Saturday, 20 December 2025

అందరి 24 గంటలు ఒకటే కాదు!


గురువుగారు "దర్శకరత్న" దాసరి నారాయణరావు 1980,1981,1982 ల్లో - వరుసగా మూడేళ్ళూ - సంవత్సరానికి 10 సినిమాలు చేశారు.

అలాగని ఏదో చుట్టచుట్టి అవతల పడేసిన సినిమాలు కావవి. వాటిల్లో 80% సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, సిల్వర్ జుబ్లీలు!

స్వప్న, శ్రీవారి ముచ్చట్లు, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, సీతారాములు మొదలైనవి ఆ లిస్ట్ లోనివే. 

హిందీ సినిమాలు యే కైసా ఇన్సాఫ్, జ్యోతి బనే జ్వాల కూడా ఆ లిస్టులోనివే. 

కట్ చేస్తే -

ఫిలిం నెగెటివ్ వాడిన ఆరోజుల్లోనే సంవత్సరానికి అన్ని సినిమాలు చేయగలిగినప్పుడు, ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో సంవత్సరానికి ఒక్క సినిమా అయినా ఎందుకని చెయ్యలేకపోతున్నాం? 

- మనోహర్ చిమ్మని    

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani