హాలీవుడ్‌లో కాని, బాలీవుడ్‌లో కాని ఒక కొత్త సినిమా రిలీజ్ అయినరోజు ఇంత హడావిడీ, ఇంత నాన్సెన్స్ ఉండదు.
ఇంత దారుణంగా, ఎగబడి ఎగబడి, ఆరోజే విడుదలైన ఒక కొత్త సినిమా మీద ఎవ్వరూ ఇంతలా విషం కక్కరు. ఏం పనిలేనట్టు అసలింత ఎచ్చులకు పోరు. ఇంత హైరానా పడరు.
బాగుంది, బాగాలేదు అని సింపుల్‌గా చెప్పొచ్చు. నిర్మాణాత్మకంగా, క్లుప్తంగా ఎందుకు బాగాలేదో చెప్పొచ్చు.
"రాజాసాబ్" ఒక సినిమా.
కొందరికి బాగుండొచ్చు, కొందరికి బాగలేకపోవచ్చు. అది సహజం.
సినిమా ఊహించిన రేంజ్‌లో లేకపోవచ్చు. హైప్ ఇచ్చిన స్థాయిలో లేకపోవచ్చు.
దానికి ఇంత సీన్ అవసరమా?
ఏదో ప్రకృతి విపత్తు వచ్చినట్టు అపసోపాలు పడిపోతూ, ఏదో కొంపలు మునిగినట్టు, ఏవో నేరాలు ఘోరాలు జరిగినట్టు... అంత దూకుడుగా పోటీపడుతూ, ఆఘమేఘాల మీద అంత భీభత్సంగా రివ్యూలు చెప్పడం అవసరమా?
కొంతమంది రివ్యూయర్స్ అయితే - అసలు వాళ్ళింట్లోనో, వాళ్ళ కుటుంబంలోనో ఏదో జరక్కూడనిది జరిగినట్టు నిట్టూర్పులిడుస్తూ, విషాదంగా మొహాలు పెట్టి, బాధాతప్త హృదయాలతో రివ్యూలు కక్కారు.
కొంతమంది రివ్యూయర్స్ అయితే - అసలు వాళ్ళింట్లోనో, వాళ్ళ కుటుంబంలోనో ఏదో జరక్కూడనిది జరిగినట్టు నిట్టూర్పులిడుస్తూ, విషాదంగా మొహాలు పెట్టి, బాధాతప్త హృదయాలతో రివ్యూలు కక్కారు.
కట్ చేస్తే -
అదొక సినిమా.
జస్ట్ ఒక ఎంటర్‌టైన్మెంటు.
చూడాలనుకున్నవాళ్ళు చూస్తారు. వద్దు అనుకున్నవాళ్ళు చూడరు.
ఆ చూసేవాళ్లని కూడా చెడగొట్టే ఈ కూతలెందుకు?
ఇదేదో సామెత చెప్పినట్టు లేదూ?
- మనోహర్ చిమ్మని
.jpeg)
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani