Thursday, 25 December 2025

లొకేషన్ స్కౌటింగ్ & బిజినెస్ ట్రిప్


కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో ఇప్పుడు మేం చేస్తున్న సినిమాల ఫండింగ్, లొకేషన్ల ఫైనలేజేషన్ కోసం తెలంగాణ, ఏపీల్లోని కొన్ని ప్రాంతాల్ని సందర్శించాల్సిన తేదీలు దాదాపు ఖరారయ్యాయి. 

టీమ్ డైరెక్టర్‌గా నేను, మా సినిమాల సీఈవో ప్రదీప్, ఇంకో ఇద్దరు మా ఫైనాన్షియల్ అడ్వయిజర్స్ బయల్దేరబోతున్నాం. ఇప్పటికే వెళాల్సింది. చిన్న కారణం వల్ల ఆలస్యమయింది. 

రెండు మూడు రోజుల్లో అంతా సెట్ అవుతుందని అనుకుంటున్నాను.

కట్ చేస్తే - 

చిన్నవో పెద్దవో... ముందు సినిమాలంటూ చేస్తూ ఉండాలి. చేతినిండా పని ఉండాలి. 

ఎవరో రావాలని, ఏదో జరగాలని ఎదురుచూస్తూ ఉండటం వలన మామూలుగా అయ్యే పనులు కూడా కావు. 

ఇది... తెలిసి, మనందరం చేసే తప్పు.

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani