Tuesday, 30 December 2025

అప్పుడప్పుడు అన్నీ పక్కనపెట్టి చిల్ అవుతుండాలి


2026 కోసం కొత్తగా నిర్ణయాలు, కొత్త ప్రామిస్‌లు ప్రత్యేకంగా ఏం లేవు. ఏమన్నా ఉంటే, అన్నీ డిసెంబర్ నుంచే మొదలెట్టాను... 

ఏదైనా సరే, కొంచెం లిమిట్స్‌లో ఉంటేనే మంచిది.

ప్రొఫెషనల్‌గా వందకి వంద శాతం మనసుపెట్టి బాగా కష్టపడాలి. కొత్త తప్పులు చెయ్యొద్దు.   

కట్ చేస్తే -

ఈ న్యూ ఇయర్స్, ఉగాదులు నా చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. వస్తున్నాయి, పోతున్నాయి. గొప్ప మార్పేం ఉండదు. 

ఇదేదో నెగెటివిటీనో, నిరాశావాదమో కాదు.
రియాలిటీ.  

మనం ఏదైనా మార్పు తెచ్చుకోవాలనుకుంటే ఏ న్యూ ఇయర్స్ అక్కర్లేదు అని నా ఉద్దేశ్యం. చిన్నదైనా-పెద్దదైనా, అనుకున్న క్షణం నుంచే ఏదైనా సరే మొదలెట్టవచ్చు.   

కాని, ఇలాంటి సందర్భాలు నిజంగా అవసరం. కనీసం, కొన్ని నిమిషాలైనా ఆలోచిస్తాం... ఏం జరుగుతోంది మన జీవితంలో అని.  

సినిమాను మించిన సినిమా జీవితంలో చాలా జరుగుతుంటుంది. మనం ఎంచుకొన్న పనులు, మనం ఏరి కోరి కొనుక్కొన్న కష్టాలు, తెలియక చేసిన తప్పులు, తల్లకిందులైన అంచనాలు, ఊహించని ఎదురుదెబ్బలు, పెంచుకొన్న మానసిక వత్తిడి... ఇవన్నీ చాలా సర్వసాధారణం. 

ముఖ్యంగా క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి.  

అయినా సరే, అప్పుడప్పుడూ ఇవ్వన్నీ పక్కనపెట్టి చిల్ అవుతుండాలి. అలా అవ్వకపోతే అసలు బ్రతకలేం.

Life is short, and time is never promised. Live fully—while you’re still here.

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani