Friday, 5 December 2025

2026 కి... 26 రోజులు!


2025లో అసలు ఏం చేశాం? ఏం సాధించాం?

అసలేమన్నా చేశామా?
పనికొచ్చే పనులేం చేశాం? 
పనికిరాని పనులేం చేశాం? 

శేఖర్ కపూర్, మణిరత్నం చెప్పినట్టు - ఈ ఫీల్డులో పనిచేస్తున్నందుకు - ప్రత్యక్షంగా, పరోక్షంగా - ఎవరెవరితో ఎన్ని మాటలు పడ్డాం, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాం? 

ఎంతమంది నానా కథలు చెప్పి మనకు హ్యాండిచ్చారు? మనం ఎన్నిసార్లు మాట తప్పాం? 

చేసిన తప్పులే చేస్తున్నామా? కొత్త తప్పులు కూడా చేశామా? ఏం నేర్చుకున్నాం?      

తీసుకున్న నిర్ణయాలేంటి? ఎన్నిటికి నిలబడ్డాం? ఎన్ని మార్చుకున్నాం?  

... ఒక అరగంటో, గంటో అంతర్విశ్లేషణ చాలా అవసరం. 

ఆర్థికం.
సాంఘికం.
వ్యక్తిగతం. 

అంతర్విశ్లేషణ చాలా అవసరం. 

కనీసం ఇలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడైనా, మన కోసం మనం ఇలా కొన్ని నిమిషాలైనా కెటాయించుకోవాలి. మనతో మనం "మన సమయం" గడపాలి. 

ఇది అవసరం. 
ఇదే అవసరం.

ఈ విషయంలో క్లారిటీ లేకుండా ఇంకేం చెయ్యలేం. 

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani