సినీఫీల్డులో ఉన్నవాళ్లకయితే ఇది మరీ ముఖ్యం. ఇక్కడ సిచువేషన్ అలా ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే - ఒక దట్టమైన అడవిలో ఉన్నామనుకోవాలి. ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. ఎటునుంచి ఏదైనా, ఎప్పుడైనా, ఏరూపంలోనైనా ఎటాక్ చేయొచ్చు.
ఈ బేసిక్ సూత్రం ఫీల్డులో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి, టాప్ రేంజ్‌లో ఉన్నవాళ్లనుంచి... ఇప్పుడే ఎంట్రీ ఇచ్చిన న్యూ టాలెంట్ దాకా .. అందరికీ వర్తిస్తుంది. దీనికి ఎలాంటి మినహాయింపులు లేవు. సవరణలు లేవు.
ఇలాంటి ఆటవిక వాతావరణంలో - ఏదైనా అనుకుంటే వెంటనే చేసెయ్యాలి. మిస్ ఫైర్ అయిందనుకోండి. ఇంకో ప్రయత్నం. బట్, ప్రయత్నం మానొద్దు. ఏదో ఒక పనిలో ఉండటం మానొద్దు.
ఒకసారి బ్రేక్ తీసుకున్నామా, స్టకప్ అయ్యామా... చుక్కలు కనిపిస్తాయి.
కట్ చేస్తే -
ఒకసారి తప్పు చేస్తే అది తప్పు. రెండోసారి కూడా అదే తప్పుచేస్తే అది అలవాటు. ఆ అలవాటు ప్రకంపనలే మనం తీసుకునే నిర్ణయాలు. మన నిర్ణయాలే మన తప్పులు. ఇదొక లూప్. ఈ లూప్ లోంచి బయటపడ్డవాడే కింగ్.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani