Wednesday, 24 December 2025

సినిమాల్లో అనుకున్నట్టుగా అన్నీ జరగవ్!


సూపర్ స్టార్లు, మెగా స్టార్లు ఉన్న సినిమాలు కూడా ఊహించనివిధంగా వాయిదా పడుతుంటాయి. డబ్బుల్లేక కాదు. భారీ బడ్జెట్లుంటాయి. టాప్ ప్రొడ్యూసర్స్, టాప్ డైరెక్టర్స్ పనిచేస్తుంటారు. అయినా సినిమాలు ప్లాన్ చేసినట్టుగా జరగవు. 

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా, ఊహించని ఇంకేదో కొత్త సమస్య వస్తుంది. పనులు వాయిదా పడతాయి. సినిమా ఆగిపోతుంది.  

అన్ని సినిమాలకు ఇలా అవుతుందని కాదు. కాని, సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా మామూలు విషయం. 

సినిమాలే కాదు, ఇంకెన్నో బిజినెస్‌లలో కూడా ఇలా జరుగుతుంటుంది. ప్రతిచోటా రిస్క్ ఉంటుంది.  

మరోవైపు, ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు అనౌన్స్ చేస్తుంటారు. వాటిల్లో కనీసం 25% సినిమాలు అసలు టేకాఫ్ కావు. వాటి రీజన్స్ వాటికుంటాయి.  

కట్ చేస్తే - 

ఇవన్నీ తెలియని బయటివారు ఏదేదో అనుకుంటుంటారు. అది సహజం. ఎందుకంటే వారికి తెర వెనుక జరిగే విషయాలు తెలీవు కాబట్టి. 

అయితే - ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నిస్తూ, ఇండస్ట్రీ గురించి సగం సగం తెలిసినవాళ్ళు కొందరు మాట్లాడే మాటలు, చేసే కామెంట్సే మనకు చిరాకు తెప్పిస్తుంటాయి. బాధ పెడుతుంటాయి. 

ఇలాంటి మన చుట్టూ మనకి వినిపించే పనికిరాని శబ్దాల్ని మనం పట్టించుకుంటే సినిమాల్లోనే కాదు, ఏ విషయంలోనూ మనం ఒక్క అడుగు ముందుకు వెయ్యలేం. 

- మనోహర్ చిమ్మని      

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani