మన జీవితంలోని మంచి చెడుల గురించి, సుఖ సంతోషాల గురించీ, మనం తీసుకునే నిర్ణయాల గురించీ, వాటి ఫలితాల గురించీ నెమరేసుకొంటూ, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎప్పటికప్పుడు మనకు చాలా ఉంటుంది.
బ్లాగింగ్ లాంటి "ఫ్లో రైటింగ్" వల్ల శాస్త్రీయంగా నాకు లభించే గొప్ప ఉపయోగం ఇదే.
నాకు తోచింది ఏదైనా సరే రాసుకుంటూ -
నన్ను నేను ఇన్‌స్పయిర్ చేసుకుంటూ,
పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా
నన్ను నేను ఎప్పటికప్పుడు
ఉత్సాహపర్చుకొంటూ ఉంటాను.
బ్లాగింగ్ ఒక అద్భుతమైన సాధనం.
నమ్మరు కాని, బ్లాగింగ్ నిజంగా మనల్ని వేరే ఎడిక్షన్స్ జోలికి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది.
నమ్మరు కాని, బ్లాగింగ్ నిజంగా మనల్ని వేరే ఎడిక్షన్స్ జోలికి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఎవరేమనుకుంటారో అన్న మైండ్‌సెట్ లోంచి బయటపడగలిగితే చాలు... బ్లాగింగ్, మనతో మనం మాట్లాడుకోడానికి ఒక మంచి ఔట్‌లెట్‌లా పనిచేస్తుంది. ఎలాంటి హిపోక్రసీ, ఇన్‌హిబిషన్స్ లేకుండా అన్నీ పంచుకోగలిగిన ఒక అత్యంత ఆత్మీయమైన అతిదగ్గరి స్నేహితురాలు అవుతుంది.
బ్లాగింగ్ ఒక థెరపీ.
ఒక యోగా.
ఒక ఆనందం.
ఎలాంటి ఇన్‌హిబిషన్స్, హిపోక్రసీ లేని ఒక అందమైన సహచరి.
ఈ నిజాన్ని ఇదే బ్లాగులో నేనొక డజన్ సార్లు చెప్పుకొని ఉంటాను.
2012 నుంచీ, గత పదమూడేళ్ళుగా,
నన్ను నన్నుగానే ఇష్టపడుతూ...
ఎప్పటికప్పుడు నాకు అవసరమైన
సాంత్వన, ప్రోత్సాహం అందిస్తున్న
నాకున్న ఒకే ఒక్క
అత్యంత ఆత్మీయ స్నేహితురాలు, సహచరి...
నా బ్లాగింగ్.
నన్ను నన్నుగానే ఇష్టపడుతూ...
ఎప్పటికప్పుడు నాకు అవసరమైన
సాంత్వన, ప్రోత్సాహం అందిస్తున్న
నాకున్న ఒకే ఒక్క
అత్యంత ఆత్మీయ స్నేహితురాలు, సహచరి...
నా బ్లాగింగ్.
“Content builds relationships. Relationships are built on trust.”
— Andrew Davis
— Andrew Davis
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani