ఎప్పటికప్పుడు "ఈ ఒక్క సినిమా తీసి వదిలేద్దాం" అనుకోవటం అంత వెర్రివెంగలప్ప డెసిషన్ ఇంకోటి ఉండదు.
అంటే, సినిమాలు వదిలెయ్యటం కోసం సినిమా చెయ్యటం అన్నమాట!
ఆఫ్‌కోర్స్, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక చాలామందికి వారి వారి సినిమా కష్టాలు, అనుభవాలు, అవమానాలు, తలనొప్పులు, అప్పులు చాలా ఉండొచ్చు.
అయినా సరే, అది నిజంగా ఒక అర్థం లేని నిర్ణయమే.
కట్ చేస్తే -
ఇలాంటి పసలేని చప్పటి నిర్ణయం ఇండస్ట్రీలో చాలామంది తీసుకుంటుంటారు. తర్వాత ఎప్పుడో ఒక పదేళ్ళ తర్వాత బాధపడుతుంటారు.
స్ట్రాటెజిక్‌గా ఇది ఎంత చెత్త నిర్ణయం అంటే... ఈ నిర్ణయం బాక్‌డ్రాప్‌లో మనం తీసుకునే ఇతర నిర్ణయాలన్నీ మరింత చెత్తగా ఉంటాయి.
కర్ర విరగదు, పాము చావదు.
ఆ "ఒక్క సినిమా" అనుకున్నట్టు జరగదు.
నిజంగా వదిలేసేటప్పుడు, ఆ క్షణం, అలా అనుకొని చిటికెలో వదిలేయవచ్చు కదా? దాని గురించి ఇప్పుడే ఎందుకు?
ముందు ఇప్పుడు చేసే ప్రాజెక్ట్ సంగతి చూసుకోవాలి. చిన్నదో పెద్దదో సరైన ప్రాజెక్టును, సరైన మనుషుల్ని ఎన్నుకోవాలి. సరైన టీమ్ సెట్ చేసుకోవాలి.
ఇది నేను ఇక్కడ రాస్తున్నంత ఈజీ కాదు.
కాని, తీవ్రంగా ప్రయత్నించాలి.
ఇది నేను ఇక్కడ రాస్తున్నంత ఈజీ కాదు.
కాని, తీవ్రంగా ప్రయత్నించాలి.
నీ పర్సనల్ లక్ష్యాల నేపథ్యంలో, నువ్వు ఎన్నుకున్న ప్రాజెక్టును ఇంకా ఇంకా బాగా ఎలా చెయ్యాలో ఆలోచించాలి. నిజంగా అంత బాగా చెయ్యాలి.
ఈ క్రమంలో ఈగోలు, అడ్డంకులు, అవమానాలు, డబ్బు కష్టాలు చాలా ఉంటాయి.
నిన్నొక మోసగానిలా చూస్తారు. నిర్మొహమాటంగా మొహం మీదే అంటారు. అన్నీ తట్టుకోవాలి.
మణిరత్నం, శేఖర్ కపూర్ కంటే ఎక్కువేం కాదుకదా నువ్వు? వాళ్ళు తట్టుకున్నన్ని అవమానాల ముందు నువ్వెంత?
ఒక్కటే ఫోకస్.
జస్ట్ వన్ థింగ్.
హిట్ కొట్టాలి.
హిట్ కొట్టాలి.
తర్వాత సంగతి తర్వాత.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani