Thursday, 12 November 2026

ప్రయాణం చెయ్యి, కొత్త ఆలోచనలొస్తాయ్!


జీవితంలో ఏదైనా మంచి జరిగిందా? 
ప్రయాణం చెయ్యి.
సెలబ్రేట్ చేసుకో. 

ఏదైనా చెడు జరిగిందా?
ప్రయాణం చెయ్యి. 
మామూలు మనిషి అయిపో.

అసలేమీ జరగలేదా?
ప్రయాణం చెయ్యి.
కొత్త ఆలోచనలొస్తాయి. 
కొత్తగా మొదలెట్టు... సాధించు.

కట్ చేస్తే -

ఒక్కసారి గుర్తుకుతెచ్చుకోండి. వేల ఏళ్ళ కింద గాని, ఇటీవలి చరిత్రలో కాని, ఇప్పుడు నడుస్తున్న చరిత్రలో కాని... గొప్ప గొప్ప విజయాలు సాధించినవాళ్ళలో దాదాపు 80 శాతం మంది ప్రయాణాలు చేస్తూ సాధించినవాళ్ళే. 

దేశాలను కనుక్కొన్నవాళ్ళు, శాస్త్రాలను రాసినవాళ్ళు, వివిధ రంగాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలను సాధించినవాళ్ళంతా కూడా నిరంతరం ప్రయాణాలు చేసినవారే. 

మీకు తెలుసా... బిల్ గేట్స్ కూడా తరచుగా "థింక్ వీక్" పేరుతో ఒక వారం రోజులు పసిఫిక్ నార్త్-వెస్ట్‌లో ఎక్కడో ఎవ్వరికీ తెలియనంత దూరం వెళ్తాడు. 

ఆయన వెంట రెండు మూడు బ్యాగుల్లో బుక్స్, ప్రింటెడ్ నోట్స్, తెల్లకాగితాలు, పెన్నులు తీసుకెళ్తాడు. ఫోన్లు, కంప్యూటర్స్, టాబ్లెట్స్, టీవీలు, మొబైల్స్ లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఒక్కటి కూడా ఉండదు. వైఫై అసలుండదు.   

రోజూ కొన్ని గంటలు చదువుతాడు.
కొత్త ఐడియాల మీద కొన్ని గంటలు వర్క్ చేస్తాడు.
కొన్ని గంటలు తెల్లకాగితాల మీద పెన్‌తో నోట్స్ రాసుకుంటాడు.
ఒక గంట వాకింగ్ చేస్తాడు.
అసలేమీ చెయ్యకుండా కొన్ని గంటలు గడుపుతాడు!

సంవత్సరాలు గడిచినా దొరకని పరిష్కారాలు, ఇలాంటి థింక్ వీక్స్‌లో దొరుకుతాయి. 

ఎన్నడూ రాని ఆలోచనలు ఇలాంటి ప్రయాణాల్లో అనుకోకుండా వస్తాయి. 

ఉన్నచోట ఎంతకూ కదలని పనులు, బయటకెళ్ళినప్పుడు చాలావేగంగా పూర్తవుతాయి. 

ఉదాహరణకు, సినిమాఫీల్డులో కొందరు డైరెక్టర్స్ స్క్రిప్టు రాసుకోడానికి గోవా, బ్యాంకాక్, బాలి లాంటి ప్రదేశాలకెళ్తారు. మొబైల్ ఆఫ్ చేసేస్తారు. రూంలో టీవీ ప్లగ్ పీకేస్తారు. అంతే. 

ఇక్కడ రెండుమూడు నెలలయినా కదలని స్క్రిప్టు, అక్కడ అయిదు-పది రోజుల్లో అయిపోతుంది!   

"డీప్ వర్క్" అన్నమాట. 

ఎప్పుడూ నాలుగు గోడలమధ్యే కాకుండా, అప్పుడప్పుడూ ప్రయాణం కూడా చేస్తుండాలి. ఇలాంటి ఒంటరి ప్రయాణాల్లోనే కొత్త ఆలోచనలొస్తాయి. కొత్త ఆరంభాలకు పునాది పడుతుంది. పాత సమస్యలకు కొత్త పరిష్కారాలు దొరుకుతాయి. కొత్తగా విజయాలు సాధిస్తాం.

మీ తర్వాతి ప్రయాణం ఎప్పుడు?
 
రైల్లోనో, బస్‌లోనో, ఫ్లయిట్‌లోనో... ఈసారి కిటికీ పక్కన కూర్చున్నప్పుడు ఆలోచించండి. మీకే అర్థమవుతుంది.    

Social Media Is Your Social Marketing!


In the age of AI, being good at what you do is no longer enough. People must know you exist. 

Be seen. Create buzz. Share your ideas. Build connections. Make things happen. 

Visibility is no longer optional. It is your responsibility.

But here's something we must understand... 

The buzz you create on social media is your social marketing, not your real identity.

Your online visibility may create opportunities, attract attention and build your brand. That's important. But never confuse public attention with personal worth, followers with real relationships, or online popularity with actual success.

There are two different worlds: the buzz outside and the person inside. Build your visibility, but never lose your authenticity.

Be visible to the world. Stay true to yourself. 

We are who we are. Social media is only how we present ourselves to the world. Never let the two become confused.

- Manohar Chimmani 

Wednesday, 11 November 2026

మనకు నచ్చినట్టు వాడేసుకోడమే!


ఎన్ని లైకులు, ఎంత మంది ఫాలోయర్స్, కామెంట్స్ ఏంటి... ఇవన్నీ కాదు. 

వాడెవడో ఎప్పటికప్పుడు మార్చే ఏ అల్గారిధమో కూడా కాదు. 

మనకు నచ్చినట్టు మనం వాడేసుకోవాలి. పర్సనల్ కావచ్చు. ప్రొఫెషనల్ కావచ్చు. వాడేసుకోడమే. 

ఎంత బాగా వాడేసుకోవాలంటే... దీనికోసం మనం వెచ్చించే ఆ 30 నిమిషాలో, గంట సేపో... సంపూర్ణంగా వాడేసుకోవాలి. 

పర్సనల్‌గా అయితే మనం హాప్పీగా ఫీలవ్వాలి. రోజువారీ టెన్షన్స్ నుంచీ, స్ట్రెస్ నుంచీ డైవర్ట్ అయిపోవాలి. ప్రొఫెషనల్‌గా అయితే మనం అనుకున్నట్టు రిజల్ట్స్ వచ్చేలా వాడేసుకోవాలి. 

నో కాంప్రమైజ్. 

కట్ చేస్తే -

నేనిప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఒక్కటే వాడుతున్నాను. ఎక్స్, ఎఫ్ బి, ఇన్‌స్టా... ఈ మూడింటినీ ఒక్క ఇన్‌స్టాగ్రాంలోనే చూసుకొంటున్నాను. 

ఇన్‌స్టా బ్లాగింగ్ కూడా చేస్తున్నాను. 

ఇప్పుడు బాగుంది... ఫ్రీగా. రిలాక్స్‌డ్‌గా. 

విన్ విన్. 

సోషల్ మీడియా క్రియేట్ చేసి వాళ్ళు మనల్ని వాడుకుంటున్నారు. మనం కూడా సాధ్యమైనంత బాగా సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి. లేదంటే అక్కడ మనం వెచ్చించే ప్రతి నిమిషం ముమ్మాటికీ వ్యర్థం.   

Love Yourself Like Your Life Depends On it


Stop seeking approval. Start choosing yourself. 

Think about how much time and energy you spend worrying about what others think of you. Now imagine investing that same energy in loving, respecting and believing in yourself.

Self-love isn't selfishness. It's knowing your worth, respecting your choices, accepting your imperfections and refusing to compromise your happiness just to please others.

The moment you care as much about your own opinion of yourself as you care about everyone else's, something powerful changes. You become more confident, make better decisions and start living on your own terms.

Stop living for their approval. Start living for yourself. Your life depends on it. 

My First Journey to the Himalayas


Sometimes, to break a routine or get out of a rut that seems impossible to escape, a change is essential.

Nothing brings that change better than travel.

And it is even better when you travel to a place you've never been before.

Whenever I think of the Himalayas, I remember my dear friend Sadiq. He told me many times, "Come with me to the Himalayas at least once, Manu. You'll understand what you've been missing. The Himalayas will give you as much happiness as the ocean does."

Sadiq is no more.

That's life.

We never know how long we are here. So, do we really need all these tensions, arguments, misunderstandings, masks, egos and complications in such a short life?

There are things we simply cannot believe until they happen to us. Until we experience them ourselves.

How frustrating is it when something that could once be done with a single phone call now takes a whole year and still doesn't move?

I don't care about the reasons. Things must move. Work must get done.

Cut to - 

Unexpectedly, I had to travel to Chandigarh and Delhi. I decided to connect this Himalayan journey to the same trip.

My destination is the Dhauladhar mountain range, part of the Middle Himalayas. I will be spending about a week in this beautiful region.

After hearing my entire travel plan, my sons gave me their green signal too.

"Have a happy journey, Daddy!"

I'm travelling alone. I'm not carrying my laptop either. Until the 22nd, I won't be using my mobile phone. No calls. No messages.

Just a few sheets of blank paper, some pens and one or two books to keep me company.

I've already written, published and scheduled my blog posts for the next ten days. They will appear every day without a break, even while I'm away.

I'll upload a few photographs on Instagram whenever I feel like it.

See you again on the 22nd or 23rd!

“It is not the mountain we conquer, but ourselves.”
— Sir Edmund Hillary

"Fitness first. Everything else follows."
— Rich Monk

— Manohar Chimmani 

Tuesday, 10 November 2026

Blogging Is Not Dead. It's Home.


Platforms change. Trends come and go. But the joy of owning your own space never gets old.

Some people believe the golden age of blogging is over. Today, writers have Medium, Reddit, LinkedIn, Substack and several other platforms where content can be published, discovered and shared instantly. 

The visibility and immediate reach that traditional blogs often lack have changed the game.

Perhaps that's true. But does it mean blogging is dead? 

I don't think so.

Personally, I still love writing on my blog. It's my space, my voice, my ideas and my identity.

I may use Substack to publish and reach more readers, but I don't want to abandon my own blog.

Here's how I see it... 

Other platforms may help you reach an audience, but your blog gives you a home. You build it, shape it, own it and grow it on your own terms.

I don't see my blog merely as a place to publish articles. It's my business, my creative space, my thoughts and my niche. I don't have to chase a niche or squeeze myself into a category.

I am my niche.

Let the platforms evolve. Let new trends emerge. I'll continue writing, publishing and building my little corner of the internet.

Because I don't just write a blog.
I love my blog.
And I'm home here.

హిమాలయాలకు మొదటిసారి


ఎంతకూ బ్రేక్ చెయ్యలేని ఒక రొటీన్‌నో, ఒక స్టకప్‌నో బ్రేక్ చెయ్యాలంటే ఒక మార్పు తప్పనిసరి.

ప్రయాణానికి మించిన మార్పు లేదు. 

అది కూడా, ఇంతకు ముందు మనం ఎప్పుడూ వెళ్ళని ప్రదేశమైతే ఇంకా మంచిది.    

హిమాలయ యాత్ర అనగానే నాకు మా సాదిక్ గుర్తొస్తాడు. నాతో ఎన్నోసార్లు అన్నాడు... "ఒక్కసారి నాతో హిమాలయాలకు రా, మనూ. నువ్వేం మిస్ అవుతున్నావో నీకు అర్థమవుతుంది. సముద్రం ఒక్కటే కాదు, హిమాలయాలు కూడా నీకు అంతే సంతోషాన్నిస్తాయి" అని.

ఇప్పుడు సాదిక్ లేడు. 

దటీజ్ లైఫ్. 

ఎన్నాళ్ళుంటామో తెలీదు. ఇన్ని టెన్షన్స్, ఇన్ని మాటలు, ఇన్ని అపార్థాలు, ఇన్ని మాస్క్‌లు, ఇన్ని ఈగోలు, ఇంత గందరగోళం నిజంగా అవసరమా... ఇంత చిన్న జీవితానికి?

నిజంగా కొన్ని నమ్మలేం...
మనదాకా వచ్చే దాకా.
మనమే అనుభవించేదాకా. 

ఒకప్పుడు ఒక్క ఫోన్ కాల్‌తో అయిపోయే పనులు, ఇప్పుడు సంవత్సరం అయినా కదలట్లేదంటే ఎంత చికాగ్గా ఉంటుంది? 

కారణాలతో పనిలేదు. పనులు కదలాలి. పని జరగాలి.   

కట్ చేస్తే -

అనుకోకుండా చండీఘర్, ఢిల్లీ ప్రయాణాలు పడ్డాయి. ఇదే సమయంలో ఈ హిమాలయ యాత్ర కూడా కనెక్ట్ చేసుకున్నాను. 

మధ్య హిమాలయాల్లోకి వచ్చే ధౌలాధార్ పర్వతశ్రేణుల ప్రాంతంలో నా ప్రయాణం ఉంటుంది. సుమారు వారం రోజులపాటు నేను ఉండేది కూడా అక్కడే.   

నా ప్రోగ్రాం మొత్తం తెలుసుకున్న మా అబ్బాయిలు కూడా "హాప్పీగా వెళ్ళిరా, డాడీ" అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  

ఒక్కన్నే వెళ్తున్నాను. లాప్‌టాప్ కూడా వెంట తీసుకెళ్ళటం లేదు. 22 వరకు నా మొబైల్ కూడా వాడను. కాల్స్, మెసేజెస్ లేవు. 

కొన్ని తెల్ల కాగితాలు, పెన్నులు, ఒకటిరెండు బుక్స్ మాత్రం తీసుకెళ్తున్నాను. 

పదిరోజులకి బ్లాగ్ పోస్టులు ముందే పోస్ట్ చేసి, స్కెడ్యూల్ చేశాను. ఎలాంటి బ్రేక్ లేకుండా అవి రోజూ కనిపిస్తుంటాయి.

తోచినప్పుడు ఇన్‌స్టాలో ఫోటోలు ఎక్కిస్తూవుంటాను. 

22/23 నాడు పునర్దర్శనం. 

“It is not the mountain we conquer, but ourselves.” 
— Sir Edmund Hillary

"Fitness first. Everything else follows."
— Rich Monk

- మనోహర్ చిమ్మని 

The World of Passion Belongs to Risk-Takers


Playing safe may protect your comfort, but it may also keep you away from your dreams. 

Passion demands courage. It asks you to step out of your comfort zone, challenge the familiar and try things you've never tried before.

You may fail. Your own people may question your decisions. Things may not work out as planned. But that's part of the journey.

The people who create extraordinary lives aren't always the most talented or fortunate. Often, they are the ones willing to take a chance on themselves.

Don't spend your entire life wondering what could have happened if you had tried.

Take that chance.
Make a solo trip.
Start that project.
Follow that idea.
Pursue what makes you feel alive.

A comfortable life may keep you safe. But a courageous life gives you stories worth living. 

Monday, 9 November 2026

5200 రోజుల ఆత్మీయ స్నేహం


జీవితంలో ఒక దశ తర్వాత చెయ్యాలనుకున్నది చేసేసుకుంటూ పోవడమే. 

మిగిలిందంతా జస్ట్ బుల్‌షిట్! 

కట్ చేస్తే -   

21 ఆగస్టు 2012 నాడు, నేను అనుకోకుండా సృష్టించిన నా ఈ బ్లాగ్ వయస్సు చూస్తుండగానే 14 ఏళ్ళు దాటింది. 

దాదాపు 5200 రోజుల ఆత్మీయ స్నేహం మా ఇద్దరిదీ! 

ఎందరో అద్భుతమైన మిత్రులు నాకు ఇక్కడే పరిచయమయ్యారు. నా జీవితంలో ఎన్నో ముఖ్యమైన మలుపులకు, ఆలోచనలకు ఈ బ్లాగే కారణమయ్యింది.  

తీవ్రమైన ఆలోచనల్లో నేను ఎటెటో కొట్టుకుపోతున్న సున్నితమైన సమయాల్లో నన్ను కాపాడింది కూడా నా బ్లాగే.  

మొన్నటి నా బెస్ట్ సెల్లర్ పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" ఆలోచన నాలో రావడానికి కూడా నాకత్యంత ఇష్టమైన నా ఈ బ్లాగింగ్ అలవాటే కారణం. 

థాంక్స్ టు మై బ్లాగింగ్ హాబీ... ఇప్పుడు నా ఇంకో కొత్త పుస్తకం ప్రింట్‌లో ఉంది! 

డిసెంబర్లో రిలీజ్. 

ఈ మధ్య రెండురోజులు మనసు బాగోలేక ఈవైపు చూడనందుకు నిజంగా ఏదో కోల్పోయినట్టుగా ఫీలయ్యాను.     

2012 నుంచీ ఎడిక్ట్ అయిన నా బ్లాగింగ్ గురించి, పరోక్షంగా అది నాకు ఇస్తున్న ఎన్నో ఆనందాల గురించి నేను ఎంత చెప్పుకున్నా తక్కువే. 

"Sometimes I think of blogging as finger exercises for a violinist; sometimes I think of it as mulching a garden. It is incredibly useful and helpful to my “real” writing." ~Kate Christensen 

- మనోహర్ చిమ్మని 

Your Greatest Work is Beyond Your Phone


Your phone can connect you to the world. But don't let it disconnect you from your life.

Use technology. Enjoy its possibilities. Learn from it. But don't surrender your finest hours, your greatest gifts and the precious days of your life to a screen.

Your greatest work will come from your creativity, your thinking, your relationships and your ability to make a difference—not from endlessly scrolling through someone else's life.

Create more than you consume. Serve more than you scroll. Be present more than you post.

In an increasingly artificial age, protect what makes you human.

Don't let your phone become your life. Use it to build one worth living.

-Manohar Chimmani  

Sunday, 8 November 2026

Trust the Unwritten Plan


Sometimes, life has a better imagination than yours.

You may have a clear picture of what you want, how you want it and when you want it. But life doesn't always follow your script.

Don't be disappointed when things don't happen exactly as you envisioned. Sometimes, delays are redirections. Sometimes, what looks like a missed opportunity is making room for something better.

Keep believing.
Keep working.
Keep moving forward.

Stay open to possibilities you haven't even imagined yet.

You may not get what you originally wished for, but you might receive something far more beautiful, meaningful and fulfilling.

Trust your journey. Your best chapter may be one you haven't even imagined yet.

-Manohar Chimmani 

Saturday, 7 November 2026

Don't Build A Niche. Build Your World.


What if you are the niche?

Most people begin by searching for a profitable niche. They choose a subject, create content around it and try to build a business.

But there's another way.

Build your business around your ideas, knowledge, experience, creativity and philosophy. Let your personality become the connecting thread. Your interests may evolve, your subjects may change, and your creative pursuits may take new directions. Yet everything belongs to one larger world—you.

That's the beauty of owning your blog. You don't have to fit into someone else's category or follow every passing trend.

Your blog becomes your intellectual property, your creative headquarters and your business platform.

Don't spend your life fitting into a niche. Build a world that only you can create.

-Manohar Chimmani 

Accept People As They Are


The world doesn't need more judgment. It needs more understanding, compassion and love. 

Accept people as they are. Tolerate differences. Forgive mistakes. Have the courage to repent when you are wrong. And above all, resist the temptation to pass judgment on others.

We are all human, learning, struggling and evolving in our own ways. A little understanding can heal a heart. A little forgiveness can mend a relationship. A little kindness can change someone's day.

Make it a habit to perform random acts of kindness.

A thoughtful gesture,
a few encouraging words,
a helping hand
or simply listening to someone
can mean more than you imagine.

Don't wait for a special occasion to spread love. Make it part of your everyday life.

Be less judgmental. Be more human. Leave a little more love wherever you go.

- Manohar Chimmani 

ఎవరేమనుకుంటారో అన్న మైండ్‌సెట్ లోంచి బయటపడగలిగితే చాలు...


మనిషన్న తర్వాత ఏదో ఒక ఎడిక్షన్ ఉంటుంది. ఎడిక్షన్ అంటే అది ఏ తాగుడో, జూదమో, ఇంకేదో కానక్కర్లేదు. చచ్చేంత ఇష్టం ఉండే ఏదైనా పాజిటివ్ అలవాటు కూడా కావచ్చు. 

నాకున్న ఏకైక ఎడిక్షన్ బ్లాగింగ్. 

కనీసం ఒక అయిదారు సార్లు ఇంక బ్లాగింగ్ బంద్ చేద్దామనుకున్నాను. కాని, అలా జరగలేదు. 

కట్ చేస్తే - 

21 ఆగస్ట్ 2012.

సుమారు 14 ఏళ్ల క్రితం, నేను నా బ్లాగింగ్ జర్నీ ప్రారంభించాను. ఇప్పటికీ ఎలాంటి బోర్ ఫీలింగ్ లేకుండా, ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహంతో నా బ్లాగ్‌లో ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాను. 

నాకు తోచింది. 
నాకు నచ్చింది. 
నేను రాయాలనుకున్నది. 
నా గోల. 
నా గొడవ.
నా ఇష్టం.

పనికొచ్చేదో, పనికి రానిదో... ఏదో ఒకటి రోజూ కాసేపు ఇలా రాయడం చాలా అవసరం నాకు. అంతలా ఎడిక్టయ్యాను.

ఏదో రాసి ఎవర్నో ఉద్ధరించాలని కాదు ఇక్కడ విషయం. నన్ను నేను ఉద్ఢరించుకోవడం కోసం మాత్రం నాకు నిజంగా తప్పనిసరి. 

ఇంతకు ముందు చాలా సార్లు నాకు నేనే చెప్పుకున్నట్టు - రాయడం అనేది నాకు సంబంధించినంతవరకు - ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం. ఒక స్పిరిచువల్ ఎక్సర్‌సైజ్. 

వెనుక ఎన్ని వేధిస్తున్నా, వెంటాడుతున్నా... వాటితో పొరాడుతూనే నవ్వుతూ ఉండటం ఎలా? నలుగురికీ నవ్వుని పంచటం ఎలా?… అన్నది ఇలాంటి ఒక క్రియేటివ్ యాక్టివిటీ వల్లే సాధ్యమవుతుంది. అది బ్లాగింగ్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, డాన్స్, పాడటం, రాయటం... ఇంకేదైనా కావచ్చు. జస్ట్ ఒక క్రియేటివ్ యాక్టివిటీ చాలు. దానికోసం రోజూ కొన్ని నిమిషాలు చాలు. 

నాకు నా బ్లాగింగ్ ఉంది.
మరి, మీకేముంది? 

ఎవరేమనుకుంటారో అన్న మైండ్‌సెట్ లోంచి బయటపడగలిగితే చాలు... బ్లాగింగ్, మనతో మనం మాట్లాడుకోడానికి ఒక మంచి ఔట్‌లెట్‌లా పనిచేస్తుంది. 

కొత్త పరిచయాలు. 
కొత్త స్నేహాలు. 
కొత్త ఆలోచనలు.
కొత్త ఆరంభాలు. 

నా బ్లాగింగ్ వల్లే ఇప్పుడు కొత్తగా నేను ఇంకో పుస్తకం పూర్తిచేశాను. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నాను. 

డ్రగ్ - Become Addicted to Success.

- మనోహర్ చిమ్మని  

Friday, 6 November 2026

The Quiet Mind Creates


Ideas are the real currency of the 21st century.

But ideas are not merely thoughts.

Sometimes, they are whispers from within.

A quiet thought that arrives when you are walking alone.
A strange question that refuses to leave you.
A sudden connection between two things nobody else has connected before.

Pay attention.

The mind is constantly producing noise.
The soul speaks more quietly.

That is why you need silence.

Read.
Observe.
Think.
Write.
And, most importantly, be still.

You don't have to chase great ideas.

Create enough inner space for them to find you.

Not every idea needs to become a business.
Not every thought needs to become content.
Some ideas are simply there to transform you.

And sometimes, the idea that changes your life begins as a very small whisper.

So become an idea machine.
But remain a monk at heart.

Create more.
Consume less.
Think deeply.
Live consciously.

The richest ideas often come from the quietest minds.

— Manohar Chimmani 

జీవితంలోంచి ఒకటి తీసేశాం అనుకుంటేనే ఎంత హాయిగా ఉంది!


ఒక్కటే బ్లాగ్.
ఒక్కటే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్.
ఒక్కటే ప్రొఫెషన్.
ఒక్కటే లైఫ్.

చాలు ఈ నాలుగు. 
ఏదైనా చెయ్యొచ్చు, ఎంతైనా సాధించొచ్చు.

మన నిర్ణయాలు.
మన టర్మ్స్, మన ఇష్టం. 

ఏదో అవుతుందని ఎదురుచూడ్డాలు. ఎన్నో డిజపాయింట్‌మెంట్స్. మనకు నచ్చని మనుషులు. నచ్చని యాటిట్యూడ్స్. నచ్చని వాతావరణం. సిగ్గువిడిచిన కాంప్రమైజ్‌లు. 

అవసరమా అవన్నీ ఇంకా? 

కట్ చేస్తే -  

జీవితంలోంచి ఒకటి తీసేశాం అనుకుంటేనే ఎంత హాయిగా ఉంది! 

దానికి సంబంధించి మిగిలిపోయిన ఒకటిరెండు తలనొప్పులు కూడా తొలగించుకుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాం. ఆ సుదినం కూడా ఎంతో దూరం లేదు.  

Live is now. Press play. 

The Beauty of A Simple Life


What if the secret to living more is actually doing less? 

One blog. 
One social media — Instagram. 
One profession — Writing. 
One life, lived on my own terms.

No unnecessary noise. No endless chasing. No pressure to be everywhere or do everything.

Just the joy of creating, expressing, exploring, connecting and experiencing life fully.

I want to write more, think freely, read good books, travel, enjoy meaningful relationships and make every day count.

This is not about doing less with life. It's about making room for more of what truly matters.

Less noise. More creativity. More meaning. More life. 

And that's exactly the life I want to live. Nothing to prove. Nothing to chase. Just the joy of being myself, creating what I love and enjoying every moment of the journey.

This is my life. This is my Rich Monk life. 

Live life to the fullest. Remain a monk at heart.

— Manohar Chimmani 

Your Greatest Work Is Not in Your Phone


Your greatest work will never be found inside your phone.

Technology is a useful tool. Use it. Enjoy it. But do not give it your finest hours, your greatest gifts, or the days of your life. Least of all to the small screen in your pocket.

Ask yourself a simple question each day...

Did I create more than I consumed? Did I serve more than I scrolled? 

Your best ideas, your kindness, your craft, and your presence belong to the people and the world around you. A machine can show you a thousand images, but it cannot live your life for you.

Protect your time. Protect your attention. Protect what makes you human.

Start today. Your life is waiting for you, not your screen.

- Manohar Chimmani 

Tuesday, 3 November 2026

Success is a Way of Life


Success isn't something you chase occasionally. It becomes a part of who you are when you make it your lifestyle.

You stop chasing motivation and start building discipline. You stop waiting for opportunities and start creating them. You stop worrying about outcomes and learn to trust your process.

Here's what I've come to realize... 

When you make success a daily practice rather than a distant destination, your entire relationship with life changes. 

You no longer need constant victories to feel successful. You find fulfilment in the person you're becoming and the way you're living.

Eventually, results follow—not by surprise, but as a natural consequence of how you think, act and live every day.

Success is not where you arrive. It's how you live. 

- Manohar Chimmani 

మనీ కావాలా? మంచి లైఫ్ కావాలా?... రెండూ సాధ్యమే!

జీవితం ఒక్కటే...
ఇంకెన్నాళ్ళు మీ లక్ష్యాల కోసం మీ ఒంటరి పోరాటం?


మీ వ్యక్తిగత జీవితం, మీ ఆనందం, మీ సక్సెస్, మీ సంపాదన...
అన్నీ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నాయి!

Build a Business Around Your Passion. 
Live Life to the Fullest.

అందరికీ జీవితం ఒక్కటే. అందరూ భూమ్మీదే పుట్టారు. ప్రపంచంలో అద్భుత విజయాలు సాధించినవారెవ్వరూ ఆకాశంలోంచి ఊడిపడలేదు. వారికేం అతీత శక్తులు లేవు. 

వారూ మనలాగా మనుషులే. 

అయితే – కొందరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ, విజయాలు సాధించుకొంటూ ముందుకెళ్తుంటారు. జీవితాన్ని అద్భుతంగా ఎంజాయ్ చేస్తుంటారు. 

చాలామంది ఉన్నచోటే ఆగిపోతారు.

ఎందుకలా?

ఎందుకంటే – 

మనీ, రిలేషన్‌షిప్స్…
ఈ రెండూ మన జీవిత నాణ్యతను ప్రభావితం చేసే
అత్యంత ముఖ్యమైన అంశాలు. 

రెండిట్లో ఏది ముందు అంటే తప్పకుండా “మనీ”నే ముందు.

ఎవరికైనా సరే, ముందు చేతినిండా పని ఉండాలి. ఆ పని సరిపోయినంత ఆదాయాన్ని ఇస్తూ ఉండాలి. అలా సరిపోయినంత ఆదాయం ఉన్నప్పుడు రిలేషన్‌షిప్స్ బాగుంటాయి. రిలేషన్‌షిప్స్ బాగున్నప్పుడు మరింత ఆనందంగా ఉంటారు. మరింత బాగా డబ్బు సంపాదిస్తారు. 

కొందరి విషయంలో ఇది రివర్స్‌లో ఉండవచ్చు. “రిలేషన్‌షిప్స్” బాగున్నప్పుడే వీరు ఏదైనా చేయగలుగుతారు. ఎంతయినా సంపాదించగలుగుతారు. 

అనుభవాల నేపథ్యాన్ని బట్టి, రెండూ కరెక్టే. 
నిజానికి ఇదంతా మన మైండ్‌సెట్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.


ఒక '10X పర్సనల్ కోచ్‌'గా –
మనీ, రిలేషన్‌షిప్స్…
ఈ రెండు విషయాల్లోనూ
నేను మీకు సహాయపడగలను. 

మనీ:
మీ ప్యాషన్, నైపుణ్యాలు, అనుభవాల ఆధారంగా మంచి బిజినెస్ అవకాశాలను గుర్తించడం, ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకోవడం, వాటిని ఆచరణలో పెట్టడం వంటి విషయాల్లో మిమ్మల్ని ప్రాక్టికల్‌గా గైడ్ చేయగలను. మీరు ఇప్పటికే బిజినెస్‌లో ఉండి ఉంటే, దాన్ని మరింత సక్సెస్‌ఫుల్‌గా అభివృద్ధిచేసే మీ ప్రయత్నాల్లో మీకు తోడుగా ఉండి సహకరించగలను.
    
రిలేషన్‌షిప్స్:
మీ వ్యక్తిగతం కావచ్చు, మీ వివాహబంధంలో కావచ్చు, మీ స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, బయట ఉద్యోగపరమైన-వృత్తిపరమైన సంబంధాల విషయంలో కూడా కావచ్చు… మీరు ఎదుర్కొంటున్న చాలెంజెస్‌ను పరిష్కరించుకోవడంలో నేను మీకు సహాయపడగలను.

మీ వయస్సు ఎంతైనా కావచ్చు. “ఇంక ఇంతే… ఎలా రాసిపెట్టివుంటే అలా జరుగుతుంది” అని మీరు అనుకోవడానికి వీల్లేదు.

జీవితంలోని ఏ దశలోనైనా, దేనికైనా పరిష్కారం తప్పక ఉంటుంది. 

మంచి ఆరోగ్యం కోసం మనం డాక్టర్‌ను ఎలాగయితే సంప్రదిస్తామో… మంచి సంపాదన, మంచి జీవితం కోసం మీకు పర్సనల్‌గా ఒక కోచ్ కూడా అంతే అవసరం. 
 

ఒక అతిచిన్న దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి బయటపడి హైదరాబాద్ వచ్చాను. మెషినిస్ట్‌గా వర్క్‌షాపుల్లో పనిచేసుకొంటూ మళ్ళీ చదువుకొన్నాను. యూనివర్సిటీలో రెండు పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివి, యూనివర్సిటీ టాపర్‌గా రెండు గోల్డ్ మెడల్స్ సాధించాను. మూడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేశాను. రచయితనయ్యాను. బెస్ట్ సెల్లర్ పుస్తకాలు రాశాను. రచయితగా నంది అవార్డు సాధించాను. తర్వాత ఫిలిం డైరెక్టర్ అయ్యాను, ప్రొడ్యూసర్ అయ్యాను. అయిదు సినిమాలు డైరెక్ట్ చేశాను.  

ఇంకెన్నో చేశాను, చేస్తున్నాను, చేయబోతున్నాను... 

ఎక్కడో దూరం నుంచి ఒంటరిగా సిటీకి వచ్చి, ఎవ్వరి సహాయం లేకుండా, నేనే ఈ స్థాయికి రాగలిగినప్పుడు... ఈ డిజిటల్-ఏఐ యుగంలో మీరు మరింత ఈజీగా ఏదైనా సాధించగలుగుతారు. 


నేను జీవితంలో ఎన్నో సాధించినవాన్ని, ఎన్నో కష్టనష్టాలు చూసినవాన్ని, అనుభవించిన వాన్ని. నేను ఎదుర్కొన్న అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు మీకు ఉపయోగపడేలా, అనవసరమైన తప్పిదాలను తగ్గించుకుని, మెరుగైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లేలా ఒక 10X పర్సనల్ కోచ్‌గా మీకు సహాయపడగలను.

మనీ కావాలా? 
మంచి లైఫ్ కావాలా?

రెండూ సాధ్యమే.
ఈ రెండిటినీ మీరు సాధిస్తారు.

జీవితం ఒక్కటే. ఒంటరి పోరాటం చేస్తూ, మీలో మీరే బాధపడుతూ మరింత సమయం వృధా చేసుకోకండి.

నా పర్సనల్ కోచింగ్ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. అవసరం అనుకుంటే పర్సనల్‌గా కూడా కలుస్తాము. మీరు నాతో చర్చించే ప్రతి విషయం గోప్యంగా నా మనస్సులోనే ఉంటుంది. మీ సమస్యలు నా సమస్యలవుతాయి. మీరూ నేనూ కలిసి, వాటికి పరిష్కారం కనుక్కొంటాము. 

మీ కెరీర్‌లో మెరుగైన అవకాశాలను సృష్టించుకోవచ్చు.
మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించవచ్చు.
మీ వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు.
సరైన దిశలో, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగవచ్చు.

మీ కెరీర్ బాగుంటుంది. 
మీరు డబ్బు సంపాదిస్తారు. 
మీ రిలేషన్‌షిప్స్ బాగుంటాయి. 

ఇదంతా, మీరూహించనంత వేగంగా సాధ్యం అవుతుంది!

నేను మీ కోచ్‌ను మాత్రమే.
ఈ జర్నీలోని ప్రతి స్టెప్‌లో నేను మీ వెంట ఉండి గైడ్ చేస్తాను.
పనిచెయ్యాల్సింది, సాధించాల్సింది మాత్రం మీరే. 


In working with you, I bring my multi-passionate, diverse background and real-world experience.


Your success is my success.

మీకు సహాయపడుతూ నేను కూడా కొత్త విషయాలు నేర్చుకొంటాను. కొత్త లక్ష్యాలు సాధిస్తాను. ఇది నా ప్యాషన్. 

ముందే చెప్పినట్టు, అంతా మన మైండ్‌సెట్ మీద ఆధారపడి ఉంటుంది. 

"నాలో ఉన్న స్కిల్స్‌తో గాని, మార్కెట్‌కు అవసరమైన కొత్త స్కిల్స్ నేర్చుకుని గాని... నేను ఏదైనా సాధించగలను, ఎంతైనా డబ్బు సంపాదించగలను" అన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం మీమీద మీకు ఉండాలి. 

అలాంటి పాజిటివ్ మైండ్‌సెట్, అంత ఫైర్ మీలో ఉన్నా కూడా, పరిస్థితుల ప్రభావం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రోజురోజుకూ సన్నగిల్లుతూ ఉంటుంది. ఏం చేయాలో తెలిసి ఉండీ, అన్నీ చేయగలిగిన సత్తా ఉండీ ఏదీ చేయలేకపోతుంటారు.   

ఇదిగో - ఇలాంటి సమయంలోనే - అనుభవంతో కూడిన ఒక హెల్పింగ్ హాండ్, ఒక ఆసరా అవసరం అవుతుంది. అలాంటి ఆసరా మీకు ఒక పర్సనల్ కోచ్ నుంచి, లేదా ఒక మెంటార్ నుంచి మాత్రమే దొరుకుతుంది.  

మీ జీవితం, కెరీర్, ఆర్థిక స్వేచ్ఛ విషయంలో మీరు నిజంగా మార్పు కోరుకుంటున్నట్లయితే, మీ తదుపరి అడుగు గురించి ఇప్పుడు ఆలోచించండి.

మీరూ డబ్బు సంపాదిస్తారు. 
వ్యక్తిగతంగా మీరు కోరుకున్న మంచి జీవితాన్నీ ఎంజాయ్ చేస్తారు. 

నా 10X Personal Coaching ప్రోగ్రామ్ గురించి, ఫీజు మరియు ఇతర వివరాలు తెలుసుకోవాలనుకుంటే నన్ను వాట్సాప్‌లో సంప్రదించండి.


మీ భవిష్యత్తును మెరుగుపరుచుకునే అవకాశాలు, నిర్ణయాలు, ప్రయత్నాలు ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నాయి.

10X Personal Coaching is Premium and By Invitation Only.


– మనోహర్ చిమ్మని 
10X Personal Coach
Writer | Blogger | Nandi Award Winner 

WhatsApp: +91 9989578125 

Monday, 2 November 2026

Why The Rich Monk?


Many people believe that being rich and being a monk are opposites.

They are not.

A rich person is often imagined as someone who accumulates wealth, possessions, influence and status. A monk, on the other hand, is seen as someone who seeks inner peace, wisdom, simplicity and detachment.

But why should we choose one and reject the other?

Why can't we build wealth without losing our values?

Why can't we pursue success without sacrificing our peace of mind?

Why can't we dream big, create boldly, earn abundantly and still remain grounded?

That is the philosophy behind The Rich Monk.

To me, a Rich Monk is someone who is wealthy not just in money, but also in ideas, relationships, experiences, character and contribution.

Someone who can sit peacefully with themselves while continuing to dream, create and build something meaningful in the world.

The world doesn't need more wealthy people who are empty inside. Nor does it need people who mistake simplicity for giving up on their dreams and ambitions.

It needs people who can bring both worlds together.

The Rich Monk is a reminder that success and spirituality can coexist. That ambition and inner peace are not enemies. That we can pursue extraordinary achievements, build wealth, experience life to the fullest and still remain deeply human.

This blog is my journey of exploring that philosophy through writing, ideas, experiences, experiments and meaningful conversations.

The Philosophy Behind The Rich Monk:

To build.

To create.

To prosper.

To evolve.

And to remain a monk at heart.

— Manohar Chimmani 

Build One Habit. Unlock Many.


If you can write every day, you can do almost anything every day.

A daily writing habit teaches you something far more valuable than writing itself. It teaches you consistency, discipline, patience, and the ability to show up even when you don't feel like it.

Once you learn to make something a daily practice, you begin to understand that the real secret isn't motivation. It's repetition.

The same principle applies to reading, exercising, learning, creating, building a business, or pursuing any meaningful goal.

Start with one small daily commitment. Keep showing up. Let repetition do its magic.

Master the art of doing one thing every day, and you'll discover that you can build almost any habit you desire.

If something I write resonates with you, I'd love to hear your thoughts. My DMs are open for meaningful conversations.

- Manohar Chimmani