జకెర్‌బర్గ్ పెట్టిన లిమిట్ 5000 టచ్ అయ్యాక గానీ తెలియలేదు .. ఫేస్‌బుక్ లో ఫ్రెండ్స్ ఎంత తక్కువుంటే అంత మంచిదని!
ఏదో .. యాడ్ రిక్వెస్ట్ పెట్టినవాళ్లెందరినీ ఏమాత్రం ఆలోచించకుండా, వారిని డిసప్పాయింట్ చెయ్యలేక, యాడ్ చేసుకున్నాను.
కానీ, చాలా చిత్రమైన ఎక్స్‌పీరియన్స్ అది.
కొన్ని ఫ్రెండ్ రెక్వెస్టులొస్తాయి. సమ్ సుబ్బారావ్ అని పేరుంటుంది. అక్కడ ప్రొఫైల్ ఫోటోలో, కవర్ ఫోటోలో మాత్రం ఏ ప్రభాసో, పవన్ కల్యాణో ఉంటాడు! కొందరి పేర్లు అసలు ఉండటమే చిత్రంగా ఉంటాయి. న్యూటన్, టింగ్ టాంగ్, టఫ్ గై, బులెట్ కిక్ .. ఇలా ఉంటాయి. ప్రొఫైల్ ఫోటోలో ఏ విప్లవకారుడో, ఇంకే అర్థంలేని ఫోటోనో, అసలు ఫేస్ కనిపించని ఫోటోనో ఉంటుంది.
ఇక కొందరు ఆడాళ్లు, అమ్మాయిల విషయం మరీ గమ్మత్తుగా ఉంటుంది. వీరిలో దాదాపు 90% పేర్లు నిజం కావనిపిస్తుంది. హరి హరిణి, సిని హాసిని, సుని సునీత, ఆ పండు, ఈ పండు .. ఇలా ఉంటాయి పేర్లు. ప్రొఫైల్ పిక్చర్లో సమంత, నందిత, రకుల్‌ప్రీత్ ఉంటారు!
తమ ఐడెంటిటీని ఓపెన్‌గా చెప్పుకోలేని ఇలాంటి ఎఫ్ బి ఫ్రెండ్స్ "ఎబౌట్"లో కూడా ఏముండదు. జస్ట్ శూన్యం!
ఎవరో ఏంటో తెలీని ఇలాంటి ఫోర్స్‌డ్ ఎడాలిసెంట్స్ అసలు మన ఫేస్‌బుక్‌లో అవసరమంటారా?
5000 టచ్ అయ్యాకగానీ ట్యూబ్‌లైట్ వెలగలేదు .. :)

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani