ఒక ఫిలిం ప్రమోషన్ ఈవెంట్ స్టేజీ మీద హీరోహీరోయిన్స్ ఒక సీనియర్ ఫిలిం జర్నలిస్టు కాళ్ళమీదపడి మొక్కడం ఏదైతే ఉందో... ఇది ఈమధ్య నేను చూసిన మరీ అతి సీన్ అన్నమాట!
కట్ చేస్తే -
నేషనల్ లెవెల్లో అర్నబ్ గోస్వామి "ధురంధర్ సినిమా మీరు చూడొద్దు... చూడొద్దు" అని లబలబా మొత్తుకున్నాడు.
అర్నబ్ ఎఫెక్టు ఖచ్చితంగా ఈ లోకల్ జర్నలిస్టు కంటే కనీసం ఓ ఇరవై రెట్లు ఎక్కువగానే ఉంటుంది కదా?
ఏమయింది మరి?
ధురంధర్ సినిమా ఫెయిల్ అయ్యిందా?
అన్ని రికార్డ్స్ బద్దలు చేస్తూ 1100 కోట్లు కొల్లగొట్టింది.
సినిమాలో మ్యాటర్ ఉండాలి. మంచి ప్రమోషన్ చెయ్యాలి. ఇలాంటి ఉత్తుత్తి చెంచాగిరి పనులు నిజంగా అవసరమా?
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani