ఇది ఇండస్ట్రీలో చాలా పాపులర్ డైలాగ్.
డైలాగ్ ఓకే. కానీ ఛాన్స్ మాత్రం అంత ఈజీ కాదు. అందుకే ఈ డైలాగ్‌కు అంత పాపులారిటీ!
పెద్ద హీరోల, పెద్ద డైరెక్టర్ల, భారీ బ్యానర్ల సినిమాల డిక్షనరీల్లో ఈ "ఒక్క ఛాన్స్" అనే పదం అసలు ఉండదు. వీళ్లు తీసే అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఎంత చిన్న పాత్రకైనా సరే కొత్తవాళ్లను తీసుకొనే రిస్క్ తీసుకోరు. అంత అవసరం వాళ్లకు లేదు.
చాలా అరుదుగా, సంవత్సరానికి వేళ్లమీద లెక్కించగలిగిన ఏ ఒకటో రెండో భారీ సినిమాల్లో మాత్రం కొన్ని వెరైటీ క్యారెక్టర్ల కోసం కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తారు. అలా ఒక్క ఛాన్స్ కొట్టేసినవాడు మాత్రం నిజంగా లక్కీ ఫెలో! భారీ సినిమా, భారీ ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి - సినిమా హిట్టయినా, ఫట్టైనా .. ఆ ఒక్క ఛాన్స్‌తోనే మన కొత్త ఆర్టిస్టు దాదాపు ఎస్టాబ్లిష్ అయిపోతాడు.
చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో అలాకాదు. బడ్జెట్‌లు తక్కువగా ఉండటంవల్ల, తప్పనిసరి పరిస్థితుల్లో - కొంతమంది అప్‌కమింగ్ ఆర్టిస్టులతో, కొంతమంది కొత్త ఆర్టిస్టులతో సినిమాలు తీస్తారు.
కొత్త ఆర్టిస్టులు ఎక్కువగా ఛాన్స్ కొట్టేసేది ఈ చిన్న బడ్జెట్ సినిమాల్లో మాత్రమే!
కానీ - వీటికీ ఓ లిమిట్ ఉంటుంది. ఒక సినిమాలో సగటున ఓ 12 మందిని మించి ప్రధాన కేరెక్టర్లు ఉండే అవకాశంలేదు. ఆ 12 మందిలో సగం మంది అప్‌కమింగ్ వాళ్లను తీసుకున్నా, మిగిలిన సగం మందిని కొత్తవాళ్లను తీసుకుంటారు.
ఈ బ్యాగ్రౌండ్ అంతా తెలియకుండా - ప్రతి కొత్త ఆర్టిస్టూ ఆవేశపడుతుంటాడు/పడుతుంది. ఆ ఒక్క ఛాన్స్ తనకొస్తే తఢాఖా చూపించేవాన్నని/దాన్నని ఆ కొత్త ఆర్టిస్టు అభిప్రాయం.
వాస్తవానికి, ఇలా టాలెంట్ ఉన్న ఎందరో వందల్లో ప్రతిరోజూ సినిమా ఆఫీసులచుట్టూ తిరుగుతుంటారు. కానీ, వారిలో ఏ ఒకరిద్దరినో మాత్రమే అదృష్టం వరిస్తుంది.
అలాగని సెలెక్టుకాని ఆర్టిస్టుల్లో టాలెంట్ లేదని కాదు. ఆయా డైరెక్టర్ల స్క్రిప్టుకు వారు సరిపోలేదని మాత్రమే అనుకోవాలి. ప్రయత్నాలు మళ్ళీ షురూ చేయాలి. అదే ఒక్క ఛాన్స్ కోసం ..
కట్ టూ అమిత్ కుమార్ -
నేనిప్పటివరకు నా సినిమాల్లో చాలామంది కొత్త ఆర్టిస్టులను, టెక్నీషియన్లను పరిచయం చేశాను. వాళ్లల్లో చాలామంది తర్వాత చాలా సినిమాల్లో మంచి అవకాశాల్ని పొందారు. బాగా పాపులర్ అయ్యారు కూడా.
భారీ సినిమాల్లో కూడా మీరిప్పుడు చూసే ప్రముఖ విలన్ అమిత్ కుమార్ ను నా తొలి చిత్రం "కల"లో నేనే పరిచయం చేశాను.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani