నేను రాసిన "సినిమా స్క్రిప్టు రచనాశిల్పం" పుస్తకం అప్పట్లో హాట్‌కేక్‌లా 5 వేల కాపీలు అమ్మటం జరిగింది. తర్వాతనే నేను డైరెక్టర్ అయ్యాను. ఆ అనుభవంతో పుస్తకాన్ని రివైజ్ చేసి మళ్లీ ప్రింట్ చేయొచ్చులే అనుకున్నాను. కానీ, నాలుగు సినిమాలు పూర్తయినా ఆ పని చేయలేకపోయాను ఈ రోజువరకూ!
కట్ టూ జిరాక్స్-
నవోదయ, విశాలాంధ్రవాళ్లు ఎన్నిసార్లు అడిగినా నేను మళ్లీ వేయలేకపోయిన నా పుస్తకాన్ని - ఫిలిం నగర్ కాంప్లెక్స్‌లో ఉన్న జిరాక్స్ సెంటర్లో బాహాటంగానే జిరాక్స్ కాపీలుగా అమ్మారు. నేనూ ఒక కాపీ కొనుక్కున్నాను .. ఆ విషయం నిజమే అని తెలుసుకోడానికి!
అయితే నేనే ఆ పుస్తక రచయితనని ఆ జిరాక్స్ షాప్ వాళ్లకు తెలీదు. నేనా పుస్తకం రాసిందే చదవటం కోసం కాబట్టి - అలా అమ్మడం నాకు సంతోషంగానే అనిపించింది. కాపీరైట్ చట్టప్రకారం అది నేరమే అయినా!
కట్ టూ ఫిల్మ్ స్కూల్ -
నా పుస్తకాన్ని దేవదాస్ కనకాల గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరిన విద్యార్థులకు ఒక కాపీ ఇచ్చేవారట .. విధిగా చదివితీరాలని! థాంక్స్ టూ దేవదాస్ కనకాల గారు ..
కట్ టూ వి ఏ కె -
సుప్రసిధ్ధ "సకలకళావల్లభులు" వి ఏ కె రంగారావు గారు నా పుస్తకం చదివి నాకు ఉత్తరం రాశారు. 5 కాపీలు తీసుకున్నారు, తనకు తెలిసినవాళ్లకు ఇవ్వడానికి. ఆ తర్వాత మేము చెన్నైలోని వారి ఇంట్లో మూడునాలుగు సార్లు కలిశాము. ఆప్యాయంగా నా చేత "తాతా" అని పిలిపించుకున్నారు. వారింట్లో ఉన్న వేలాది గ్రాంఫోన్ రికార్డులు, పుస్తకాల మధ్య కూర్చుని తాత గారిని నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. ఆ క్యాసెట్ నా దగ్గర ఇంకా ఉంది. వారి మీద ఓ పెద్ద ఆర్టికిల్ కూడా రాశాను.
కట్ టూ ఫినిషింగ్ టచ్ -
స్క్రిప్ట్ రైటింగ్ పైన రాసిన నా ఈ పుస్తకం వచ్చాక - అప్పటిదాకా ఈ అలోచనే రాని పెద్ద సినీ రచయితలు ఇలాంటిదే ఓ పుస్తకం రాసి పబ్లిష్ చేశారు. అదంతగా పాపులర్ అవ్వలేదు. మరికొందరు చవకబారు రైటర్స్ ఈ పుస్తకాన్ని కాపీ కొట్టి కూడా బుక్స్ రాశారు. ఆఖరుకు టైటిల్ కూడా దగ్గర దగ్గరగా ఉండి పాఠకులని మిస్ లీడ్ చేసే రేంజ్లో!
ఈ విశేషాలన్నీ నాకు ఆనందాన్నే ఇచ్చాయి. ఎందుకో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను.