Sunday, 11 January 2026

400 కోట్ల హెవీ గ్యాంబ్లింగ్ !!


వందల కోట్ల బడ్జెట్ సినిమాలు పెద్ద గ్యాంబ్లింగ్ అన్న విషయం మరొక్కసారి తాజాగా ప్రూవ్ అయ్యింది "రాజాసాబ్"తో.  

400 కోట్ల హెవీ గ్యాంబ్లింగ్! 
పెద్ద సినిమా అంటే అది. 

ఇలాంటి వందల కోట్ల సినిమాలు ఒక పది వస్తే, వాటిలో ఏ ఒకటో రెండో బ్రతికి బయటపడతాయి. మిగిలినవన్నీ ఉట్టుట్టి అంకెల గారడీలే.

మరోవైపు, మంచి కంటెంట్‌తో అంతా కొత్తవాళ్లతో తీసే చిన్న బడ్జెట్ సినిమాలు పూర్తిగా రిస్క్-ఫ్రీ. 

హిట్ కొడితే 100 కోట్లు.
ఒకవేళ మిస్ అయినా రిస్కేం లేదు.

చిన్న బడ్జెట్స్ కాబట్టి, ఆ మాత్రం బడ్జెట్స్ సినిమా ఫెయిల్ అయినా రకరకాల ఇన్‌కమ్ ఎవెన్యూస్ ద్వారా సులభంగా వెనక్కి వస్తాయి.

ఎలాగైనా ప్రొడ్యూసర్ సేఫ్ అండ్ హాప్పీ. ఓవర్‌నైట్లో కావల్సినంత ప్రమోషన్, సెలెబ్ స్టేటస్. 

మైక్రో బడ్జెట్ సినిమాల పవర్ అది.    

- మనోహర్ చిమ్మని       

Saturday, 10 January 2026

ఏ బిజీ మీకిష్టం? మీరు ఏ క్లబ్ మెంబర్స్?


ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా… వారి జీవనశైలికి సంబంధించి రెండే రెండు దారులుంటాయి.

ఈ రెండు దారుల్లో “నాది ఈ దారి” అన్న ఎంపిక కొంతమంది విషయంలో తెలిసి జరగొచ్చు. కొంతమంది విషయంలో తెలియక జరగొచ్చు. కాని, ఎవరికిష్టమైన దారి వాళ్ళు ఎంచుకుంటారు. 

అలా వారు ఎన్నుకున్న ఆ ఒక్క దారే… అతడు లేదా ఆమె “ఎవరు” అన్నది నిర్వచిస్తుంది.

ఇంతకీ ఆ రెండు దారులేంటో ఊహించగలరా?

మొదటి దారి – 
మనల్ని మనం చాలా తక్కువగా అంచనా వేసుకొని “ఏదో అలా” అన్నట్టుగా బతుకు వెళ్లదీయటం. 

ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది అన్నది ఇక్కడి థియరీ.  

రెండో దారి – 
మనలోని సంపూర్ణ సామర్థ్యాన్ని వినియోగించుకొంటూ, ఎప్పుడూ అనుకున్న పనినే చేస్తూ, అనుకున్న పధ్ధతిలోనే జీవిస్తూ... ఎప్పటికప్పుడు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ, జయాపజయాల్ని స్థితప్రజ్ఞతతో స్వీకరిస్తూ, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ జీవితాన్ని అనుక్షణం ఆస్వాదించటం. 

పనే దేవుడు అన్నది ఇక్కడి థియరీ. అలాగని వీళ్ళు నాస్తికులేం కాదు.  

కట్ టూ మొదటి దారి –

మొదటి దారిలో – తమలో ఉన్న సామర్థ్యాన్ని వీళ్ళు ఎప్పుడూ గుర్తించరు. కనీసం వారిలో కూడా ఎదో ఒక ప్రత్యేకత, లేదంటే ఎంతో కొంత ‘విషయం’ ఉందన్న నిజాన్ని గుర్తించడానికి కూడా ఇష్టపడరు. కొత్త నైపుణ్యాలను నేర్చుకొనే ఆలోచనే వీరికి ఇష్టం ఉండదు. 

“నాకు రాదు”, “నాకు లేదు”, “ఇలా వుంటే చేసేవాణ్ణి”, “అలాగయితే సాధించేదాణ్ణి”… వంటి నెగెటివ్ థింకింగ్ సాకులన్నీ ఈ దారిలో ప్రతిరోజూ ప్రతి క్షణం పుష్కలంగా దొరుకుతాయి. తక్కువ పనిచేయటం, తక్కువ సంపాదించటం, సంతృప్తి లేకపోయినా ఉన్నామన్న భ్రమలో బ్రతకటం, గీసుకున్న పరిధి దాటి ఏ విషయంలోనూ ఎక్కువగా ప్రయత్నించకపోవడం, వ్యక్తిగత వికాసానికి సంబంధించి గానీ, హాబీగా గానీ ఏమీ చదవకపోవడం, అసలు ఆలోచించకపోవడం… ఇదీ మొదటి దారిని ఎంచుకున్నవాళ్ల బతుకుబాట. 

ఆశ్చర్యంగా ప్రతివందమందిలో 99 మంది ఈ బాటనే ఇష్టపడతారు. దీనికి కారణాలు అనేకం. సాకులు పుష్కలం. 

వీళ్ళంతా "99% క్లబ్" మెంబర్స్.   

కట్ టూ రెండో దారి –

ఈ దారిలో… ప్రతి విషయంలోనూ ఉత్సాహం, ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలన్న తపన. “ఇలాగే ఎందుకు చేయాలి.. ఇలాగే ఎందుకుండాలి?” అన్న ప్రశ్న. నిరంతర ఆలోచన. అవతలి వారికి “తలతిక్క”గా కనిపించే తమకు తామే ఏర్పరచుకున్న క్రమశిక్షణ. ఎప్పటికప్పుడు ఏదో ఒక లక్ష్యం ఏర్పర్చుకోవడం, దాన్ని సాధించాలన్న నిరంతర ఆసక్తిలో సజీవంగా ఉండటం. నచ్చిన ప్రతి పుస్తకాన్నీ చదవటం, ప్రతిదాన్నీ నిర్మాణాత్మకంగా ఆలోచించడం… ఇవన్నీ ఈ రెండో దారిని ఎన్నుకున్నవారి సాధారణ లక్షణాలు.

అంతేకాదు... వీళ్ళు ఎప్పుడూ పని రాక్షసుల్లా కాకుండా, కుటుంబంతో, స్నేహితులతో తగినంత సమయం గడుపుతూ, ఆ సమయానికి ఒక గొప్ప విలువని తీసుకురావడం, చిన్నవి పెద్దవి ఎన్నో లక్ష్యాల్ని సాధించడం, బాగా సంపాదించడం, లేదా సంపాదించే ప్రయత్నంలో ముందుకెళ్తుండటం చేస్తారు. 

ఇంకా - ఈ రెండోదారి ప్రేమికులంతా వారి మనసులో మెరిసిన ప్రతి ప్రయోగం చేసుకుంటూపోతుంటారు. అది సఫలమైందా, విఫలమైందా అన్నది పట్టించుకోరు. ఆ ప్రాసెస్‌ను, ఆ జర్నీని ఇష్టపడతారు. కొన్నిసార్లు కోలుకోలేని ఎదురుదెబ్బలు తగుల్తుంటాయి, కాని అదే దారిలో ముందుకెళ్తుంటారు. ఫలితాలు విజయవంతంగా అవే ఫాలో అవుతుంటాయి.      

మొత్తానికి ప్రతిక్షణం సంపూర్ణ జీవితాన్ని గడుపుతూ, "వీడేంటి, పిచ్చోడా?" అని అవతలివారికి అనిపించేలా బ్రతకడం… ఇదంతా కూడా ఈ రెండవ దారిని ఎంచుకొన్న వాళ్ల జీవనశైలి. చాలామందికి నచ్చని జీవితం. 

కాని, జీవితం ఒక్కటే... అది గాలి బుడగలాంటిది అన్న విషయం వీరికి బాగా తెలుసు. 

ప్రతి వందమందిలో ఒక్కరు మాత్రమే ఈ బాటలో ఉంటారు. అంటే వన్ పర్సెంట్ అన్నమాట. 

వీళ్ళంతా "1% క్లబ్" మెంబర్స్.   

కట్ చేస్తే - 

సినిమా ఫీల్డులో కూడా అంతే. 1% మందే ఎప్పుడూ పనిలో బిజీగా ఉంటారు. 99% మంది పనిలేకుండా బిజీగా ఉంటారు. 

బై ది వే, ఈ నిజం ఒక్క సినీఫీల్డుకే పరిమితం కాదు. ఏ ఫీల్డులోనైనా ఇదే లెక్క.

ఏ బిజీ మనకిష్టం అన్నది మనమే నిర్ణయించుకోవాలి.  

- మనోహర్ చిమ్మని       

Friday, 9 January 2026

"రాజాసాబ్" ఒక సినిమా!


హాలీవుడ్‌లో కాని, బాలీవుడ్‌లో కాని ఒక కొత్త సినిమా రిలీజ్ అయినరోజు ఇంత హడావిడీ, ఇంత నాన్సెన్స్ ఉండదు. 

ఇంత దారుణంగా, ఎగబడి ఎగబడి, ఆరోజే విడుదలైన ఒక కొత్త సినిమా మీద ఎవ్వరూ ఇంతలా విషం కక్కరు. ఏం పనిలేనట్టు అసలింత ఎచ్చులకు పోరు. ఇంత హైరానా పడరు. 

బాగుంది, బాగాలేదు అని సింపుల్‌గా చెప్పొచ్చు. నిర్మాణాత్మకంగా, క్లుప్తంగా ఎందుకు బాగాలేదో చెప్పొచ్చు. 

ఓర్నీ...     

"రాజాసాబ్" ఒక సినిమా.
కొందరికి బాగుండొచ్చు, కొందరికి బాగలేకపోవచ్చు. అది సహజం.

సినిమా ఊహించిన రేంజ్‌లో లేకపోవచ్చు. హైప్ ఇచ్చిన స్థాయిలో లేకపోవచ్చు. 

దానికి ఇంత సీన్ అవసరమా? 

ఏదో ప్రకృతి విపత్తు వచ్చినట్టు అపసోపాలు పడిపోతూ, ఏదో కొంపలు మునిగినట్టు, ఏవో నేరాలు ఘోరాలు జరిగినట్టు... అంత దూకుడుగా పోటీపడుతూ, ఆఘమేఘాల మీద అంత భీభత్సంగా రివ్యూలు చెప్పడం అవసరమా? 

కొంతమంది రివ్యూయర్స్ అయితే - అసలు వాళ్ళింట్లోనో, వాళ్ళ కుటుంబంలోనో ఏదో జరక్కూడనిది జరిగినట్టు నిట్టూర్పులిడుస్తూ, విషాదంగా మొహాలు పెట్టి, బాధాతప్త హృదయాలతో రివ్యూలు కక్కారు.   

కట్ చేస్తే -

అదొక సినిమా. 
జస్ట్ ఒక ఎంటర్‌టైన్మెంటు. 

చూడాలనుకున్నవాళ్ళు చూస్తారు. వద్దు అనుకున్నవాళ్ళు చూడరు. 

ఆ చూసేవాళ్లని కూడా చెడగొట్టే ఈ కూతలెందుకు?

ఇదేదో సామెత చెప్పినట్టు లేదూ?

- మనోహర్ చిమ్మని  

Thursday, 8 January 2026

మందు అలవాటు లేనివాడు మందు కనిపెడితే...


... అది "ఓల్డ్ మాంక్ రమ్" అవుతుంది! 

నిజం. 
ఓల్డ్ మాంక్ రమ్‌ను తయారుచేసిన బ్రిగేడియర్ కపిల్ మోహన్‌కు అసలు మందే కాదు, వేరే ఏ అలవాట్లూ లేవు. టీటోట్లర్!

ఓల్డ్ మాంక్ రమ్ టేస్ట్ లాగే, దాని నేపథ్యం కూడా ఐకానిక్‌గా ఉంటుంది. 

ఇండియాలో ఉన్న అన్ని రమ్‌ల్లో ఓల్డ్ మాంక్ రమ్ స్పెషల్. మన దేశం నుంచి సుమారు 30 దేశాలకు ఎగుమతి అవుతూ, ప్రపంచంలో అత్యధికంగా సేలయ్యే డార్క్ రమ్ కూడా ఓల్డ్ మాంకే! 

ప్రపంచంలోని డార్క్ రమ్ ప్రియులంతా ఎక్కువగా త్రాగేది ఇదే రమ్. 

ఓల్డ్ మాంక్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే - దీని కోసం ఎప్పుడూ యాడ్స్ ఇవ్వలేదు. బిల్ బోర్డ్స్, ఫ్లెక్సీలు పెట్టలేదు. జస్ట్ మౌత్ టాక్‌తోనే దీనికి ఇంత ప్రచారం వచ్చింది.

కట్ చేస్తే - 

నేను కర్నూలు ఆలిండియా రేడియో ఎఫ్ఎమ్‌లో పనిచేస్తున్నప్పుడు, నా కొలీగ్-మిత్రులు మోహన్ రెడ్డి, కామేశ్వరరావు, నేను కలిసి అప్పుడప్పుడు తుంగభద్ర ఒడ్డున రివర్‌వ్యూ బార్‌కి వెళ్ళేవాళ్ళం.   

బార్ ఆవరణలోనే ఉండే మినీ ట్యాంక్‌బండ్ లాంటి స్పేస్‌లో స్పెషల్‌గా టేబుల్, చెయిర్స్ వేయించుకొని కూర్చునేవాళ్లం. రెండుమూడు గంటలు అలా ఊరికే గడిచిపోయేది. 

బార్ లోపల ఆర్కెస్ట్రాలో పాడుతుండే జానీ బాషా మధ్యమధ్యలో వచ్చి పలకరించి వెళ్తుండేవాడు. జానీ బాషా మా ఎఫ్ఎమ్‌లో క్యాజువల్ ఎనౌన్సర్‌గా కూడా పనిచేస్తుండేవాడు. 

తుంగభద్ర ఒడ్డున మా సిట్టింగ్ అలా ఒక రెండుమూడు గంటలు గడిచాక, దూరంగా మాకు కనిపించే రైల్వే బ్రిడ్జి పైన ఒక ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ వెళ్ళేది. అప్పుడు నెమ్మదిగా లేచేవాళ్ళం. 

తుంగభద్ర ఒడ్డున రివర్-వ్యూ బార్లో మేము అప్పట్లో సేవించిన ఆ పానీయం ఇంకేదో కాదు... ది గ్రేట్ ఓల్డ్ మాంక్! 

- మనోహర్ చిమ్మని 

గమనిక: సోషల్ డ్రింకింగ్ ఆరోగ్యానికి అంత హానికరం కాదు... అనేది నిజం. 

Sunday, 4 January 2026

Freedom Is Built, Not Found


Freedom doesn’t arrive by chance.
It isn’t gifted by time, luck, or rebellion.

Freedom is built.

It comes from deliberate choices—choosing focus over distraction, structure over chaos, and clarity over comfort. Every real form of freedom demands discipline first.

Most people say they want freedom, but they design lives filled with dependency, scattered attention, and endless postponement. They confuse movement with progress.

Whether in cinema, writing, or life itself, freedom requires intention. You design your days, your priorities, and your non-negotiables.

Build the system.
Make the hard choices early.

If you want freedom, don’t wait for it.
Construct it.

- Manohar Chimmani 

Saturday, 3 January 2026

కాలర్ ఎగరేసే కాసనోవాలు కొందరే!


సినీఫీల్డు ఒక ఎంటర్‌టైన్మెంట్ బిజినెస్. ప్యాషన్, ఫేమ్ అనేవి ఈ బిజినెస్‌లో భాగం. 

కొందరికిది ప్రొఫెషన్. 
కొందరికిది బిజినెస్.
ఏదైనా అంతిమంగా బ్రతకడం కోసమే.
డబ్బు కోసమే.  

డబ్బు కోసం కాదు అనేవాళ్ళు రెమ్యూనరేషన్ తీసుకోకుండా పనిచేయగలగాలి. ప్రారంభంలో ఒకటో రెండో ఎంట్రీ కోసం చేస్తారు. తర్వాతయినా తప్పదు కదా? బ్రతకాలి కదా?   

ప్రొడ్యూసర్స్‌కు, ఇన్వెస్టర్స్‌కు అయితే ఇది ప్యూర్లీ బిజినెస్. కోట్లు పెట్టాలి, కోట్లు సంపాదించాలి. ఈ సంపాదనంతా రోటేషన్లో జరుగుతుంటుంది.   

కోట్లు పోతుంటాయ్, వస్తుంటాయ్. 
కాని, బిగ్ మనీ రొటేషన్ మాత్రం ఇక్కడే సాధ్యం.
అందుకే సినిమా అంటే - బిగ్ బిజినెస్.  

మిగిలిన ఎట్రాక్షన్స్ అన్నీ ఈ ప్రాసెస్‌లో భాగమే. 

కట్ చేస్తే -

సినీ ఫీల్దు ఒక కాసినో. 
ఎందరో వస్తుంటారు, పోతుంటారు.
 
కాని దృష్టి మరల్చని కన్సిస్టెన్సీతో ఆడుతూ, రొటేషన్లో దాని నాడి పట్టుకొని కాలర్ ఎగరేసే కాసనోవాలు మాత్రం కొందరే.     

- మనోహర్ చిమ్మని 

Friday, 2 January 2026

Freedom Is a Design Choice


Freedom doesn’t happen by accident.
It doesn’t arrive through rebellion, motivation, or luck.

Freedom is designed.

It comes from saying no to distractions, cutting unnecessary dependencies, choosing one clear path, and paying the price early. Comfort delays freedom. Structure accelerates it.

Most people say they want freedom—but they design lives that keep them dependent, scattered, and busy without progress.

Whether it’s cinema, writing, or life itself, freedom demands deliberate choices and ruthless clarity.

Design your days.
Design your focus.
Design your freedom.

Because the life you want doesn’t appear.
It’s built.

- Manohar Chimmani 

ఆనందో బ్రహ్మ


మైండ్ చేంజెస్ లైక్ వెదర్... అని ఇంగ్లిష్‌లో ఒక కొటేషన్ ఉంది.

జీవితంలో కొన్ని అనుభవాల తర్వాత - ఒక్కటే ఆలోచనతోనో, ఒక్కటే ఆలోచనావిధానంతోనో ఒక గీత గీసినట్టుగా ఉండటం అనేది అన్నివేళలా అందరికీ సాధ్యం కాదు. 

జీవితం వైరుధ్యాలమయం.   

ముఖ్యంగా క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి.  

కట్ చేస్తే -

9-6 వర్క్‌కు అలవాటుపడని మనిషి జీవితమంతా ప్రయోగాలే. 

ఎక్కడో ఒక్కచోట, ఎప్పుడో ఒకప్పుడు మనకిష్టమైన ఆ యురేకా క్షణం వస్తుంది. రాకపోవచ్చుకూడా.  

వస్తుందని ఎదురుచూడకుండా, రాదని నిరాశ చెందకుండా, మనకిష్టమైన ఆ క్షణాన్ని తెచ్చుకోవడం పైనే మన దృష్టిపెట్టాలి. తెచ్చుకోవాలి. అసాధ్యమేం కాదు. కాకపోతే, ఇదింకో ప్రయోగమవుతుంది. 

ప్రపంచం మెచ్చే సార్థకతనా? మన మనసుకి ఇష్టమైన ఆనందమా?

ఏదో ఒక అంతిమరేఖను తాకడమే విజయమా? ఆ ప్రాసెస్‌లో అనుక్షణం ఆనందాన్ని అనుభవిస్తుండటం విజయమా?   

ఇది తెలుసుకోవడమే జ్ఞానం. 

- మనోహర్ చిమ్మని     

Finishers Win


Most people love starting.
Very few love finishing.

Starting gives excitement. Finishing demands discipline. And life—quietly, consistently—rewards only those who finish.

In films, in money, in relationships, in personal goals, the pattern is the same. The world is full of half-written scripts, half-built careers, and half-lived lives.

Finishing one meaningful thing changes something deep inside you. It reshapes your self-image. You stop seeing yourself as someone who tries and start seeing yourself as someone who delivers.

The real game isn’t about how many things you begin.
It’s about how many you complete.

Finish what you start.
Finish well.

- Manohar Chimmani 

Life Loves Speed


Life doesn’t wait for perfect clarity.
It rewards movement.

Unfortunately, most of us realize this only after wasting precious years—experimenting without direction, circling the same doubts, confusing motion with progress.

Looping. Looping. Looping.

At some point, you have to put a full stop.

That pause creates an aha moment—the moment you finally recognize what you truly love, what lights you up from within. Not what looks good outside. Not what pleases others. But the one thing that feels undeniably yours.

Once you see it, hesitation becomes expensive.

Go all in. Do whatever it takes to earn the freedom to create that moment again and again. Protect it. Feed it. Live from it.

Because life loves speed.
And life is one.

- Manohar Chimmani