Friday, 23 August 2024

ఒకరికోసం ఒకరు మారటం అనేది పెద్ద హంబగ్!


ఎవరో ఏదో అనుకుంటారన్న మొహమాటంతో మళ్ళీ అదే మనకి నచ్చని పనులు చేస్తూ సమయం వృధా చేసుకోవడం, మన ఆలోచనులు వృధాచేసుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. 

ముఖ్యంగా - మన ముందు చేయాల్సిన పనులు ఎక్కువగా ఉండి, చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు అసలు ఈ కోణంలో ఆలోచించనే వద్దు. అన్ని ప్లాన్లూ పనులూ పేకమేడలా కూలిపోతాయి. 

ఒక్కొక్కరి నేపథ్యం ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. జీవితాన్ని చూసే పద్ధతి కూడా ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. ఎవరికి వారే యూనిక్. అలాంటప్పుడు... "నువ్విలాగే ఉండాలి", "నువ్విలా చేయాల్సింది" వంటి మాటలు ఎదుటివారిని నిజంగానే ఇబ్బంది పెడతాయి. ఆ పొరపాటు నేను చేయలేను.   

ఒకరికోసం ఒకరు మారటం అనేది కూడా పెద్ద హంబగ్. నిజమైన స్నేహం, ప్రేమ ఉన్నచోట ఇలాంటి ఆలోచనే రాదు. మనకు నచ్చినవారిని యాజిటీజ్‌గా నచ్చటం కంటే ఆనందం ఇంకేముంటుంది? అసలు ఏ ప్రేమైనా, స్నేహమైనా పుట్టేది అలాగే కదా?

ఈమధ్య మా యూనివర్సిటీ మిత్రుల గ్రూప్‌లో వివిధకోణాల్లో కొంత అలజడి చూసిన తర్వాత ఎందుకో ఇది రాయాలనిపించింది. 

కలిసామా, కలిసినంతసేపు వీలైనంత హాయిగా, బిందాస్‌గా ఉన్నామా... దట్సిట్. 

కట్ చేస్తే -

జీవితం ఒక్కటే. 

మన కోసం మనం, కనీసం కొన్నేళ్ళయినా, మనం ఉండాలకున్నట్టు ఉండాలి. చెయ్యాలనుకున్నది చేసెయ్యాలి.  

మిగిలిందంతా జస్ట్ బుల్‌షిట్!   

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani