కొంతమంది కెమెరామన్‌లు సెట్స్ పైన ఎంత గొడవ గొడవగా అరుస్తారో అందరికీ తెలిసిందే. వీరేన్ నోటి నుంచి ఎప్పుడూ అరుపులూ కేకలు రావు. లైట్‌మెన్‌నీ, అసిస్టెంట్‌లనీ బూతులు తిట్టడు. లైట్ బాయ్‌లు చెయ్యాల్సిన ఎన్నో పనుల్ని తనే స్వయంగా చేసుకుంటాడు.
ఈగో లేదు. కోపం రాదు. చిరునవ్వు చెరగదు.
వీరేన్ లేకుండా కూడా నేను మరో కెమెరామన్‌తో షూటింగ్ చేయగలను. కానీ, ప్రతిరోజూ 101 కొత్త టెన్షన్‌లను ఎదుర్కొంటూ ఇంత కూల్‌గా మాత్రం చేసేవాన్ని కాదేమో.
కట్ చేస్తే -
వీరేంద్ర లలిత్ రెమ్యూనరేషన్‌ను మొన్న నేను చేసిన రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా "ఎర్ర గులాబి" బడ్జెట్ భరించలేదు. "ఇంతే ఇవ్వగలుగుతాం... చెయ్యాలి" అన్నాను. నాకోసం సంతోషంగా ఒప్పుకొన్నాడు.
ముంబై నుంచి వచ్చాడు. సుమారు 40 రోజులపాటు హైద్రాబాద్‌లోనే మేం ఏర్పాటు చేసిన ఒక చిన్న గెస్ట్ హౌజ్‌లో ఎలాంటి కంప్లెయింట్ లేకుండా అడ్జస్ట్ అయి ఉన్నాడు.
ముంబై నుంచి వచ్చాడు. సుమారు 40 రోజులపాటు హైద్రాబాద్‌లోనే మేం ఏర్పాటు చేసిన ఒక చిన్న గెస్ట్ హౌజ్‌లో ఎలాంటి కంప్లెయింట్ లేకుండా అడ్జస్ట్ అయి ఉన్నాడు.
ఒక్క సినిమాటోగ్రాఫర్‌గానే కాదు... అన్ని డిపార్ట్‌మెంట్లూ తనవే అనుకొని ప్రాజెక్టు త్వరగా పూర్తికావడం కోసం చాలా కష్టపడ్డాడు. ఇందుకు ప్రతిఫలంగా - ఆయన స్థాయిని గుర్తించలేని కొంతమందిచేత ప్రత్యక్షంగా, పరోక్షంగా అవమానించబడ్డాడన్న విషయం నా ఒక్కడికే తెలుసు.
ఇలాంటి విషయాల ప్రస్తావన తెచ్చినప్పుడు "వదిలేయండి. వాళ్లకు ఏం తెలీదు. మనకు ప్రాజెక్టు ముఖ్యం" అంటాడు వీరేన్.
మొన్న "ఎర్ర గులాబి" షూటింగ్ పూర్తయ్యాక దాదాపు టీమ్ అంతా ప్రాజెక్టు గురించి మర్చిపోయారు... ముఖ్యమైనవాళ్లతో సహా. వీరేన్ మాత్రం, తను ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా, దాదాపు ప్రతిరోజూ నన్ను అడుగుతుంటాడు, "పోస్ట్ ప్రొడక్షన్ ఏ స్టేజిలో ఉంది సర్... ఎలా వస్తోంది" అని.
అదీ వీరేన్ సిన్సియారిటీ.
థాంక్యూ సో మచ్ వీరేన్!
త్వరలో ప్రారంభం కానున్న "Yo!" షూటింగ్‌తో పాటు, మేమిద్దరం కలిసి పూర్తిగా ముంబైలోనే ఇంకో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాము. దానికి ముహూర్తాలు, ఓపెనింగ్స్, ఎనౌన్స్‌మెంట్స్ ఏమీ ఉండవు.
లైట్స్-కెమెరా-యాక్షన్! ... దట్సిట్.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani