Wednesday, 21 January 2026

When Big Budgets Became the Biggest Risk


“They no longer want to go to the cinema, and would rather watch movies on streaming services… That they’d like to watch movies at home.”
— Netflix CEO Ted Sarandos

This single statement quietly explains the biggest shift cinema has ever faced.

Today, the theatre is no longer the default destination—it’s an exception. Except for a few big-budget, superstar-driven, visual-graphic spectacle films, audiences hesitate to step out.

High budgets now mean high risk, longer recovery, and heavier pressure on opening weekends.

The old formulas are cracking under new viewing habits.

In this changing landscape, scale is no longer safety. 

Instead, small and micro-budget films are finding unexpected freedom.

They demand less, risk less, and experiment more. Strong ideas, honest emotions, and rooted storytelling suddenly matter more than spectacle.

When the budget is small, courage becomes big. 

Ironically, the future of cinema may be written not by excess—but by restraint. 

- Manohar Chimmani 

Tuesday, 20 January 2026

ఇది నెగెటివిటీ కాదు. రియాలిటీ.


సినీ ఫీల్డు ఒక అద్భుత మాయాలోకం. ఇక్కడ లేనిది లేదు!
 
ఇండస్ట్రీలో కొందరికి నచ్చని ఇంకో రియలిస్టిక్ కోణంలో చూస్తే - ఇదొక హెవీ గ్యాంబ్లింగ్ స్పేస్. 

ఈ గ్యాంబ్లింగ్ అనేది ఇక్కడ కేవలం క్రియేటివిటీ,  డబ్బుతోనే కాదు, జీవితాలతో కూడా ఉంటుంది. 

ఫీల్డులో అంతా బానే ఉన్నట్టుంటుంది. కానీ, నిజంగా ఎప్పుడు బావుంటుందో ఎవరికీ తెలీదు. చూస్తుంటే నెలలూ, సంవత్సరాలూ ఇట్టే గడిచిపోతుంటాయి. ఓ అయిదేళ్ల తర్వాతో, దశాబ్దానికో, ఊహించని విధంగా "ఓవర్‌నైట్" సక్సెస్ వరిస్తుంది. రాత్రికి రాత్రే జాతకాలు మారిపోతాయి.

సక్సెస్ వరించని 95 శాతం మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సినీ ప్రయాణం మాత్రం అనుక్షణం మారిపోయే అగమ్యాలవైపు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. 

బార్‌లోకెళ్లినవాడు ఏ బీరో తాగాలి తప్ప, కొబ్బరినీళ్లకోసం వెతక్కూడదు. ఇక్కడ తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇక్కడి స్టైల్లోనే తీసుకోవాలి. వ్యక్తిత్వాలూ, వంకాయలూ అంతా బుల్‌షిట్. 

సినిమా ఈజ్ సినిమా.

చిక్కంతా ఇక్కడే వస్తుంది. కొన్ని వెన్నతో పెట్టిన విద్యలు కావాలి. క్రాష్ కోర్స్ పెట్టినా అది అందరికీ రాదు.  

సినిమా ఒక్కటే లోకం కావాలి. ఆలోకపు ప్రాథమిక సూత్రాలే నీ జీకే కావాలి. ఆలోకపు లౌక్యమే నీ శ్వాస కావాలి. అప్పుడే నువ్వు కోరుకున్నవన్నీ అవే కలిసివస్తాయి. నువ్వు అనుకున్నది నిజమయ్యే చాన్స్ నీకు దగ్గరవుతుంది. ఏ ఓవర్‌నైట్‌లోనో నువ్వు వద్దన్నా అది నిన్ను వరిస్తుంది.   

సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా, ఇకముందు కూడా .. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, ఎక్కడయినా.. ఈ ఫీల్డులో సక్సెస్ రేట్ ఎప్పుడూ 5 నుంచి 10 శాతం దాటదు. చెప్పాలంటే, ఇంకా తక్కువే.

అవకాశం దొరకడమే ఇక్కడ చాలా కష్టం. అలా దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి ఎందరో ఎంతో ఖర్చు చేస్తారు. ఖర్చయిపోతారు. 

డబ్బొక్కటే కాదు. జీవితం కూడా. 

ఇది నెగెటివిటీ కాదు. రియాలిటీ. 

గట్స్. 
ప్యాషన్. 
నీడ్. 
కంపల్షన్.  

గోవాలో కేసినోకి వెళ్ళినట్టు, ఇది తెలిసి ఆడే జూదం. ఒక క్రియేటివ్ గ్యాంబ్లింగ్. ఒక కల్చరల్ ఫేంటసీ. ఒక క్రియేటివ్ కాసినో.

ఇక్కడ 5 శాతమే సక్సెస్ అనుకుంటే,
ఆ 5 లో మనం ఉండాలి.
అది అసాధ్యమేం కాదు.  

- మనోహర్ చిమ్మని    

The Real Reason Smart People Still Fail


Elon Musk once cut through the noise with brutal clarity: “Go get your fucking confidence back. Without it, you will fail miserably no matter how skilled or smart you are.”

It’s raw. It’s uncomfortable. And it’s true.

Talent without confidence is like a supercar without fuel. You may have knowledge, experience, even genius—but if you doubt yourself, you’ll hesitate. You’ll play small. You’ll wait for permission. Confidence is the inner engine that converts skill into action, ideas into execution, and dreams into reality.

The world doesn’t reward the most intelligent. It rewards the ones who SHOW UP with belief and conviction.

Confidence isn’t arrogance. It’s remembering who you were before fear, rejection, and comparison tried to rewrite your story. It’s built by keeping promises to yourself, taking uncomfortable steps, and standing up again after every fall. Once you reclaim it, everything changes—your voice, your posture, your decisions, your destiny.

Now tell me, my dear friend...
What took your confidence away—and what’s one step you’ll take TODAY to get it back? Drop your thoughts in the comments. Let’s start a real conversation.

- Manohar Chimmani 

Sunday, 18 January 2026

సినీఫీల్డులో అవకాశాలు తగ్గిపోడానికి డజన్ కారణాలుంటాయ్ !!


మనిషిగా మనం ఎంత ఎదగాలి, మన కుటుంబం గురించి మనం ఎంత బాగా ఆలోచించాలి, మన చుట్టూవున్న సమాజం పురోగతికి ఒక బాధ్యతగా మనమెంత ఉపయోగపడాలి... మన ఫోకస్ ఉండాల్సింది వీటిమీద.  

కట్ చేస్తే - 

ఏఆర్ రెహ్మాన్‌ ఫోకస్ ఇప్పుడు ఫిలిం మ్యూజిక్ ఒక్కదాని మీదే లేదు. అంతర్జాతీయ స్థాయి ఆల్బమ్స్ చేస్తున్నాడు, కన్‌సర్ట్స్ చేస్తున్నాడు, సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, డైరెక్షన్ చేస్తున్నాడు, వ్యాపారాలు చేస్తున్నాడు... అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేస్తున్నాడు. 

డబ్బు బాగా సంపాదించాడు. 

ఆస్కార్ అవార్డు, నేషనల్ అవార్డులు, ఫిలిమ్‌ఫేర్ అవార్డులు బాగానే సాధించాడు.  

ఇప్పుడు తెలుగులో రామ్‌చరణ్ "పెద్ది" సినిమాకు, హిందీలో "రామాయణ"కు మ్యూజిక్ చేస్తున్నాడు. రెండూ భారీ ప్రాజెక్టులే. 

కెరీర్ ప్రారంభం నుంచి ఏఆర్ రెహ్మాన్‌ను ఒక బ్రాండ్ చేసి, ఇన్ని అవకాశాలిచ్చింది ఎవరు? అప్పుడు ఈ అంశం గుర్తుకురాలేదా? అర్‌ర్‌రె... నేను ఈ మతం, వాళ్ళు ఆ మతం... అయినా నన్ను ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నారేంటి అని అనిపించలేదా?  

ఇంకా ఏం తక్కువైందని, ఏం సాధించలేదని ఇప్పుడు ఇలాంటి ఒక సున్నితమైన 'మతం' అంశాన్ని పైకెత్తి గొడవను ట్రిగ్గర్ చేయాల్సి వచ్చింది దిలీప్-aka-ఏఆర్ రెహ్మాన్? 

జావేద్ అక్తర్, ముగ్గురు ఖాన్ హీరోలు, డైరెక్టర్ ఇమ్తియాజ్ అలి, ఇలా ఇంకో వంద పేర్లు చెప్పొచ్చు. బాలీవుడ్‌లో నిజంగా బయాస్ ఉంటే వీళ్ళంతా ఆ స్థాయికి ఎదిగేవారా? 

నువ్వు చెప్పిన కోణంలో బాలీవుడ్‌లో బయాస్ ఎక్కడుంది? ఎప్పుడుంది?     

సినీఫీల్డులో అవకాశాలు తగ్గిపోడానికి డజన్ కారణాలుంటాయి. వాటిలో నీ స్కోర్ ఎక్కువుండొచ్చు. ఎవరైనా ముందు చూసుకోవాల్సింది అది. 

Religion is a structure. Awakening is an experience. It’s time we understood the difference. 

- మనోహర్ చిమ్మని 

Friday, 16 January 2026

ఏదీ ఊరికే రాదు, ఊరికే అందరూ హీరోలవ్వలేరు!


నిజంగా సినీఫీల్డు మీద చచ్చేంత ప్యాషన్, ఏమైనా సరే సాధించాలన్న తపన ఉన్న కొత్త హీరోలకు, కొత్త ఆర్టిస్టులకు ఇదొక పనికొచ్చే పోస్ట్.  

హీరోగా ఇంట్రొడ్యూస్ కావాలనుకొనే కొత్త ఆర్టిస్టులు... ఈ పోస్ట్ చదివాక, ఈజీగా ఒక డెసిషన్ తీసుకోవచ్చు.  

కట్ చేస్తే -

సినీఫీల్డులో హీరోగా మీ ప్రవేశానికి టాలెంట్ ఒక్కటే సరిపోదు!  

బై డిఫాల్ట్ ఎవరికైనా టాలెంట్ ఉండాల్సిందే. అయితే - ఆ టాలెంట్ మిమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేయగలిగినవారి దృష్టికి తీసుకెళ్ళగలగాలి. అదెలా సాధ్యమవుతుందో మీకు తెలిసుండాలి. 

చాలా సందర్భాల్లో ఒక కొత్త హీరో బయటినుంచి పరిచయమవడం అన్నది చాలా అరుదుగా జరిగే అంశం. డబ్బు, ఇండస్ట్రీ లింక్స్, కాంటాక్ట్స్ లేకుండా దాదాపు ఇది అసాధ్యం. 

కేవలం అతి కొద్ది మంది విషయంలో మాత్రమే, చాలా అరుదుగా, టాలెంట్ సపోర్ట్ చేస్తుంది. అది షార్ట్ ఫిలిమ్స్‌లో మీ యాక్షన్ గుర్తించి కావచ్చు. అంతకు ముందు చిన్న చిన్న కారెక్టర్స్‌లో మీరు ప్రూవ్ చేసుకున్న మీ నటన చూసి కావచ్చు. కాని, ఇది అందరికీ సాధ్యం కాదు.  

ఎవరో ఒకరిద్దరిని ఉదాహరణగా తీసుకొని, "నేనూ అలాగే హీరో అవుతా" అని అనుకోవడం ఇప్పుడున్న భారీ కాంపిటీషన్‌లో, ఈ ఏఐ యుగంలో దాదాపు అసాధ్యం. విలువైన మీ సమయం... ఏళ్లూ దశాబ్దాలూ వృధాకావడం తప్ప ఇంకేం జరగదు.  

కట్ చేస్తే - 

సినిమా అంటేనే - ప్రతిరోజూ లక్షల్లో ఖర్చు. భారీ స్టార్స్ ఉన్న సినిమా అయితే ఈ ఖర్చు రోజూ కోట్లల్లో ఉంటుంది. 

అంతా కొత్తవాళ్లతోనే, ఒక మాడరేట్ స్థాయిలో సినిమా తీయాలంటేనే... కనీసం ఓ 2 కోట్లు అవుతుంది. 

కొత్త హీరోలకు చాన్స్ ఇచ్చే సినిమాలు 99% చిన్న బడ్జెట్ సినిమాలే.

ఈ చిన్న బడ్జెట్ సినిమాలకు ఎప్పుడూ ఒక పెద్ద సమస్య ఉంటుంది. డబ్బు! 

ప్రొడ్యూసర్స్ ఉండరు. డైరెక్టర్స్ ఎవరికివారే ప్రొడ్యూసర్స్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇన్వెస్ట్‌మెంట్స్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.   

ఒక కొత్త హీరోను ఇంట్రొడ్యూస్ చెయ్యాలనుకున్నప్పుడు, ఎవరైనా టాలెంట్‌కే ఫస్ట్ ప్రెఫరెన్స్ ఇస్తారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే - అలా టాలెంట్ ఉన్నవాళ్ళు వందల్లో ఉంటారు. సో, వారిలో ఎవరి ద్వారా ప్రాజెక్టుకు సపోర్ట్ ఉంటుందో వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. 

ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది... 
మీకు తెలిసిన చాలా ఉదాహరణలు గుర్తుకొస్తుంటాయి...
 
కొత్త హీరోలను ఎక్కువగా వారి బంధువులో, ఫ్రెండ్సో ప్రొడ్యూసర్స్‌గా ఉండి ఇంట్రొడ్యూస్ చేస్తారు. కొంతమంది కొత్త హీరోలు వారే స్వయంగా బడ్జెట్లో కొంత భాగం ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమంది కొత్త హీరోలు వారే స్వయంగా సినిమాని ప్రొడ్యూస్ చేస్తారు.  

వారికి ఆ స్థోమత లేనప్పుడు, వారి సర్కిల్లో తెలిసినవారి ద్వారా  ఇన్వెస్ట్ చేయిస్తారు. 

ఓవర్‌నైట్‌లో హీరోలయిపోతారు!  

ఇది కొత్త విషయం కాదు. ఎప్పుడూ జరిగేదే.  

ఈమధ్య కూడా - ఈ పద్ధతిలో హీరోలుగా పరిచయమై నిలదొక్కుకున్న హీరోలెవరైనా గుర్తొస్తున్నారా మీకు? తప్పకుండా వస్తారు. ఇది చాలా మామూలు విషయం.

అంతెందుకు... కొందరు ఎస్టాబ్లిష్ అయిన హీరోలు కూడా, బయటి ప్రొడ్యూసర్స్‌నుంచి ఆఫర్స్ లేక, సొంతంగా వాళ్ళ బ్యానర్స్‌లోనో, వాళ్ళ బంధువుల బ్యానర్స్‌లోనో సినిమాలు చేస్తుంటారు. 

ఇదంతా మామూలు విషయం. ఎవ్వరినీ ఎవ్వరు తప్పుపట్టాల్సిన అవసరం లేని బిజినెస్. క్రియేటివ్ ప్రొఫెషన్.  

కొత్త హీరోల ఇంట్రడక్షన్ వెనకున్న ఈ ఆర్థిక కోణాన్ని అర్థం చేసుకోలేక - చాలా మంది చాలా తప్పుగా అనుకుంటారు... డబ్బులు పెడితేనే  చాన్స్ ఇస్తారనీ, ప్రొడ్యూసర్లు - డైరెక్టర్లు వాళ్లకు తెలిసిన వాళ్లకే చాన్స్ ఇస్తున్నారనీ, నెపొటిజమ్ అనీ... రకరకాలుగా అనుకుంటారు.  

ఏదీ ఊరికే రాదు, ఊరికే అందరూ హీరోలవ్వలేరు!
హీరోలయ్యాక వారికి కూడా ఊరికే కోట్లల్లో రెమ్యూనరేషన్ ఇవ్వరు!! 

ప్రతిదానికీ ఓ లెక్కుంటుంది. ఈ రియాలిటీని అర్థం చేసుకుంటే చాలు. జీవితంలో మీ టైం వేస్ట్ కాదు.

ఆసక్తి ఉందా?
సినీఫీల్డులో హీరోగా మీ కెరీర్ పట్ల చచ్చేంత ప్యాషన్ ఉందా? 

అయితే - ఆసక్తి, ప్యాషన్ మాత్రమే సరిపోవు. స్థోమత ఉండాలి. మీ కుటుంబం, మీ కుటుంబ నేపథ్యం మీకు సహకరించాలి. అలా లేనప్పుడు, మీకోసం బడ్జెట్‌లో కొంత భాగమయినా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చే సర్కిల్, కాంటాక్ట్స్ మీకుండాలి.  

ఓకే అనుకుంటే - 
నిజంగా ఆ స్థాయి సీరియస్‌నెస్, ఆ స్థోమత, ఆ కాంటాక్ట్స్ మీకు ఉన్నట్టయితే -  

మీ పూర్తి వివరాలతో నాకు DM చేయండి. 

మీరు హీరోగా బెస్ట్ పాజిబిలిటీస్ ఆలోచిద్దాం.     

Welcome to Glamour World! 
See You On The Sets...   

– Manohar Chimmani
Nandi Award Winning Writer, Film Director

Wednesday, 14 January 2026

అదృష్టం అన్న పదాన్ని నేను నమ్మను, కాని...


అదృష్టం అనేది ఉంది, ఉంటుంది. 

ఇది నమ్మాలంటే జీవితంలో కొన్ని ఊహించని అనుభవాలు ఎదురవ్వాలి. ఇదెలా సాధ్యం అని లాజిక్కులు పట్టుకోలేక పిచ్చెక్కిపోవాలి. ఇలా కూడా జరుగుతుందా అని షేక్ అయిపోవాలి. 

అప్పుడు మాత్రమే కొన్నిటి మీద నమ్మకం కలుగుతుంది. అందులో ఒకటి - మనం అంతకు ముందెప్పుడూ నమ్మని... అదృష్టం.  

కట్ చేస్తే - 

కొంతమంది ఊరికేనే దగ్గినా తుమ్మినా డీలాపడిపోయి, పక్కనున్నవాళ్ళని కూడా చతికిలపడేట్టు చేస్తుంటారు. ఒక కసి, పట్టుదల ఉండదు. అదొక మందులేని రుగ్మత. అది వేరే విషయం.  

కొంతమంది జాగ్రత్తగా అన్నీ ప్లాన్ చేసుకున్నట్టే కనిపిస్తారు. నిజంగా చేస్తారు కూడా. ప్రతి చిన్న విషయంలో అతి జాగ్రత్తపడతారు. జీవితంలోని ఒకటి రెండు అతి ముఖ్యమైన విషయాల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోతారు. 

దీనికి పూర్తి వ్యతిరేకంగా - కొందరు అన్నీ చాలా కేర్‌లెస్‌గా తీసుకున్నట్టే ఉంటారు. కాని, అనుకున్న ప్రతి పనీ అలవోగ్గా అలా చేసేసుకుంటూ వెళతారు. ఎక్కడా ఒక చిన్న అడ్డంకిరాదు. వచ్చినా, దాన్ని కూడా లైట్ తీసుకుంటారు. ముందుకే వెళ్తుంటారు తప్ప... అక్కడే చతికిల పడిపోరు. 

నిజానికి ఇదంతా మన నమ్మకం, మన మైండ్‌సెట్‌ల మీదే ఆధారపడి ఉంటుంది... అని మళ్ళీ లాజిక్స్ నా వెంటపడతాయి.  

కాని, కాదు. 

ఖచ్చితంగా కాదు. 

ఇంకేదో వారికి సహాయపడుతోంది. వారిని లీడ్ చేస్తోంది. కాని, దాని గురించి వాళ్లంతగా పట్టించుకోరు. 

ఇక్కడే అదృష్టం అనే ట్రంప్ కార్డ్ ఒకటి ఉందని నాకు చాలాసార్లు అర్థమైంది. 

కాని, ఆ ట్రంప్ కార్డ్ మనకి పడాలంటే ఏంచెయ్యాలో మాత్రం తెలీదు. అది దానికదే పడాలి తప్ప, ఎదురుచూస్తే మాత్రం రాదు. 

పనే మన దేవుడు అనుకొని, నిరంతరం మన పనిలో మనం ఉండాలి. పనిచేస్తూనే ఉండాలి. ఏదో చేస్తున్నాం అని కాకుండా, మనసు పెట్టి పనిచెయ్యాలి. అదృష్టం అదే వస్తుంది. రాలేదనుకోండి... ఫరవాలేదు, మన పనే మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే పనే మన దేవుడు కాబట్టి. 

కట్ చేస్తే - 

అదృష్టానికి, దేవునికీ ఏదైనా సంబంధం ఉందా అంటే నేనేం చెప్పలేను. ఒకవేళ ఎవరైనా ఉందీ అంటే మాత్రం నాకు నచ్చదు. 

ఎందుకంటే, దేవుడు అంత శాడిస్టు కాదు.  

చూశారా, చివర్లో మళ్ళీ లాజిక్కే నా ముందుకొచ్చింది! 

మీరేమంటారు... అదృష్టం ఉందా, లేదా?
మిమ్మల్ని ఎప్పుడైనా అదృష్టం వరించిందా?  

- మనోహర్ చిమ్మని 

I Love My Life


I love my life—not because it’s perfect, but because it’s mine.

All that I have come with it: my hopes, my dreams, my desires, my faults, and my strengths. Every part has played its role. Every chapter has shaped me.

I’ve doubted myself. I’ve fallen. I’ve questioned my path. Yet something within me never left—silent, steady, aware.

Loving myself isn’t ego. It’s acceptance. It’s the courage to stand with who I am, without apology.

And in that acceptance, I recognize the divine within me.

Because when I honor my life, I honor the life that flows through everything. 

- Manohar Chimmani 

Tuesday, 13 January 2026

Life Is Not Something To Be Postponed


“We are travelers on a cosmic journey, stardust, swirling and dancing in the eddies and whirlpools of infinity. Life is eternal. We have stopped for a moment to encounter each other, to meet, to love, to share. This is a precious moment. It is a little parenthesis in eternity.”
— Paulo Coelho, The Alchemist

If this is true—and it feels true deep within—then life is not something to be postponed. It is something to be entered fully.

This moment is not casual.
This breath is not random.
This meeting is not accidental.

Life isn’t waiting somewhere ahead.
It’s happening now.

Live awake.
Love deeply.
Choose boldly.

Honor this moment—it’s your sacred pause in infinity.

- Manohar Chimmani 

Monday, 12 January 2026

ఈ లూప్ లోంచి బయటపడ్డవాడే కింగ్ !!


'నాగురించి ఎవరేమనుకుంటున్నారో' అని ఆలోచించేవాళ్ళు ఒక్క అడుగు ముందుకేయలేరు.

సినీఫీల్డులో ఉన్నవాళ్లకయితే ఇది మరీ ముఖ్యం. ఇక్కడ సిచువేషన్ అలా ఉంటుంది. 

ఇంకా చెప్పాలంటే - ఒక దట్టమైన అడవిలో ఉన్నామనుకోవాలి. ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. ఎటునుంచి ఏదైనా, ఎప్పుడైనా, ఏరూపంలోనైనా ఎటాక్ చేయొచ్చు.

ఈ బేసిక్ సూత్రం ఫీల్డులో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి, టాప్ రేంజ్‌లో ఉన్నవాళ్లనుంచి... ఇప్పుడే ఎంట్రీ ఇచ్చిన న్యూ టాలెంట్ దాకా .. అందరికీ వర్తిస్తుంది. దీనికి ఎలాంటి మినహాయింపులు లేవు. సవరణలు లేవు.

ఇలాంటి ఆటవిక వాతావరణంలో - ఏదైనా అనుకుంటే వెంటనే చేసెయ్యాలి. మిస్ ఫైర్ అయిందనుకోండి. ఇంకో ప్రయత్నం. బట్, ప్రయత్నం మానొద్దు. ఏదో ఒక పనిలో ఉండటం మానొద్దు.  

ఒకసారి బ్రేక్ తీసుకున్నామా, స్టకప్ అయ్యామా... చుక్కలు కనిపిస్తాయి.  

కట్ చేస్తే - 

ఒకసారి తప్పు చేస్తే అది తప్పు. రెండోసారి కూడా అదే తప్పుచేస్తే అది అలవాటు. ఆ అలవాటు ప్రకంపనలే మనం తీసుకునే నిర్ణయాలు. మన నిర్ణయాలే మన తప్పులు.

ఇదంతా ఒక లూప్. 

ఈ లూప్ లోంచి బయటపడ్డవాడే కింగ్. 

- మనోహర్ చిమ్మని      

When the Inside Becomes the Outside


Spirituality is your inner world. It’s quiet, personal, and invisible.

But it doesn’t have to stay there.

When it’s real, it leaks out. Into how you work. How you speak. How you choose. Into your habits, your priorities, and your lifestyle.

You don’t need to preach it. You live it.

The moment your inner world is clear, your outer life starts to reflect it—naturally, effortlessly.

That’s not escape.
That’s alignment.

- Manohar Chimmani