ప్రొడ్యూసర్‌గా ఒక సినిమా చేసి, థియేటర్స్‌లో రిలీజ్ చేసినవారికే చాంబర్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుందని విన్నాను.
వెల్ అండ్ గుడ్.
అయితే, విధిగా ఆ ప్రొడ్యూసర్ తను రిలీజ్ చేసిన సినిమా రిలీజ్‌కు సమబంధించిన లెటర్‌ను ల్యాబ్ నుంచి తెచ్చి చాంబర్లో సబ్మిట్ చెయ్యాలన్న లింక్ ఒకటి ఉందని ఈ మధ్యే మా మేనేజర్ ద్వారా తెలిసింది.
ఎంత కామెడీ ఇది?
ఫిలిం చాంబర్‌కు తెలియకుండా థియేటర్స్‌లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయా? అవుతాయా?
2007 లో రిలీజ్ అయిన ఒక సినిమాకు సంబంధించిన రిలీజ్ లెటర్‌ను అప్పటి ఏ ల్యాబ్ ఇప్పుడిస్తుంది? అప్పటి ఫిలిం ల్యాబ్స్ ఇప్పటి డిజిటల్ యుగంలో అసలు ఉన్నాయా? మూతబడ్డాయా? మూతబడిపోతే పరిస్థితి ఏంటి?
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రిలీజయ్యే ప్రతి సినిమా గురించిన వివరాలు చాంబర్లో రిజిస్టర్ కాకపోతే ఇక ఆ చాంబర్ వ్యవస్థ ఏ స్థాయిలో పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రాథమిక స్థాయిలోనే విధిగా రిజిస్టర్ అయితీరాల్సిన ఇంత అతి చిన్న, అతి ముఖ్యమైన సమాచారాన్ని సిస్టమటైజ్ చెయ్యలేని ఫిలిం చాంబర్ నుంచి చిన్న సినిమాల ప్రొడ్యూసర్లు, దర్శకులు పెద్ద ప్రయోజనాలు ఏం ఆశిస్తారు?
జస్ట్ ఈ ఒక్క కారణం వల్ల వోటు లేక, వోటు వేయలేకపోతున్న ప్రొడ్యూసర్స్ కనీసం ఒక వందమంది అయినా ఉంటారన్నది నిజం. ప్యానెల్ ఏదైతేనేం, వంద వోట్లకు ఎంత వాల్యూ ఉంటుంది?
కట్ చేస్తే -
జస్ట్ ఈ ఒక్క కారణం వల్ల వోటు లేక, వోటు వేయలేకపోతున్న ప్రొడ్యూసర్స్ కనీసం ఒక వందమంది అయినా ఉంటారన్నది నిజం. ప్యానెల్ ఏదైతేనేం, వంద వోట్లకు ఎంత వాల్యూ ఉంటుంది?
కట్ చేస్తే -
లైఫ్ మెంబర్ అయ్యుండీ, ప్రస్తుతం జరుగుతున్న ఫిలిం చాంబర్ ఎన్నికల్లో నాకు ఓటు లేకపోవడానికి ఇదే రీజన్ అన్నది ఫినిషింగ్ టచ్!
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani