జీవితంలో కొన్ని అనుభవాల తర్వాత, ఒక్కటే ఆలోచనతో గీత గీసినట్టుగా ఉండటం అనేది అన్నివేళలా అందరికీ సాధ్యం కాదు.
ముఖ్యంగా క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి.
కట్ చేస్తే -
9-6 వర్క్‌కు అలవాటుపడని మనిషి జీవితమంతా ప్రయోగాలే.
ఎక్కడో ఒక్కచోట, ఎప్పుడో ఒకప్పుడు మనకిష్టమైన ఆ యురేకా క్షణం వస్తుంది.
వస్తుందని ఎదురుచూడకుండా, మనకిష్టమైన ఆ క్షణాన్ని తెచ్చుకోవడం పైనే దృష్టిపెట్టాలి. తెచ్చుకోవాలి. అసాధ్యమేం కాదు. ఇది ఇంకో ప్రయోగమవుతుంది.
ప్రపంచం మెచ్చే సార్థకతనా?
మన మనసుకి ఇష్టమైన ఆనందమా?
ఇది తెలుసుకోవడమే జ్ఞానం.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani