ఓటీటీలో, ఆన్‌లైన్లో చూడ్డం... అదంతా వేరే.
కట్ చేస్తే -
మీకు తెలుసా?
మొన్న ఒక్క నవంబర్ నెలలోనే తెలుగులో 39 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకే ఒక్క సినిమా హిట్ అయింది. అది చాలా చిన్న బడ్జెట్ సినిమా. అంతా కొత్తవాళ్ళతో తీసిన ఇండిపెండెంట్ సినిమా.
అది...
"రాజు వెడ్స్ రాంబాయి".
"రాజు వెడ్స్ రాంబాయి".
ఇంకో సినిమా, "ఆంధ్రా కింగ్ తాలూకా"కు బాగుంది అన్న టాక్ వచ్చింది కాని, రావల్సిన కలెక్షన్ రాలేదు.
సినిమాల హిట్-ఫ్లాప్‌ల విషయంలో పెద్ద సినిమా, చిన్న సినిమా అని ఏం ఉండదు.
పోస్ట్ కోవిడ్ రోజుల నుంచి ప్రేక్షకులు కూడా క్రమంగా ఓటీటీలకే పరిమితం అవుతున్నారు. థియేటర్స్‌కు వెళ్ళి సినిమా చూసే ప్రేక్షకులు ఇంకా ఇంకా తగ్గిపోతున్నారు.
ఈ నేపథ్యంలో -
"రిస్క్-ఫ్రీ"గా ఎంత చిన్న బడ్జెట్‌లో సినిమా తీయగలం?
ఎంత మంచి కంటెంట్ ఇవ్వగలం?
ఏ స్థాయి హిట్ ఇవ్వగలం?...
అన్నదే ఇప్పుడు ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ విషయంలో ఒక కొత్త చాలెంజ్ అయింది.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani