ఒక ప్రొడ్యూసర్ దగ్గరికో, హీరో దగ్గరికో వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేసేలా కథ చెప్పటం, ఓకే చేయించుకోవటం... తర్వాత ఆ ప్రొడ్యూసర్ సినిమా తీసినప్పుడు, లేదా ఆ హీరో డేట్స్ ఇచ్చినప్పుడు సినిమా చేయటం... లేదా, అప్పుడూ ఇప్పుడూ అని వాళ్ళు మభ్యపెడుతున్నది నమ్ముతూ సంవత్సరాలకి సంవత్సరాలు వృధాచేసుకోవడం.
ఇదంతా పాత కథ. పనికిరాని ఒక పాత రొటీన్.
ఇప్పుడలా కాదు. అంతా కార్పొరేట్ స్టయిల్.
ఒక డైరెక్టర్ తన ప్రాజెక్ట్ ప్లాన్‌తో, ప్రపంచంలో ఎవ్వరి నుంచైనా, ఏ కార్పొరేట్ ఫండర్ నుంచైనా ఫండింగ్ తెచ్చుకోవచ్చు. డీల్ ప్రకారం వాళ్ళ బెనెఫిట్స్ వాళ్ళకు ఇవ్వొచ్చు. పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్‌తో మనం అనుకున్న సినిమాల్ని మనం తీసుకోవచ్చు.
నెమ్మదిగా మన దగ్గర కూడా ఇప్పుడు ఈ సిస్టమ్ ప్రారంభమైంది. వేగం పుంజుకొంటోంది.
ఏ రంగంలో అయినా మార్పు అనేది అత్యంత సహజం. దాన్ని ఎవ్వరూ ఆపలేరు.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani