కట్ చేస్తే -
అసలు విగ్రహాలు పెట్టడం అన్నది పూర్తిగా ఒక అవుట్‌డేటెడ్ కాన్సెప్ట్ అని నా అభిప్రాయం.
పెట్టిన విగ్రహాలన్నీ రోడ్లమీద దుమ్ముకొట్టుకొనిపోయుంటాయి. ఎవ్వడూ అటువైపు చూడడు. పుట్టినరోజో, పోయినరోజో వచ్చినప్పుడు తప్ప.
అప్పుడు కూడా, విగ్రహం పక్కనే ఫిక్స్‌డ్‌గా పాతేసిన ఇనుప నిచ్చెనల మీదకెక్కి దండలేసి, పూలు గుమ్మరించే పొలిటీషియన్స్ ఫోటోల కోసమే తప్ప, ఇంకెప్పుడూ ఎవ్వరూ అటువైపు చూడరు.
మనవాళ్ళ ఇంకో పెద్ద మతిలేని పని ఏంటంటే - విగ్రహాల ప్రాముఖ్యతను, అందాన్ని మింగేసే సైజులో ఒక నల్లటి ఇనుప నిచ్చెనను అక్కడ పక్కనే పాతెయ్యడం!
ఇలాంటి గొప్ప అద్భుతం ఒక్క మన దేశంలోనే అనుకుంటాను మనం చూసేది.
ఇలాంటి గొప్ప అద్భుతం ఒక్క మన దేశంలోనే అనుకుంటాను మనం చూసేది.
కట్ చేస్తే -
విగ్రహం చూస్తే తప్ప గుర్తుకురారు అని ఎలా అనుకుంటాం? విగ్రహం పెట్టుకుంటే తప్ప స్మరించుకున్నట్టు కాదు అని ఎలా అనుకుంటాం?
ఆయా వ్యక్తులు చేసిన పనులు, సాధించిన గొప్ప లక్ష్యాలే వారిని ప్రజల మనస్సుల్లో చిరస్మరణీయంగా నిలబెడతాయి.
ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్రాల అభివృద్ధి కోసం, దేశాన్ని ఒక అగ్ర రాజ్యం చేయడం కోసం అందరి ఆలోచన, అందరి తపన, అందరి కృషి టాప్ ప్రయారిటీలో ఉండాలి. ఒక జపాన్ లాగా, ఒక చైనా లాగా, ఒక రష్యా లాగా. మిగిలినవన్నీ ఉట్టుట్టి రాజకీయాలే. ఇప్పుడైనా ఎప్పుడైనా.
ప్రాక్టికల్‌గా పనికొచ్చే పనులు తప్ప, 99% మంది మనవాళ్ళు మిగిలిన అన్ని పనులు చెయ్యడానికి పోటీపడుతుంటారు.
ఏదీ సాఫీగా ఉండొద్దు. ఏదో ఒకటి గెలకాలి. దారి మళ్ళించాలి. నేపథ్యంలో సొంత ప్రయోజనాలు కూల్‌గా నెరవేర్చుకొంటూవుండాలి.
ఏదీ సాఫీగా ఉండొద్దు. ఏదో ఒకటి గెలకాలి. దారి మళ్ళించాలి. నేపథ్యంలో సొంత ప్రయోజనాలు కూల్‌గా నెరవేర్చుకొంటూవుండాలి.
మన ఆలోచనావిధానంలో, మన సమాజంలో, మన రాజకీయాల్లో ఒక లేయర్ లేయరే కొట్టుకుపోతే తప్ప... ఇంకో వందేళ్ళయినా... మనం ఇలా ఒక "అభివృద్ధిచెందుతున్న దేశం" చందంగానే వుంటాం.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani