Friday, 5 December 2025

అంతులేని హిపోక్రసీ


ఫిలిం ఇండస్ట్రీలో ఆర్టిస్టులైనా, టెక్నీషియన్స్ అయినా, హీరోలైనా, డైరెక్టర్స్ అయినా, గాయకులయినా, రచయితలైనా... వారి వారి రంగాల్లో వాళ్ళ ప్యాషన్ కోసం పనిచేస్తారు. డబ్బు కోసం పనిచేస్తారు. పేరు కోసం పనిచేస్తారు.  

అంతే తప్ప - ప్రజల కోసమో, ప్రజాసేవకోసమో ఉచితంగా ఎవ్వరూ పనిచేయరు. 

ఇది నిజం. 
అలాగని, ఇది తప్పు కాదు. 

మన అభిరుచిని బట్టి వీళ్ళల్లో కొందరు మనకు బాగా నచ్చుతారు.       

ఒక్క ఫిలిం ఇండస్ట్రీ అనే కాదు... ఇతర క్రియేటివ్ రంగాల్లోనివారికి కూడా దాదాపు ఇదే వర్తిస్తుంది.  

కట్ చేస్తే -

ఇలాంటి వ్యక్తిగత కళాత్మక జర్నీకి అంతులేని హిపోక్రసీతో మనలో కొందరు ఇంకేదో భారీ రేంజ్ కవరింగ్ ఇస్తారు. 

అదంతా ఒక పెద్ద మాస్ హిస్టీరియా. 

అదొక తృప్తి.
అదొక ఆనందం. 
అంతకంటే ఏం లేదు. 

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani