Thursday, 8 January 2026

మందు అలవాటు లేనివాడు మందు కనిపెడితే...


... అది "ఓల్డ్ మాంక్ రమ్" అవుతుంది! 

నిజం. 
ఓల్డ్ మాంక్ రమ్‌ను తయారుచేసిన బ్రిగేడియర్ కపిల్ మోహన్‌కు అసలు మందే కాదు, వేరే ఏ అలవాట్లూ లేవు. టీటోట్లర్!

ఓల్డ్ మాంక్ రమ్ టేస్ట్ లాగే, దాని నేపథ్యం కూడా ఐకానిక్‌గా ఉంటుంది. 

ఇండియాలో ఉన్న అన్ని రమ్‌ల్లో ఓల్డ్ మాంక్ రమ్ స్పెషల్. మన దేశం నుంచి సుమారు 30 దేశాలకు ఎగుమతి అవుతూ, ప్రపంచంలో అత్యధికంగా సేలయ్యే డార్క్ రమ్ కూడా ఓల్డ్ మాంకే! 

ప్రపంచంలోని డార్క్ రమ్ ప్రియులంతా ఎక్కువగా త్రాగేది ఇదే రమ్. 

ఓల్డ్ మాంక్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే - దీని కోసం ఎప్పుడూ యాడ్స్ ఇవ్వలేదు. బిల్ బోర్డ్స్, ఫ్లెక్సీలు పెట్టలేదు. జస్ట్ మౌత్ టాక్‌తోనే దీనికి ఇంత ప్రచారం వచ్చింది.

కట్ చేస్తే - 

నేను కర్నూలు ఆలిండియా రేడియో ఎఫ్ఎమ్‌లో పనిచేస్తున్నప్పుడు, నా కొలీగ్-మిత్రులు మోహన్ రెడ్డి, కామేశ్వరరావు, నేను కలిసి అప్పుడప్పుడు తుంగభద్ర ఒడ్డున రివర్‌వ్యూ బార్‌కి వెళ్ళేవాళ్ళం.   

బార్ ఆవరణలోనే ఉండే మినీ ట్యాంక్‌బండ్ లాంటి స్పేస్‌లో స్పెషల్‌గా టేబుల్, చెయిర్స్ వేయించుకొని కూర్చునేవాళ్లం. రెండుమూడు గంటలు అలా ఊరికే గడిచిపోయేది. 

బార్ లోపల ఆర్కెస్ట్రాలో పాడుతుండే జానీ బాషా మధ్యమధ్యలో వచ్చి పలకరించి వెళ్తుండేవాడు. జానీ బాషా మా ఎఫ్ఎమ్‌లో క్యాజువల్ ఎనౌన్సర్‌గా కూడా పనిచేస్తుండేవాడు. 

తుంగభద్ర ఒడ్డున మా సిట్టింగ్ అలా ఒక రెండుమూడు గంటలు గడిచాక, దూరంగా మాకు కనిపించే రైల్వే బ్రిడ్జి పైన ఒక ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ వెళ్ళేది. అప్పుడు నెమ్మదిగా లేచేవాళ్ళం. 

తుంగభద్ర ఒడ్డున రివర్-వ్యూ బార్లో మేము అప్పట్లో సేవించిన ఆ పానీయం ఇంకేదో కాదు... ది గ్రేట్ ఓల్డ్ మాంక్! 

- మనోహర్ చిమ్మని 

గమనిక: సోషల్ డ్రింకింగ్ ఆరోగ్యానికి అంత హానికరం కాదు... అనేది నిజం. 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani