మనం ఏదేదో అనుకొని ప్రోత్సహిస్తూ కొందరికి అవకాశం ఇస్తాం. ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ గురించి నలుగురికి నాలుగు మంచి మాటలు చెప్తాం. కాని, అది పెద్ద తప్పు అని తర్వాత వారి ఒరిజినల్ ప్రవర్తన ద్వారా నిరూపించుకుంటుంటారు.
వీళ్ళు మన గురించి మంచి మాటలు చెప్పకపోయినా ఫరవాలేదు. కాని, నెగెటివ్ ప్రచారం చేస్తారు.
దీన్నే గ్రాటిట్యూడ్ అందామా?
కట్ చేస్తే -
నాకు ఇలాంటి అనుభవాలు ఒక డజన్ పైనే ఉంటాయి. అయినా సరే, నా పరిధి దాటి ఎవరికైనా సహాయమే చేస్తుంటాను. ఇప్పటికీ.
ఎవరో నన్ను గుర్తించాలని కాదు. అది నాలో సహజంగా అలా వచ్చింది. అంతే.
కాని, ఇలా సహాయం చేయడం, ప్రోత్సహించడం అనేది అంతిమంగా నాకు తలవంపులు తెచ్చేది కావద్దు కదా...
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani