Sunday, 18 January 2026

సినీఫీల్డులో అవకాశాలు తగ్గిపోడానికి డజన్ కారణాలుంటాయ్ !!


మనిషిగా మనం ఎంత ఎదగాలి, మన కుటుంబం గురించి మనం ఎంత బాగా ఆలోచించాలి, మన చుట్టూవున్న సమాజం పురోగతికి ఒక బాధ్యతగా మనమెంత ఉపయోగపడాలి... మన ఫోకస్ ఉండాల్సింది వీటిమీద.  

కట్ చేస్తే - 

ఏఆర్ రెహ్మాన్‌ ఫోకస్ ఇప్పుడు ఫిలిం మ్యూజిక్ ఒక్కదాని మీదే లేదు. అంతర్జాతీయ స్థాయి ఆల్బమ్స్ చేస్తున్నాడు, కన్‌సర్ట్స్ చేస్తున్నాడు, సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, డైరెక్షన్ చేస్తున్నాడు, వ్యాపారాలు చేస్తున్నాడు... అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేస్తున్నాడు. 

డబ్బు బాగా సంపాదించాడు. 

ఆస్కార్ అవార్డు, నేషనల్ అవార్డులు, ఫిలిమ్‌ఫేర్ అవార్డులు బాగానే సాధించాడు.  

ఇప్పుడు తెలుగులో రామ్‌చరణ్ "పెద్ది" సినిమాకు, హిందీలో "రామాయణ"కు మ్యూజిక్ చేస్తున్నాడు. రెండూ భారీ ప్రాజెక్టులే. 

కెరీర్ ప్రారంభం నుంచి ఏఆర్ రెహ్మాన్‌ను ఒక బ్రాండ్ చేసి, ఇన్ని అవకాశాలిచ్చింది ఎవరు? అప్పుడు ఈ అంశం గుర్తుకురాలేదా? అర్‌ర్‌రె... నేను ఈ మతం, వాళ్ళు ఆ మతం... అయినా నన్ను ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నారేంటి అని అనిపించలేదా?  

ఇంకా ఏం తక్కువైందని, ఏం సాధించలేదని ఇప్పుడు ఇలాంటి ఒక సున్నితమైన 'మతం' అంశాన్ని పైకెత్తి గొడవను ట్రిగ్గర్ చేయాల్సి వచ్చింది దిలీప్-aka-ఏఆర్ రెహ్మాన్? 

జావేద్ అక్తర్, ముగ్గురు ఖాన్ హీరోలు, డైరెక్టర్ ఇమ్తియాజ్ అలి, ఇలా ఇంకో వంద పేర్లు చెప్పొచ్చు. బాలీవుడ్‌లో నిజంగా బయాస్ ఉంటే వీళ్ళంతా ఆ స్థాయికి ఎదిగేవారా? 

నువ్వు చెప్పిన కోణంలో బాలీవుడ్‌లో బయాస్ ఎక్కడుంది? ఎప్పుడుంది?     

సినీఫీల్డులో అవకాశాలు తగ్గిపోడానికి డజన్ కారణాలుంటాయి. వాటిలో నీ స్కోర్ ఎక్కువుండొచ్చు. ఎవరైనా ముందు చూసుకోవాల్సింది అది. 

Religion is a structure. Awakening is an experience. It’s time we understood the difference. 

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani