నాలుగు గోడల మధ్య ఆఫీస్ కల్చర్ రోజులు పోయాయి.
ఎక్కడికెళ్తే అక్కడే పని.
ఎక్కడ ఇష్టంగా ఉంటే అక్కడ్నుంచే పని.
ఇండిపెండెంట్ సినిమాలకైతే నా దృష్టిలో అసలు ఆఫీసే అవసరం లేదు. పనినిబట్టి, అవసరాన్ని బట్టి, టీమ్ ఎక్కడ కలిస్తే అదే ఆఫీస్.
డిజిటల్ ఆఫీస్ అన్నమాట.
వర్చువల్ ఆఫీస్ అని కూడా అనొచ్చు.
ఇలాంటి వర్చువల్ ఆఫీసులతో ఇండిపెండెంట్ సినిమాలు తీసి మిలియన్లలో డాలర్స్ కొల్లగొట్టిన ఫిలిం మేకర్స్ హాలీవుడ్‌లో చాలామంది ఉన్నారు.
రాబర్ట్ రోడ్రిగ్జ్... ఒక పెద్ద ఉదాహరణ.
కట్ చేస్తే -
మొన్నీమధ్యే నాకు తెలిసిన ఒక డైరెక్టర్ కొత్తగా ఆఫీస్ తీసాడు. ఇన్వెస్టర్స్, ప్రొడ్యూసర్స్, మీడియేటర్స్ బోలెడంత మంది ఇచ్చిన ప్రామిస్‌లను, హామీలను నమ్మి ఆ పనిచేశాడు.
నిజానికి అది ప్రొడ్యూసర్ చేయాల్సిన పని.
రాంగ్ డెసిషన్.
రాంగ్ డెసిషన్.
అయినా జాగ్రత్త పడలేదు మన డైరెక్టర్. మళ్ళీ టెంప్ట్ అయ్యాడు. మళ్ళీ మనుషుల్ని, వారి మాటల్ని నమ్మాడు. స్టార్ హోటల్లో సినిమా ఓపెనింగ్ చేస్తే కోట్లు పెట్టిస్తాం అన్నారు. గుడ్డిగా నమ్మాడు.
రాంగ్ డెసిషన్ నంబర్ టూ.
స్టార్ హోటల్లో ఓపెనింగ్ అయింది.
మాట ఇచ్చినవాళ్లంతా, కోతలు కోసినవాళ్లంతా బంధుమిత్ర సమేతంగా వచ్చి తిని. టైం పాస్ చేసి, ఫోటోలు దిగి వెళ్లారు. తర్వాత ఒక్క కాల్, ఒక్క మెసేజ్ లేదు.
అవసరార్థం మనుషులు. అంతే.
తప్పు వాళ్లది కాదు.
డైరెక్టర్ ది.
ఎవరు ఎలాంటి వ్యక్తిత్వాలో తెలీకుండా నమ్మి నిర్ణయాలు తీసుకోడం మూర్ఖత్వం.
ఆఫీసు, ఫర్నిచర్, 18 నెలల మెయింటెనెన్స్, స్టార్ హోటల్లో ఓపెనింగ్... అన్ని కలిపి కొత్తగా ఇంకో 20 లక్షలు నష్టం.
ఇలాంటివి సినిమా ఫీల్డులో సర్వసాధారణం.
తెలిసి చేసే తప్పులు ఇలా ఉంటాయి.
ముఖ్యంగా డైరెక్టర్స్ లైఫ్ ఒక రేంజ్‌లో కిందామీదా అవుతుంటుంది.
ఇలా అప్‌కమింగ్ వాళ్ళకే కాదు, టాప్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్‌కు కూడా జరుగుతుంటుంది.
ఒక్కొక్కరి అనుభవం ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది.
ఎప్పటికప్పుడు ఇలాంటి మనుషులతో జ్ఞానోదయాల సిరీస్ నడుస్తుంటుంది... ముఖ్యంగా ఫిలిం డైరెక్టర్స్‌కు.
అందుకే ఎవరు చేసే పనులు వాళ్ళు చెయ్యాలి.
టెంప్ట్ కావద్దు.
టెంప్ట్ కావద్దు.
ముఖ్యంగా సినిమా.
ప్రతిరోజూ, ప్రతి క్షణం ఇక్కడ ఏదో ఒక టెంప్టేషన్ ఉంటుంది. ఈ టెంప్టేషన్‌ను గెలవటం ఇక్కడ అంత ఈజీ కాదు. అది గెల్చినవాడు నిజంగా తోపు.
ఇలాంటి ఎపిసోడ్స్ చూసినప్పుడల్లా నేను సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడుతుంటాను…
“తాడి చెట్టు కిందకి వెళ్తే, అక్కడ కల్లే తాగాలి” అని.
కట్ చేస్తే -
ఇలాంటి నష్టం ఒక్క డబ్బుతోనే కాదు, పనికిరాని ఈగోలతో కూడా జరుగుతుంటుంది.
కావల్సినంత బడ్జెట్ ఉండీ, భారీ స్టార్స్ ఉన్న సినిమాలు కూడా సంవత్సరాలుగా ఆగిపోతుంటాయి.
అల్టిమేట్‌గా నష్టం ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకే.
అందుకే, "మనం ఎప్పుడూ ఒక దట్టమైన అడవిలో ఉన్నట్టు ఫీలవుతూ, ప్రతి నిమిషం అలర్ట్‌గా ఉండాలి. ఏ మూల నుంచి ఏ జంతువు వచ్చి మనల్ని ఎలా ఎటాక్ చేస్తుందో తెలీదు" అంటాడు పూరి జగన్నాధ్.
ఇప్పటికైనా అర్థమైందా, ప్రదీప్?
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani