Monday, 22 December 2025

హిట్ సినిమాకో లెక్కుంది!


ఆమధ్య మేం చేసిన రోడ్ క్రైం థ్రిల్లర్ "ఎర్ర గులాబి" ప్రొడ్యూసర్ యువన్ శేఖర్ ఒకసారి ఒక మాటన్నాడు. 

"ఏమైనా సరే, మీరు ఇప్పుడు ఒక హిట్ ఇవ్వాలి" అని. 

నాకు కూడా నిజంగా ఒక హిట్ ఇవ్వాలనే ఉంది. కాని, మంచి బడ్జెట్‌తో దానికి సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ ఒకరు దొరకాలి.

దొరకరు.
మనమే క్రియేట్ చేసుకోవాలి.

నేనిప్పుడు ఆ పనిలోనే ఉన్నాను. 

కట్ చేస్తే - 

ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా సినిమా హిట్ కావాలనే చేస్తారు.

కాని, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వుడ్‌లో అయినా...
ఎక్కువలో ఎక్కువ ఒక 5% సినిమాలు మాత్రమే హిట్ అవుతాయి. 

ప్రపంచంలో ఎక్కడైనా ఇదే లెక్క.

ఆ 5% హిట్స్‌లో మనం ఉండాలి. 
అదీ అసలు లెక్క. 

- మనోహర్ చిమ్మని   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani